సాక్షి, బెంగళూరు : బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) మహాసంగ్రామం నేపథ్యంలో బల మైన ప్రత్యర్థులపై పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు ప్రారంభించింది. అందులో భాగంగానే బీజేపీ హయాంలో జరిగిన అవినీతి పై ఓ చార్జ్‌షీట్‌ను రూపొందించి, ఆ చార్జ్‌షీట్‌తోనే ప్ర జల ముందుకు వెళ్లాలని భావి స్తోంది.
ఇందుకు ముఖ్యమంత్రి సిద్దరామయ్య అధ్యక్షతన బుధవారమిక్కడి సీఎం క్యాంపు కార్యాలయం కృష్ణాలో నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ, పార్టీ పెద్దల సమావేశంలో అంగీకారం సైతం లభించినట్లు సమాచారం. ఇక బీబీఎంపీ ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహం పై చర్చించేందుకు గాను సీఎం క్యాంపు కార్యాలయం కృష్ణాలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో కేపీసీసీ అధ్యక్షుడు జి.పరమేశ్వర్‌తో పాటు మంత్రులు కె.జె.జార్జ్, రామలింగారెడ్డి, దినేష్ గుండూరావ్, పార్టీ పధాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ....‘గత ఏడెనెమిది ఏళ్లుగా బీబీఎంపీ వ్యవస్థను మొత్తం నాశనం చేశారు. చెత్త నిర్వహణ, స్వచ్ఛత, రోడ్ల నిర్వహణ ఇలా అన్ని విభాగాల్లోనూ అనేక లోపాలు, అవినీతి చోటుచేసుకున్నాయి. గత రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం బీబీఎంపీ కోసం రూ.3,700కోట్లు విడుదల చేసింది.
గత ఏడాది బీబీఎంపీ కోసం కేటాయించిన రూ.1,500కోట్ల నిధులను టారు-నీరు పేరిట పూర్తిగా దుర్వినియోగం చేశారు. అందుకే ఈ ఏడాది బీబీఎంపీకి బదులుగా రాష్ట్ర ప్రజాపనుల శాఖ ఆధ్వర్యంలో పనులు చేయిస్తున్నాం. ఈ అవినీతి అంశాలన్నింటిపై ఓ చార్జ్‌షీట్‌ను రూపొందించి ప్రజల సమక్షంలో విడుదల చేయాలి’ అని ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనకు పార్టీ, ప్రభుత్వం నుంచి అంగీకారం లభించినట్లు తెలుస్తోంది. ఇక బీబీఎంపీ ఎన్నికల్లో ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొనేందుకు గాను మరికొన్ని విషయాలను ఈ సమావేశంలో చర్చించారు.
- బీబీఎంపీ ఎన్నికలను హైకమాండ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఈ ఎన్నికల్లో విజయం కోసం ఐకమత్యంగా శ్రమించాలి.
- బీజేపీ నేతలు ఎక్కువగా ప్రచారం పై దృష్టి సారిస్తున్నారు. వారు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాల గు రించి ప్రస్తావిస్తే, అందులో ఏమాత్రం నిజం లేదని ప్రజలను నమ్మించేందుకు మనం శ్రమించాలి. అందుకే మనం కూడా ఎక్కువగా ప్రచారంపై దృష్టి సారించాలి.
- పార్టీ ఏర్పాటు చేసిన అధికార ప్రతినిధుల బృందం ఏదైనా మీడియా చర్చలో పాల్గొనే సమయంలో పూర్తి సమాచారాన్ని క్రోడీకరించుకొని హాజరుకావాలి.
బీజేపీపై చార్జ్‌షీట్‌కు రెడీ..
Published Thu, Aug 6 2015 3:27 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement