సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పాజిటివ్ పోస్ట్‌లే చేయాలని అంటున్నారు హీరోయిన్ నిధీ అగర్వాల్. సోషల్ మీడియా గురించి నిధీ మాట్లాడుతూ– ‘‘కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో సోషల్ మీడియాలో బాధితుల సహాయానికి సంబంధించిన పోస్టులను మనం గమనిస్తూనే ఉన్నాం. ఇటువంటి సందర్భాల్లో కూడా కొందరు నెగటివ్ కంటెంట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు.
ఆక్సిజన్ సిలిండర్లు, ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న బెడ్స్ సంఖ్య వంటి వివరాల గురించి కచ్చితమైన సమాచారం తెలిసినప్పుడు సోషల్æమీడియాలో పోస్ట్ చేస్తే అది కొందరికైనా ఉపయోగడపడుతుంది. పరోక్షంగా మనం కూడా సహాయం చేసినవాళ్లం అవుతాం. అంతేకానీ నెగటివ్ పోస్టుల వల్ల ఏ ప్రయోజనం ఉండదు. కరోనా పాజటివ్ నేపథ్యంలో అందరిలో పాజిటివిటీ పెంచే నాలుగు మాటలు చెబితే మంచిది’’ అని పేర్కొన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘ఈ కోవిడ్ పరిస్థితుల్లో నా వ్యక్తిగత సిబ్బందికి ఏమైనా ఇబ్బందులు కలిగితే వారికి నేను అండగా ఉంటాను. అది నా బాధ్యత కూడా’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment