బీబీఎంపీ సమావేశంలో వాగ్వాదం
బెంగళూరు: బీబీఎంపీ సర్వసభ్య సమావేశంలో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. మీరు అవినీతికి పాల్పడ్డారంటూ ఒకరిపై ఒ కరు ఆరోపణలు చేసుకున్నారు. బుధవారం బీబీఎంపీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంలో బీజే పీ సీనియర్ కార్పొరేటర్లు మాట్లాడుతూ.. బీబీఎంపీ రాజరాజేశ్వరినగర ఉప విభాగంలోని అభివృద్ధి పనుల ఫైళ్లను తన ఇంటిలో ఉంచుకొని గోల్‌మాల్‌కు పాల్పడిన శాసన సభ్యుడు మునిరత్న వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని పట్టుబట్టారు. ఆ సమయంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. బీబీఎంపీలో జరిగి న అన్ని అభివృద్ధి పనుల్లో గోల్‌మాల్ జరిగిందని, ఈ మొత్తం వ్యవహారం సీబీఐతో దర్యాప్తు చేయించాలని డి మాండ్ చేశారు. అంతేకాని ఒక్క మునిరత్న మీద సీబీఐ దర్యాప్తు చేయించాలని చెప్పడం సిగ్గు చేటు అన్నారు.
ఈ సందర్బంలో బీజేపీ కార్పొరేటర్లు ‘కాంగ్రెస్ డౌన్‌డౌన్... మునిరత్న రాజీనామా చేయాలి’ అని నినాదాలు చేస్తూ మేయర్ పోడియం దగ్గరకు దూసుకు వెళ్లారు. కాంగ్రెస్ కార్పొరేటర్లు ‘బీజేపీ డౌన్‌డౌన్’ అంటూ నినాదాలు చేస్తు మేయర్ పోడియం దగ్గరకు వెళ్లారు. ఇరు పార్టీల నాయకులు పరస్పరం నినాదాలు చేసుకోవడంతో ఎవరు ఏమి మాట్లాడుతున్నారో అ ర్థం కాలేదు. మేయర్ శాంతకుమారి సభను పలుసార్లు వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభం అయినా ఇదే పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంలో బీజేపీ కార్పొరేట ర్ (లగ్గేరి) లక్ష్మికాంతరెడ్డి మాట్లాడుతూ బీబీఎంపీ రా జరాజేశ్వరి నగర ఉప విభాగం కార్యాలయంలో ఉండవలసిన ఫైల్‌లు మునిరత్న భవనంలో ఎలా ఉన్నాయి అని కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పి తరువాత మాట్లాడాలని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ సందర్భంలో ఇరు పార్టీల సీనియర్ కార్పొరేటర్లు ఒకరి మీద ఒకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకున్నారు.
నాకు ఎలాంటి సంబంధం లేదు : మునిరత్న
బుధవారం బీబీఎంపీ సమావేశానికి ఇక్కడి రాజరాజేశ్వరి నగర నియోజక వర్గం శాసన సభ్యుడు మునిరత్న హాజరైనాడు. గందరగోళం జరుగుతున్న సమయంలో తనకు మాట్లాడటానికి అవకాశం ఇవ్వాలని మేయర్‌కు మనవి చేశారు. అయితే మునిరత్న మాట్లాడటానికి పాలికె సమావేశంలో అవకాశం చిక్కలేదు. తరువాత ఆ యన సభ నుంచి బయటకు వచ్చి పాలికె కార్యాలయం ఆవరణంలో మీడియాతో మాట్లాడారు. లోకాయుక్త అ ధికారులు స్వాధీనం చేసుకున్న ఫైల్‌లకు తనకు ఎలాం టి సంబంధం లేదని స్పష్టం చేశారు. జరిగిన వాస్తవం చెప్పడానికి తాను పాలికె సమావేశంలో ప్రయత్నిం చినా అవకాశం ఇవ్వలేదని, కావాలని తనను కేసులో ఇరికించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.