రాజధాని ప్రాంతంలో ట్రాఫిక్‌ మళ్లింపు | Traffic diversion Amaravati territories | Sakshi
Sakshi News home page

రాజధాని ప్రాంతంలో ట్రాఫిక్‌ మళ్లింపు

Published Thu, Oct 27 2016 10:14 PM | Last Updated on Mon, Sep 4 2017 6:29 PM

Traffic diversion Amaravati territories

వీఐపీలు, సాధారణ ప్రజలకు వేర్వేరు రూట్‌లు
 
సాక్షి, గుంటూరు: రాజధాని ప్రాంతంలోని రాయపూడి– లింగాయపాలెం గ్రామాల మధ్య శుక్రవారం జరగనున్న ప్రభుత్వ కార్యాలయ భవనాల శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు పలువురు వీవీఐపీలు రానున్న నేపథ్యంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు గుంటూరు రూరల్‌ ఎస్పీ నారాయణనాయక్‌ తెలిపారు.
  • విజయవాడ నుంచి వచ్చే వీఐపీల వాహనాలు మొదటి రూట్‌లో కరకట్ట మీదుగా ఉద్దండరాయునిపాలెం బొడ్రాయి అక్కడ నుంచి లింగాయపాలెం నుంచి వీఐపీ పార్కింగ్‌కు వెళ్లాలని సూచించారు. రెండో రూట్‌లో కరకట్ట మీదుగా వెంకటపాలెం– మందడం– వెలగపూడి– ఉద్దండరాయునిపాలెం బొడ్డురాయి– లింగాయపాలెం– వీఐపీ పార్కింగ్‌కు చేరుకోవాలని చెప్పారు.
  • గుంటూరు నుంచి వచ్చే వీఐపీ వాహనాలు తాడికొండ మీదుగా తుళ్లూరు– రాయపూడి నుంచి కరకట్ట వైపు వచ్చి లింగాయపాలెం వెనుకవైపు ఉన్న వీఐపీ పార్కింగ్‌కు చేరుకోవాలి.
  • విజయవాడ వైపు నుంచి సామాన్య ప్రజలు ఉండవల్లి సెంటర్‌ నుంచి పెనుమాక– కృష్ణాయపాలెం– వెలగపూడి– రాయపూడి నర్సరీ– లింగాయపాలెం ఎన్‌సీసీ కాంక్రీట్‌ లిక్కర్‌ పార్కింగ్‌ ప్లేస్‌లో ఆర్టీసీ, సిటీ బస్సులకు పార్కింగ్‌ ఉంది. దాని వెనుక కార్లు, ద్విచక్ర వాహనాలకు పార్కింగ్‌ ఏర్పాటు చేశారు. మంగళగిరి నుంచి వచ్చే వాహనాలు ఎర్రబాలెం– కృష్ణాయపాలెం– వెలగపూడి– రాయపూడి నర్సరీ– లింగయపాలెం ఎన్‌సీసీ కాంక్రీట్‌ లిక్కర్‌ పార్క్‌ వద్ద పార్కింగ్‌ ఏర్పాటు చేశారు.
  • గుంటూరు నుంచి వచ్చే సాధారణ వాహనాలు తాడికొండ మీదుగా తుళ్లూరు– రాయపూడి నర్సరీ– లింగాయపాలెం ఎన్‌సీసీ కాంక్రీట్‌ లిక్కర్‌ పార్క్‌ వద్ద పార్కింగ్‌ చేసుకోవాలని సూచించారు. వీఐపీలు, ప్రజలు ట్రాఫిక్‌ మళ్ళింపులను గుర్తించి పోలీసులకు సహకరించాలని  నాయక్‌ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement