రాకపోకలు తెలుపుతూ ఊర్ల పేర్లతో ఏర్పాటు చేసిన సూచిక బోర్డులు అగమ్యగోచరంగా కనిపిస్తున్నాయి, వాహనదారులు చూసి తికమక పడి తమ గమ్యస్థానానికి చేరుకోవడానికి నానాతంటాలు పడుతున్నారు. బోర్డు ఉన్నా అర్థంకాక అడిగి వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. వేల రూపాయలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన సూచిక బోర్డుల్లో తప్పులు దొర్లకుండా చూడాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
బీఆర్‌టీఎస్ రోడ్డుపై ఏర్పాటు చేసిన బోర్డులో రోడ్ల పేర్లు, దూరం తప్పుల తడకగా ఉంది. మీటర్లు అని రాయాల్సినచోట కిలోమీటర్లు, దుర్గాపురం సమీపంలో ఏర్పాటు చేసిన బోర్డులు సగం విరిగి ఉన్నాయి. రాష్ట్ర రాజధాని ప్రాంతమైన విజయవాడకు ఎంతో మంది కొత్తవారు రోజూ వస్తుంటారు. సూచికబోర్డుల్లో దొర్లిన ఈ తప్పులను సరిచేయడంపై దృష్టిపెట్టాల్సి ఉంది.
– ఫొటోలు నడిపూడి కిషోర్, విజయవాడ
Comments
Please login to add a commentAdd a comment