కావేరీ నదీ జలాల సంక్షోభం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు కష్టాలను తెచ్చిపెడుతోంది. కొందరు బీజేపీ కార్యకర్తలు సీఎంపై మాండ్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశారు. రాష్ట్రానికి ఓ వైపు అవసరమైన నీళ్లు లేని సమయంలో ఇతర రాష్ట్రాలకు నీళ్లు వదిలి కర్ణాటక రైతులను సిద్ధరామయ్య మోసం చేస్తున్నారంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. కావేరి జలాలను క్రిష్ణ రాజ సాగర రిజర్వాయర్ నుంచి తమిళనాడుకు విడుదల చేయడంపై ఆగ్రహం చెందిన రైతులు శుక్రవారం పెద్ద ఎత్తున నిరసన తెలిపిన విషయం తెలసిందే.
పొరుగు రాష్ట్రానికి నీళ్లు ఇస్తూ తనను నమ్ముకున్న కర్ణాటక రైతులను మోసం చేశారని ఆ కార్యకర్త ఆరోపించాడు. నీటి విడుదల కారణంగా మాండ్య జిల్లాలోని పంటలకు నీటి కష్టాలు తప్పవు. సిద్దరామయ్య చర్య వల్ల ఆ జిల్లా రైతులు మోసపోతున్నారని ఫిర్యాదు చేశాడు. అయితే ఇప్పటివరకూ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఓ పోలీస్ అధికారి తెలిపారు.
తమిళనాడుకు ప్రతిరోజూ 15వేల క్యూసెక్కుల నీళ్లు ఇస్తూనే ఉంటే.. ఇక మీదట బెంగళూరు నగర వాసులకు తాగడానికి నీళ్లుండవని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఉత్తర్వులను పాటించడానికి మాత్రమే నీటిని విడుదల చేశామని, వాస్తవానికి తమిళనాడు పరిస్థితి కర్ణాటక కంటే చాలా మెరుగ్గా ఉందని కూడా ప్రధానికి రాసిన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు.
మోసం చేశారంటూ సీఎంపై ఫిర్యాదు
Published Sat, Sep 10 2016 1:18 PM | Last Updated on Thu, Sep 27 2018 8:27 PM
Advertisement