
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో 34 మంది డిశ్చార్జి కావడంతో సోమవారానికి కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,366కు చేరింది. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు 10,567 మందికి పరీక్షలు నిర్వహించగా 105 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. సోమవారం నమోదైన కేసుల్లో 8 కోయంబేడుకు సంబంధించినవి ఉండగా, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 28 మందికి, విదేశాల నుంచి వచ్చిన ఒకరు ఉన్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,676కు చేరుకుంది. ఇందులో 446 వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు, 234 కోయంబేడు కేసులు, 112 విదేశాల నుంచి వచ్చిన వారివి ఉన్నాయి. కోవిడ్ వల్ల కర్నూలు జిల్లాలో ఇద్దరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 64కు చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 1,246గా ఉంది.