
సోనూ సూద్
అక్షర జ్ఞానాన్ని ఇస్తే గురువని, ఆర్థిక సహాయం చేస్తే దాత అని, ఆపదలో ఉన్నవాళ్లని ఆదుకుంటే దేవుడని అంటారు. ‘‘ఈ కరోనా కాలంలో సోనూ సూద్ మా పాలిట దేవుడు’’ అని పలువురు వలస కార్మికులు అంటున్నారు. ప్రత్యేక బస్సుల్లో వలస కార్మికులు తమ తమ ప్రాంతాలకు వెళ్లే ఏర్పాటు చేశారు సోను. కొందరినైతే ఏకంగా ఫ్లయిట్‌లో కూడా పంపించారు. ఇప్పుడు సహాయంపరంగా ఇంకో మెట్టు ఎక్కారు.
కరోనా కారణంగా చాలామంది తమ ఉద్యోగాలు కోల్పోయి, దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వారందరి కోసం సోనూ సూద్ ఓ కొత్త æయాప్‌ను తయారు చేయించారు. ఈ యాప్ ద్వారా అవసరంలో ఉన్నవారి అర్హతలను బట్టి ఉద్యోగం ఇచ్చే ఏర్పాటు చేస్తారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి మాత్రమే అవకాశం కల్పిస్తారు. ‘‘అర్హులందరికీ తప్పకుండా ఈ యాప్‌తో సాయం అందుతుంది’’ అంటున్నారు సోనూ సూద్.
Comments
Please login to add a commentAdd a comment