చెత్త రహితానికి నజరానా
బీబీఎంపీ కార్పొరేటర్లకు సీఎం తాయిలం
బెంగళూరులో ప్లాస్టిక్ నిషేధానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటన
కపై 15 రోజులకొకసారి నగర పర్యటన
బెంగళూరు(బనశంకరి) : బృహత్ బెంగళూరు మహా నగర పాలికె (బీబీఎంపీ) పరిధిలోని వార్డులను చెత్త రహితంగా తీర్చిదిద్దిన కార్పొరేటర్లకు పారితోషకం అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. జాతీయ నగర ఆరోగ్య మిషన్ కార్యక్రమం అమలుపై పాలికె సభ్యులకు వికాససౌధలో బుధవారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బెంగళూరులో ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందుకు బీబీఎంపీ సభ్యులు పూర్తిగా సహకరిం చాలని అన్నారు. రహదారులపై చెత్తను తొల గించడంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని, ఫలితంగా అపరిశుభ్రత పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. చెత్తను తొలగించేందుకు పాలికె సభ్యులు తొలి ప్రాధాన్యతనివ్వాలని అన్నారు. నగరంలో రోజూ నా లుగున్నర టన్నుల చెత్త పోగవుతోందని, ఇంత చెత్త సేకరణ కష్టమవుతోందని తెలిపారు. గార్డెన్‌సిటీగా పేరుపొందిన బెంగళూరు నగరం ప్ర స్తుతం గార్బేజ్‌సిటీ అనే పేరుపొందిందని ఈ చెడ్డ పేరును తొలగించడానికి కృషి చేయాలన్నారు.
చెత్తసేకరణ సంస్కరణలకు తమ ప్రభుత్వం అవసరమైన సహయసహకారాలు అందిస్తుందని పేర్కొన్నారు. ఆక్రమణలకు గురైన నగరంలోని చెరువులు, రాజకాలువలను గుర్తించి తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. ఒకపై ప్రతి 15 రోజులకొకసారి తాను బెంగళూరులోని వీధుల్లో పర్యటిస్తానని, ఆ సమయంలో చెత్త సేకరణ, విధుల్లో నిర్లక్ష్యం కనబరిచిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడే అధికారులకు మద్దతు ఇవ్వరాదంటూ పాలికె సభ్యులకు సూచించారు. నగర పరిధిలో తాగునీటి లీకేజీలను అరికట్టాలన్నారు. అనంతరం బీబీఎంపీ ప్రతిపక్షనేత పధ్మనాభరెడ్డి మాట్లాడుతూ నగరంలో పూర్తిగా ప్లాస్టిక్ ను నిషేదించడం సాధ్యం కావడం లేదన్నారు. గతంలో ప్లాస్టిక్ నిషేదించాలని ప్రభుత్వానికి ప్రస్తావించామని, ప్రస్తుతం ప్రభుత్వం ప్లాస్టిక్ ను నిషేదిస్తే తామంతా సహకరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు యు.టి.ఖాదర్, రామలింగారెడ్డి, దినేశ్‌గుండూరావు, మేయర్ మం జునాథరెడ్డి, డిప్యూటీ మేయర్ హేమలతాగోపాలయ్య, కమిషనర్ కుమార్‌నాయక్, ఎమ్మెల్యేలు అశ్వత్థనారాయణ, గోపాలయ్య, బీ బీఎంపీ ఆర్థిక స్థాయీ సమితి అధ్యక్షుడు ముజాహిద్దిన్‌పాషా, బీబీ ఎంపీ పాలనా విభాగం నేత అశ్వత్థనారాయణ, కుటుంబసంక్షేమ శాఖా ప్రధాన కార్యదర్శి అతుల్‌కుమార్ తివారీ పాల్గొన్నారు.