డ్రైవర్ బాబూ.. ఈ బోర్డులు గమనిస్తూ సాగిపో...!!
డ్రైవర్ బాబూ.. ఈ బోర్డులు గమనిస్తూ సాగిపో...!!
Published Wed, Aug 10 2016 9:20 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM
చల్లపల్లి :
వైజాగ్ – చెన్నై జాతీయ రహదారిలో విజయవాడకు ప్రత్నామ్యాయంగా మారిన చల్లపల్లిలో పోలీసులు రూట్ సూచించే బోర్డులను ఏర్పాటు చేశారు. కృష్ణా పుష్కరాలకు విజయవాడలో వాహనాల రద్దీ నియంత్రించేందుకు వైజాగ్ – చెన్నై జాతీయ ర హదారిలో విజయవాడ మీదుగా వెళ్లే వాహనాలను పోలీసులు మచిలీపట్నం – చల్లపల్లి – పులిగడ్డ – రేపల్లె – ఒంగోలు మీదుగా మళ్లించనున్నారు. ట్రాఫిక్ మళ్లింపు దృష్ట్యా ఈ రూట్‌లోకి కొత్తగా వచ్చే డ్రైవర్ల అవగాహన కోసం బోర్డులు ఏర్పాటు చేశారు. చల్లపల్లి నుంచి ఒంగోలు 137 కిలోమీటర్లు, చీరాల 84 కిలోమీటర్లు దూరం. ఈ మేరకు బందరురోడ్డులో ప్రధాన కూడలికి చేరువలో రూట్ బోర్డు పెట్టారు. విజయవాడ, మచిలీపట్నం వైపుల నుంచి వచ్చే వాహనాలకు డైవర్షన్ బోర్డులను ప్రధానకూడలిలో ఏర్పాటు చే శారు.
Advertisement
Advertisement