
వలస కార్మికుల కోసం ఎవరికి వీలైన సహాయం వాళ్లు చేస్తున్నారు. వాళ్లను సొంత ఊళ్లకు పంపుతూ కొందరు, వాళ్లకు కావాల్సిన సరుకులను అందిస్తూ మరికొందరు సహాయం చేస్తున్నారు. నిధీ అగర్వాల్ కూడా తన వంతు సహాయంగా వలస కార్మికులకు కావాల్సిన ఆహారాన్ని (బ్రెడ్ మరియు జామ్) అందిస్తున్నారు. వాటిని ఆవిడే స్వయంగా ప్యాక్ చేస్తున్నారు కూడా. ఇక్కడ ఉన్న ఫొటోను షేర్ చేసి, ‘వలస కూలీలకు ఆహారం. వాళ్లకు సహాయపడటం మన బాధ్యత’’ అన్నారు నిధీ అగర్వాల్.