Job creation
-
కొత్త ఏడాదిలో 10 లక్షల కొలువులు!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం ఉద్యోగాల కల్పనపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. కృత్రిమ మేధస్సు (ఏఐ) వంటి అధునాతన సాంకేతికత కూడా ఈ అంశాన్ని ప్రభావితం చేస్తోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే కొత్త ఏడాదిలో తెలంగాణలో మాత్రం ఉద్యోగాల కల్పన జోరందుకునే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఐటీ పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఒక్క తెలంగాణలోనే వివిధ రంగాల్లో పది లక్షల మేర సాధారణ ఉద్యోగాల కల్పన సాధ్యమని అంటున్నాయి. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్‌తో పాటు ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీలు), బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్ఎస్ఐ) రంగాలతో పాటు రిటైల్ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలొచ్చే అవకాశాలున్నాయని రాష్ట్ర ఐటీ పరిశ్రమల విభాగం అధికారులు చెప్తున్నారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు కూడా ఉద్యోగాల కల్పనకు దోహదపడతాయని అంటున్నారు. గత ఏడాదిలో తెలంగాణలో నిరుద్యోగిత రేటు 8.8 శాతం నుంచి 7.1 శాతానికి తగ్గగా, 2025లో ఇది మరింత తగ్గుతుందని వివిధ నివేదికలు వెల్లడిస్తుండటం గమనార్హం. పెరుగుతున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 2024 ఏప్రిల్ నుంచి సెపె్టంబర్ వరకు ఆరు నెలల వ్యవధిలోనే రాష్ట్రానికి రూ.12,864 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) వచ్చినట్లు కేంద్ర పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య విభాగం ప్రకటించింది. 2023తో పోలిస్తే ఎఫ్‌డీఐల్లో 33 శాతం వృద్ధి నమోదు కాగా, రూ.3,185 కోట్లు అదనంగా వచ్చాయి. 2024లో వచ్చిన ఎఫ్‌డీఐల్లో 93 శాతం అంటే రూ.11,970 కోట్లు హైదరాబాద్‌కు రాగా, రంగారెడ్డి జిల్లాకు రూ.680 కోట్లు, మహబూబ్‌నగర్‌కు రూ.116 కోట్లు, మెదక్‌కు 96.99 కోట్లు వచ్చాయి. ఇదేవిధంగా ఎఫ్‌డీఐల రాక కొత్త ఏడాది కూడా కొనసాగుతుందని, ఉద్యోగాల కల్పనకు ఇవి కీలకంగా మారతాయని అధికార వర్గాలంటున్నాయి. ఐటీ రంగంలో గడిచిన రెండేళ్లుగా నెలకొన్న మాంద్యం, భారత్‌లో ఎన్నికల వాతావరణం తదితర కారణాలతో ఉద్యోగ నియామకాలకు దూరంగా ఉన్న అమెరికా, ఐరోపా కంపెనీలు ఈ ఏడాది జరిపే నియామకాల్లో తెలంగాణకు లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారు. జీసీసీలకు కేంద్రంగా తెలంగాణ అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాల (జీసీసీ) ఏర్పాటు ద్వారా ఉద్యోగాల కల్పన భారీగా సాధ్యమవుతుందనే అంచనాలు ఇప్పటికే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జీసీసీలను ఆకర్షించేందుకు బెంగళూరు, ఢిల్లీ, పుణే, ముంబయి, చెన్నై వంటి దేశంలోని ప్రధాన నగరాలతో హైదరాబాద్ పోటీ పడుతోంది. భారత సాంకేతిక వాతావరణం, ఉద్యోగాల కల్పన, మార్కెట్ వృద్ధి, సామర్థ్యాల పెంపుదల తదితరాల్లో 2030 నాటికి ఈ సెంటర్లు కీలక పాత్ర పోషిస్తాయని అంచనా వేస్తున్నారు. గత ఐదేళ్లలో భారత్‌లో ఏర్పాటైన జీసీసీల్లో 30 శాతం హైదరాబాద్‌లోనే ఏర్పాటు కావడం గమనార్హం. ప్రస్తుతం రాష్ట్రంలో 355 జీసీసీలు ఉండగా, సాఫ్ట్వేర్/ఇంటర్నెట్, ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్, ఎఫ్ఎంసీజీ, సెమికండక్టర్, ఫార్మా స్యూటికల్స్, రిటైల్, మెడికల్ డివైసెస్, టెలీ కమ్యూనికేషన్స్, బీఎఫ్ఎస్ఐ, ఆటోమేటివ్, వృత్తిపరమైన సేవల రంగాల్లో కొత్త జీసీసీల ఏర్పాటుకు అంతర్జాతీయ సంస్థలు మొగ్గు చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పాటయ్యే జీసీసీలను కేవలం హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, సిద్దిపేట, మహబూబ్‌నగర్‌లోనూ ఏర్పాటు చేయాలని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సరీ్వస్ కంపెనీస్ (నాస్కామ్) ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. దేశంలోని జీసీసీల్లో పనిచేస్తున్న 19 లక్షల మంది ఉద్యోగుల్లో 12 శాతం మంది తెలంగాణకు చెందిన నిపుణులే ఉండటం గమనార్హం. ఇది వచ్చే రెండేళ్లలో 15 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.ఎంఎస్ఎంఈలదీ పెద్ద పాత్రే.. ప్రస్తుతం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) ద్వారా రాష్ట్రంలో 5.6 లక్షల మంది ఉద్యోగాల్లో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించిన ఎంఎస్ఎంఈ పాలసీ ద్వారా ఈ ఏడాది ఈ రంగంలో ఉద్యోగాల కల్పన 10 నుంచి 15 శాతం మేర పెరిగే అవకాశమున్నట్లు అధికారులు చెప్తున్నారు. -
అగ్రిటెక్ రంగంలో భారీగా కొలువులు
ముంబై: అగ్రిటెక్ రంగంలో వచ్చే ఐదేళ్లలో కొత్తగా 60–80 వేల పైచిలుకు కొలువులు రాగలవని టీమ్‌లీజ్ సర్విసెస్ చీఫ్ స్ట్రాటెజీ ఆఫీసర్ (సీఎస్‌వో) సుబ్బురత్నం తెలిపారు. ఏఐ డెవలప్మెంట్, టెక్నాలజీ, పర్యావరణహిత వ్యవసాయ సొల్యూషన్స్, సప్లై చెయిన్ మేనేజ్మెంట్ తదితర విభాగాల్లో ఉద్యోగావకాశాలు ఉండగలవని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశీయంగా అగ్రిటెక్ రంగంలో సాంకేతిక నిపుణులు, ఆపరేషన్స్ సిబ్బంది, మేనేజర్లు మొదలైన హోదాల్లో 1 లక్ష పైగా ఉద్యోగులు ఉన్నట్లు సుబ్బురత్నం వివరించారు. వ్యవసాయం ఎక్కువగా ఉండే ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ఉద్యోగావకాశాలు అత్యధికంగా ఉండగలవన్నారు. ఇక హైదరాబాద్, బెంగళూరు, పుణె, గురుగ్రామ్లాంటి నగరాలు అగ్రిటెక్ స్టార్టప్‌లకు కీలక కేంద్రాలుగా మారగలవని సుబ్బురత్నం చెప్పారు. హైబ్రిడ్ ఉద్యోగాలు.. అగ్రిటెక్ రంగం ప్రధానంగా సాంకేతిక ఆవిష్కరణలు, అనలిటిక్స్ వంటి అంశాలపై దృష్టి పెడుతుంది కాబట్టి ఈ ఉద్యోగాలు సీజనల్‌గా ఉండవని పేర్కొన్నారు. సీజన్లో నాట్లు వేయడం నుంచి కోతల వరకు వివిధ రకాల పర్యవేక్షణ కార్యకలాపాల్లో పాలుపంచుకునే సిబ్బంది .. ఆఫ్–సీజన్లో డేటా విశ్లేషణ, పరికరాల నిర్వహణ మొదలైన వాటిపై పని చేస్తారని చెప్పారు. సాధారణంగా అగ్రిటెక్ ఉద్యోగాలు హైబ్రిడ్ విధానంలో ఉంటాయన్నారు. సాఫ్ట్వేర్ అభివృద్ధి, డేటా అనలిటిక్స్, పర్యవేక్షణ బాధ్యతలను ఎక్కడి నుంచైనా నిర్వర్తించవచ్చని .. కానీ మెషిన్ ఆపరేటర్లు, ఫీల్డ్ టెక్నీషియన్లు మొదలైన వారు క్షేత్ర స్థాయిలో పని చేయాల్సి ఉంటుందని సుబ్బురత్నం చెప్పారు. కన్సల్టెన్సీ సంస్థ ఈవై నివేదిక ప్రకారం.. ప్రస్తుతం దేశీయంగా వ్యవసాయంలో కేవలం 1.5 శాతమే టెక్నాలజీ వినియోగం ఉంటోందని, ఈ నేపథ్యంలో అగ్రిటెక్ కంపెనీలకు 24 బిలియన్ డాలర్ల వ్యాపార అవకాశాలు అందుబాటులో ఉన్నాయని ఆయన చెప్పారు. ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ ప్రకారం 2022 నాటికి భారత్‌లో సుమారు 450 అగ్రిటెక్ స్టార్టప్‌లు ఉన్నట్లు వివరించారు. -
స్మార్ట్ పీపుల్ కావాలి
వాషింగ్టన్: స్థానిక అమెరికన్లకే అధిక ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న రిపబ్లికన్ల ఎన్నికల హామీకి విరుద్ధంగా విదేశీయులకు హెచ్–1బీ వీసాల జారీని ప్రపంచ కుబేరుడు, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ సహ సారథి వివేక్ రామస్వామి సమర్థిస్తున్న వేళ కాబోయే అమెరికా అధ్యక్షుడు మరోసారి హెచ్–1బీ వీసాలను సమర్థించారు. అమెరికాకు ఎల్లప్పుడూ కేవలం సమర్థవంతులైన వ్యక్తులే అవసరమని ట్రంప్ నొక్కి చెప్పారు. ‘‘ అమెరికాకు ఎల్లప్పుడూ సమర్థవంతులైన వ్యక్తులే కావాలని నేను ఆశిస్తా. స్మార్ట్ జనం మాత్రమే అగ్రరాజ్యంలో అడుగుపెట్టాలి. గతంలో ఎన్నడూ లేనంతగా అమెరికాలో ఉద్యోగ కల్పన జరగ బోతోంది. దేశానికి నైపుణ్యవంతమైన కార్మికుల అవసరం చాలా ఉంది’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా బుధవారం అమెరికాలోని మార్–ఏ–లాగో రిసార్ట్‌లో ట్రంప్‌ను స్థానిక మీడియా పలకరించింది. ‘‘హెచ్–1బీ వీసాలపై నా అభిప్రాయం ఎన్నటికీ మారదు. నిఫుణులే అమెరికాకు కావాలి’’ అని స్పష్టంచేశారు. అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో సమూల సంస్కరణలే లక్ష్యంగా ఏర్పాటైన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీకి సంయుక్త సారథులుగా నియమితులైన ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి హెచ్–1బీ వీసాల జారీని సమర్థిస్తూ వ్యాఖ్యానించడం, వారికి ఇప్పటికే ట్రంప్ మద్దతు పలకడం తెల్సిందే. అయితే అమెరికన్లకే తొలి ప్రాధాన్యం అంటూ ఎన్నికల్లో మెజారిటీ సాధించిన ట్రంప్ ఇప్పుడు మాట మార్చారని అమెరికన్ మీడియా చేస్తున్న వాదనలను ట్రంప్ తోసిపుచ్చారు. మొదట్నుంచీ తాను హెచ్–1బీకి అనుకూలమేనని పునరుద్ఘాటించారు. కేవలం అత్యంత నైపుణ్యమున్న విదేశీ ఉద్యోగులకే ఉపాధి కల్పిస్తూ స్థానిక సాధారణ, తక్కువ నైపుణ్యమున్న అమెరికన్లకు సరైన ఉద్యోగాలు దక్కకపోతే ఆగ్రహావేశాలు భవిష్యత్తులో పెరిగే ప్రమాదముందని రాజకీయ పండితుడు క్రేగ్ ఆగ్రనోఫ్ ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘ ఐటీ రంగంలో ముఖ్యమైన ఉద్యోగాలన్నీ హెచ్–1బీ వీసాదారులకే తన్నుకు పోతే స్థానిక ఐటీ ఉద్యోగార్థుల పరిస్థితి ఏంటి?’ అనే ప్రశ్నకు ఇంతకాలం ఏ నేతా సరైన సమాధానం చెప్పలేకపోతున్నారని క్రేగ్ వ్యాఖ్యానించారు. స్థానిక అమెరికన్లతో పోలిస్తే తక్కువ వేతనాలకే ఎక్కువ నైపుణ్యాలున్న విదేశీయులు లభిస్తుండటంతో అమెరికన్ కంపెనీలు హెచ్–1బీ వీసా విధానం ద్వారా విదేశీయులకే అధిక ప్రాధాన్యతనిచ్చి అమెరికాకు రప్పిస్తుండటం తెల్సిందే. -
కొత్త టెక్నాలజీతో 10 లక్షల ఉద్యోగాలు
న్యూఢిల్లీ: క్వాంటమ్ కంప్యూటింగ్, జనరేటివ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో 2030 నాటికి 10 లక్షల ఉద్యోగాల సృష్టి జరుగుతుందని ఐటీ ప్లేస్మెంట్, స్టాఫింగ్ కంపెనీ క్వెస్ ఐటీ స్టాఫింగ్ నివేదిక వెల్లడించింది. ఏఐ, మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్, బ్లాక్‌చెయిన్ విభాగాలలోని నైపుణ్యాలు వినూత్న అప్లికేషన్లతో పరిశ్రమలను అభివృద్ధి దిశగా నడిపిస్తున్నాయని తెలిపింది. క్వెస్ టెక్నాలజీ స్కిల్స్ రిపోర్ట్–2024 ప్రకారం.. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ కూడా 2030 నాటికి భారత ఆర్థిక వ్యవస్థకు 150 బిలియన్ డాలర్లకు పైగా దోహదపడతాయని అంచనా. ఇది సాంకేతిక నైపుణ్యంలో భారత స్థానాన్ని సుస్థిరం చేస్తుంది. ఆరోగ్య సంరక్షణ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, రిటైల్, ఆటోమోటివ్, తయారీలో ఏఐ/ఎంఎల్ సాంకేతికత మోసాన్ని గుర్తించడం, నిర్ధారణ, నాణ్యత నియంత్రణ ద్వారా సామర్థ్యాన్ని పెంచుతుంది’ అని వివరించింది. అసమాన అవకాశాలను.. ‘టెక్ నియామకాల్లో 43.5 శాతం వాటాతో బెంగళూరు ప్రధమ స్థానంలో ఉంది. హైదరాబాద్ 13.4 శాతం, పుణే 10 శాతం వాటాతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. భారత సాంకేతికత నిపుణులు టెక్నాలజీలో కొత్త మార్పులు తీసుకొస్తున్నారు. జనరేటివ్ ఏఐ, బ్లాక్‌చెయిన్ వంటి సాంకేతికతల జోరుతో 2030 నాటికి భారత ఐటీ రంగం 20 లక్షల ఉద్యోగాలను జోడించనుంది’ అని నివేదిక తెలిపింది. ఏఐ/ఎంల్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అత్యాధునిక సాంకేతికతలతో ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ వంటి సంప్రదాయ నైపుణ్యాల కలయిక అసమాన అవకాశాలను అందిస్తుందని క్వెస్ ఐటీ స్టాఫింగ్ సీఈవో కపిల్ జోషి తెలిపారు. -
ఉచితాలతో ఇంకెంతకాలం?
న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారి సమయం నుంచి వలస కార్మికులకు ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తుండటంపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఉచితాలను ఇంకా ఎంతకాలం ఇస్తారంటూ ప్రభుత్వాలను ప్రశ్నించింది. ఉద్యోగావకాశాల కల్పన, సామర్థ్యాల పెంపుపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంది. జాతీయ ఆహార భద్రత చట్టం కింద 81 కోట్ల మందికి ఉచిత/సబ్సిడీ రేషన్ అందజేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలపగా..దీనర్థం పన్ను చెల్లింపుదార్లను మాత్రమే మినహాయించారని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ మన్మోహన్‌ల ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది. 2020లో కోవిడ్ మహమ్మారి సమయంలో వలస కార్మికులు ఎదుర్కొన్న అవస్థలపై సుమోటోగా దాఖలైన పిటిషన్‌పై ఎన్జీవో తరఫున ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ.. ఇ–శ్రమ్ పోర్టల్ నమోదైన వలస కార్మికులందరికీ ఉచితంగా రేషన్ ఇవ్వాలని కోరారు. స్పందించిన ధర్మాసనంపై వ్యాఖ్యలు చేసింది. ‘వలస కార్మికులందరికీ ఉచితంగా రేషనివ్వాలని రాష్ట్రాలను మేం ఆదేశిస్తే ఒక్కరు కూడా ఇక్కడ కనిపించరు. ఉచిత రేషన్ బాధ్యత ఎలాగూ కేంద్రానిదే కాబట్టి, రాష్ట్రాలు ప్రజలను మభ్యపెట్టడానికి రేషన్ కార్డులను జారీ చేస్తాయి. అసలు సమస్య ఇదే’అని ధర్మాసనం పేర్కొంది. వలస కార్మికుల సమస్యలపై సవివర విచారణ జరపాల్సి ఉందన్న ధర్మాసనం.. తదుపరి విచారణను జనవరి 8వ తేదీన వాయిదా వేసింది. -
రైతులు.. వర్సిటీలు.. ఉద్యోగాలు
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ కల్పన, మెరుగైన విద్య కోసం విశ్వవిద్యాలయాల అభివృద్ధి, రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రాధాన్య అంశాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. గత ప్రభుత్వం కేవలం పదవులు, ఫామ్‌హౌస్‌లు, బంగళాలు, ఆస్తుల జమ లాంటి ప్రాధాన్యతలతో పదేళ్లు అధికారం చలాయించిందని ఆయన ఆరోపించారు. తమ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటోందని.. తనతోపాటు మంత్రులు, అధికారులను ఎవరైనా కలిసి ప్రశ్నించే వెసులుబాటు ఉందన్నారు. రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం కార్యక్రమంలో భాగంగా సివిల్స్ ప్రిలిమ్స్‌లో అర్హత సాధించి మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులకు సింగరేణి కాలరీస్ లిమిటెడ్ ద్వారా ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడారు. స్కిల్స్, స్పోర్ట్స్ వర్సిటీలతో.. ‘గత ప్రభుత్వం పదేళ్లలో పరీక్షలు నిర్వహించకుండా తీవ్ర జాప్యం చేస్తే మేం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. మరో 35 వేల ఉద్యోగాల భర్తీకి చర్యలు వేగవంతం చేశాం. రాష్ట్రంలో సర్టిఫికెట్ కోర్సులకే విద్య పరిమితమైంది. చదువుకు తగిన శిక్షణ లేకపోవడంతో యువత ఉద్యోగావకాశాలు కోల్పోతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించాం. ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలతో వర్సిటీ పాలకమండలిని ఏర్పాటు చేశాం. వర్సిటీ చైర్మన్‌గా ఆనంద్ మహీంద్రాను ఎంపిక చేశాం. ఈ ఏడాది 2 వేల మందికి, వచ్చే ఏడాది 20 వేల మందికి శిక్షణ ఇవ్వనున్నాం. ఇటీవల ఒలింపిక్స్‌లో భారత్‌కు ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. ఈ నేపథ్యంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించాలని నిర్ణయించాం. వచ్చే ఒలింపిక్స్‌లో భారత్‌కు పెద్ద సంఖ్యలో పథకాలు వచ్చేలా క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం’అని రేవంత్ వివరించారు. 100 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు రాష్ట్రంలోని అన్ని వర్సిటీలకు రానున్న పది రోజుల్లో వైస్ చాన్స్లర్లను నియమించనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ‘వీసీల నియామకం పూర్తి కాగానే ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలను కూడా భర్తీ చేస్తాం. గత ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసినట్లు చెప్పుకుంది. కానీ కనీస వసతుల్లేక పౌల్ట్రీ షెడ్లో కోళ్ల మాదిరిగా వాటిని తయారు చేసింది. కానీ మేము మెరుగైన విద్య అందించే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేయనున్నాం. ఒక్కో క్యాంపస్‌ను 20 నుంచి 25 ఎకరాలతో ఏర్పాటు చేస్తాం’అని రేవంత్ తెలిపారు. లక్ష్యంపైనే దృష్టిపెట్టండి.. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షల్లో మెరుగైన మార్కులు సాధించి మెయిన్స్ పరీక్షలకు ఎంపికైన అభ్యర్థులను సీఎం రేవంత్ ప్రత్యేకంగా అభినందించారు. కొంతకాలం ఇంటి సమస్యలను, ఇతర అంశాలను పక్కనపెట్టి కేవలం సివిల్ సరీ్వసుకు ఎంపిక కావాలనే లక్ష్యాన్నే గుర్తుంచుకోవాలని సూచించారు. మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులకు అందించిన రూ. లక్ష ఆర్థిక సాయం పెద్ద మొత్తం కానప్పటికీ ప్రభుత్వం విద్యార్థుల వెంట ఉందనే భావన కలిగించేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నామన్నారు. మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూకు ఎంపికైతే మరో రూ. లక్ష సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఎక్కువ మంది సివిల్స్ ఉద్యోగాలు సాధించి రాష్ట్ర పరపతిని పెంచాలని కోరారు. మానవవనరుల వృద్ధి కోసమే స్కిల్స్ వర్సిటీ: డిప్యూటీ సీఎం భట్టి రాష్ట్రంలో మానవవనరులను మెరుగపర్చేందుకే స్కిల్స్యూనివర్సిటీ ఏర్పాటు చేశామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మేధోసంపత్తిని ప్రోత్సహించి దేశానికి ఉపయోగపడేలా చేస్తామని చెప్పారు. గురుకులాలల్లో మౌలికవసతుల కల్పనకు గతేడాది రూ. 4 కోట్లు ఖర్చు చేస్తే ఈ ప్రభుత్వం రూ. 5 వేల కోట్లను బడ్జెట్లో కేటాయించిందని గుర్తుచేశారు. మూసివేతకు చేరువైన 63 ఐటీఐలను తమ ప్రభుత్వం ఏటీసీలుగా అభివృద్ధి చేసిందని భట్టి వివరించారు. అనంతరం రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సివిల్స్ మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సీఎస్ శాంతికుమారి, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ తదితరులు పాల్గొన్నారు. -
నైపుణ్య యువతరం..ఉద్యోగ భారతం
న్యూఢిల్లీ: దేశంలో భారీగా కొత్త ఉద్యోగాల కల్పన, అందుకు వీలు కల్పించేలా యువతకు నైపుణ్య శిక్షణ లక్ష్యంతో మోదీ 3.0 సర్కారు అడుగులు వేసింది. తమ ప్రభుత్వం నిర్దేశించుకున్న తొమ్మిది అత్యంత ప్రాధాన్య అంశాల్లో ‘ఉద్యోగ కల్పన, నైపుణ్య శిక్షణ’ఒకటని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 4.1 కోట్ల మంది యువతకు ప్రయోజనం కలిగేలా, రూ.2 లక్షల కోట్లను ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. ఉద్యోగాల కల్పన కోసం మూడు, నైపుణ్యాల అభివృద్ధి కోసం రెండు ప్రోత్సాహక పథకాలను చేపడతామని ప్రకటించారు. కొత్తగా ఉద్యోగాలు ఇచ్చే సంస్థలకు, కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి ప్రయోజనాలను కల్పిస్తామని ప్రకటించారు. ఈపీఎఫ్ఓ డేటా ఆధారంగా..కొత్త ఉద్యోగాల కల్పన పథకాలను..ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)లో నమోదయ్యే వివరాల ఆధారంగా అమలు చేస్తామని నిర్మల తెలిపారు. మొత్తంగా ప్రస్తుత 2024–25 కేంద్ర బడ్జెట్లో విద్య, ఉద్యోగ కల్పన, నైపుణ్య శిక్షణ కోసం రూ.1.48 లక్షల కోట్లను కేటాయిస్తున్నట్టు వెల్లడించారు. ఇందులో ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్‌కు 23 వేల కోట్లు, జాబ్ క్రియేషన్ ఇన్ మాన్యుఫాక్చరింగ్ స్కీమ్‌కు రూ.52 వేల కోట్లు, సపోర్ట్ టుఎంప్లాయర్స్ స్కీమ్‌కు రూ.32 వేల కోట్లు కలిపి రూ.1.07 లక్షల కోట్లను ఖర్చు చేయనున్నట్టు వివరించారు.నైపుణ్యాలకు తగిన ఉద్యోగాలు..కార్కుల నైపుణ్యాలకు తగిన ఉద్యోగాలు లభించేలా చర్యలు చేపడతామని నిర్మలా సీతారామన్ చెప్పారు. అందుబాటులో ఉన్న ఉద్యోగాలు, వాటికి అవసరమైన నైపుణ్యాలు, తగిన నైపుణ్యమున్న కార్మకులతో కూడిన డేటాబేస్‌ను సిద్ధం చేస్తామని వెల్లడించారు. ఇందుకోసం ఈ–శ్రమ్, శ్రమ్ సువిధ, సమాధాన్ వంటి పోర్టల్స్‌ను అనుసంధానం చేస్తామని తెలిపారు. దీనితో స్కిల్ ప్రొవైడర్స్, ఎంప్లాయర్స్‌కు.. ఉద్యోగాలు కోరుకునే యువతకు మధ్య అనుసంధానంకుదురుతుందని వెల్లడించారు. ఐదేళ్లలో కోటి మందికిఇంటర్న్షిప్ దేశంలో యువత సులభంగా ఉద్యోగాలు పొందేందుకు వీలు కల్పించేలా, ఉద్యోగంలో చేరే ముందే తగిన అనుభవం సాధించేలా.. విస్తృతస్థాయిలో ఇంటర్న్íÙప్ పథకాన్ని అమలు చేస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో 500 టాప్ కంపెనీల్లో మొత్తంగా కోటి మంది యువతకు ఇంటర్న్‌షిప్ అవకాశం కలి్పస్తామని తెలిపారు. ఇంటర్న్íÙప్లో చేరేప్పుడు ఒకసారి రూ.6 వేలు అందిస్తామని, తర్వాత ప్రతినెలా రూ.5 వేలు ఇంటర్న్సిప్ అలవెన్స్ అందుతుందని వెల్లడించారు. ఏడాదిపాటు కొనసాగే ఈ ఇంటర్న్‌షిప్ సమయంలో సంబంధిత ఉద్యోగం, పని వాతావరణంపై యువతకు అవగాహన ఏర్పడుతుందని.. దీనితో మంచి ఉద్యోగం పొందేందుకు అవకాశం వస్తుందని వివరించారు. ఈ ఇంటర్న్‌షిప్ పథకానికి ఎంపికయ్యే యువతకు శిక్షణ ఇచ్చేందుకయ్యే వ్యయాన్ని, ఇంటర్న్íÙప్ అలవెన్స్‌లో పది శాతాన్ని కంపెనీలు తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధుల నుంచి భరిస్తాయని తెలిపారు.స్కిల్స్పెరిగితే.. ఉద్యోగాలూ పెరుగుతాయి! బడ్జెట్లో దేశ యువతలో నైపుణ్యాల పెంపు, ఉద్యోగ కల్పనకు ప్రోత్సాహకాలు అందించే స్కీమ్‌లను ప్రకటించడంపై హ్యూమన్స్ రీసోర్స్, ఎడ్ టెక్ రంగాల నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘వికసిత్ భారత్’లక్ష్య సాధన దిశగా ప్రభుత్వం ముందుచూపుతో నిర్ణయం తీసుకుందని ప్రశంసిస్తున్నారు. యువతలో నైపుణ్యాలు పెరిగితే ఉద్యోగ అవకాశాలు విస్తృతం అవుతాయని అంటున్నారు. ‘‘మాన్యుఫాక్చరింగ్ రంగంలో ఉద్యోగాల సృష్టికి ప్రభుత్వ ప్రోత్సాహకాలు తోడ్పడతాయి. పరిశ్రమకు అవసరమైన మానవ వనరులు అందేందుకు నైపుణ్య శిక్షణ బాట వేస్తుంది. ఈ దిశగా ప్రభుత్వ నిర్ణయాలు బాగున్నాయి..’’అని టీమ్‌లీజ్ డిగ్రీ అప్రెంటిస్íÙప్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ సుమిత్‌కుమార్ పేర్కొన్నారు. ‘‘నైపుణ్య శిక్షణ మాత్రమేగాకుండా.. ఉద్యోగులు, ఉద్యోగాలను కలి్పంచే కంపెనీలకూ ప్రోత్సాహకాలు ఇవ్వడం స్వాగతించదగిన విషయమని క్వెస్ కార్ప్ సీఈవో గురుప్రసాద్ శ్రీనివాసన్ చెప్పారు.‘‘20 లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ, కోటి మందికి ఇంటర్న్‌షిప్ అవకాశాలు వంటివి రాబోయే తరం సాధికారతకు తోడ్పడతాయి. దేశంలోని యువతలో నైపుణ్యాల లోటును పూడ్చవచ్చు..’’అని పియర్సన్ ఇండియా కంట్రీ హెడ్ వినయ్‌కుమార్ స్వామి పేర్కొన్నారు. ..: ఉద్యోగాల కల్పన కోసం :.. 1 ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ : వ్యవస్థీకృత రంగాల్లో కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి ప్రోత్సాహకంగా ఒక నెల వేతనం చెల్లింపు. మూడు వాయిదాల్లో.. గరిష్టంగా రూ.15 వేల వరకు అందిస్తారు. దీనితో వచ్చే ఐదేళ్లలో 2.1 కోట్ల మందికి లబ్ధి కలుగుతుందని అంచనా. 2 జాబ్ క్రియేషన్ ఇన్‌మాన్యుఫాక్చరింగ్ స్కీమ్: కొత్తగా ఉద్యోగంలో చేరేవారు,కొత్తగా ఉద్యోగాలిచ్చే సంస్థలు చెల్లించేఈపీఎఫ్‌ఓ చందాలపై తొలి నాలుగేళ్లపాటు ప్రోత్సాహకాలు. సుమారు 30 లక్షల మంది యువతకు ప్రయోజనం కలుగుతుందనిఅంచనా.3 సపోర్ట్ టుఎంప్లాయర్స్ స్కీమ్:కంపెనీలు కొత్తగా/అదనంగా ఇచ్చే ఉద్యోగాలకు సంబంధించి యాజమాన్య వాటాగా చెల్లించే ఈపీఎఫ్ చందాల రీయింబర్స్మెంట్. ఒక్కో ఉద్యోగికి నెలకు గరిష్టంగా రూ.3 వేల చొప్పున రెండేళ్లపాటు చెల్లిస్తారు. దీనితో కొత్తగా 50 లక్షల ఉద్యోగాల కల్పనజరుగుతుందని అంచనా. (ఈ మూడు స్కీమ్‌లనుగరిష్టంగా నెలకు రూ.లక్ష వేతనంఇచ్చే ఉద్యోగాలు/ఉద్యోగులకు మాత్రమే వర్తింపజేస్తారు.)..: నైపుణ్యాల శిక్షణ కోసం :..1 వచ్చే ఐదేళ్లలో 20 లక్షల మంది యువతలో నైపుణ్యాల అభివృద్ధి కోసం ప్రత్యేక పథకం. రాష్ట్రాలు, పరిశ్రమలు, కంపెనీలతో కలసి దీనిని అమలు చేస్తారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా కేంద్రీకృత విధానంలో 1,000 పారిశ్రామిక శిక్షణ ఇన్స్టిట్యూట్ల (ఐటీఐ) అప్‌గ్రెడేషన్. 2 వచ్చే ఐదేళ్లలో కోటి మందికి 500 టాప్ కంపెనీల్లో ఇంటర్న్íÙప్ అందించే మరో పథకం అమలు.3 పరిశ్రమలు, కంపెనీల అవసరాలకుతగినట్టుగా ఉండేలా కోర్సులు,పాఠ్యాంశాల రూపకల్పన.4 నైపుణ్య శిక్షణ కోసం ‘మోడల్ స్కిల్ లోన్ స్కీమ్’కింద ఏటా 25 వేల మంది యువతకు రూ.7.5 లక్షల వరకు రుణాలు.5 మహిళలకే ప్రత్యేకించిన నైపుణ్యాల శిక్షణ కార్యక్రమాలు. ఉద్యోగాల్లో మహిళల భాగ స్వామ్యం పెరగడం కోసం.. పరిశ్రమలు, కంపెనీల సహకారంతో వర్కింగ్ విమెన్ హాస్టళ్లు, చిన్న పిల్లల సంరక్షణను చూసుకునే క్రెచ్‌ల ఏర్పాటుకు నిర్ణయం.ప్రభుత్వ ఉద్యోగుల శిక్షణకు రూ.309.74 కోట్లుకేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు బడ్జెట్లో రూ.309.74 కోట్లను కేటాయించారు. ఇందులో ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్రటేరియట్ ట్రైనింగ్ అండ్ మేనేజ్మెంట్,లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌కు రూ.103.05 కోట్లు. వివిధ శిక్షణ స్కీమ్‌లకు రూ.120.56 కోట్లు, మిషన్ కర్మయోగికి రూ.86.13 కోట్లు ఇచ్చారు. వీటితో ఉద్యోగులకు వివిధ నైపుణ్యాలపై రిఫ్రెషర్ కోర్సులు, మిడ్ కెరీర్ శిక్షణ ఇస్తారు. -
Fact Check: అసలే గుడ్డి.. ఆపై బాబు పొరలు
కళ్లకు చంద్రబాబు పొరలు కమ్మేసిన గుడ్డి రామోజీ మరోసారి బట్టలిప్పేశారు. ఉద్యోగాలివ్వకుండా యువతను జగన్ సర్కారు మోసం చేసిందంటూ చేతికొచ్చింది రాసి చిందులు తొక్కారు. తాను కట్టుకున్న కోట దాటి గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి చూస్తే అక్కడ సీఎం జగన్ సృష్టించిన ఉద్యోగాల విప్లవం ఈ బధిరుడికి కనిపించేది. చంద్రబాబు స్కిల్ స్కామ్‌ను బయటకు తీశారన్న అక్కసుతో జగన్ ఏలుబడిలో ఉద్యోగాల కల్పన లేదంటూ పచ్చి అవాస్తవాలను అచ్చు వేశారు. పదే పదే అవాస్తవాలను ప్రచారం చేస్తున్న రామోజీ ఒకసారి గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి ఉద్యోగాలు కల్పించలేదంటూ రాగం తీస్తే అప్పుడు ఎవరు ఎవరి కాలర్ పట్టుకుని నిలదీస్తారో తెలుస్తుంది. ఈ రాతలపై మండిపడుతున్న యువత ఎవరి కాలర్ పట్టుకోవాలో ఇప్పటికే నిర్ణయించేసుకుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాలుగు నెలల్లోనే 1.25 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించడమే కాకుండా పారదర్శకంగా భర్తీ చేసిన ఘనత జగన్ సర్కారుది. ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో 10–11 మంది వరకు ప్రభుత్వ ఉద్యోగులు కనిపిస్తారు. దేశ చరిత్రలో ఒకేసారి కొత్తగా 1.25 లక్షల ఉద్యోగాలను సృష్టించడం, వెంటనే భర్తీ చేయడం జరగనేలేదు. చంద్రబాబు హయాంలో నిరుద్యోగిత రేటు 5.3 శాతం ఉంటే ఇప్పుడు వైఎస్.జగన్ హయాంలో కేవలం 4.1 శాతమే. ఈ గణాంకాలు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ వెలువరించినవి. 2014–19 మధ్య చంద్రబాబు భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్య కేవలం 34,108. చంద్రబాబు దిగిపోయే మే 2019 నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,97,123 మాత్రమే. ఇప్పుడు వైఎస్.జగన్ హయాంలో శాశ్వత ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్, ఇతర ఉద్యోగులు మొత్తం కలిపి 6,38,087 మంది ఉన్నారు. వైద్య ఆరోగ్య రంగాన్ని చంద్రబాబు గాలికి వదిలేస్తే, వైఎస్.జగన్ సర్కారు 53,466 ఉద్యోగాలను భర్తీ చేసింది. నైపుణ్య శిక్షణ మీ బాబు భక్షణే అసలు ఈనాడు రామోజీ ఏడుపు అంతా చంద్రబాబు స్కిల్ స్కామ్‌పై విచారణ చేపట్టడమేనని అక్కసుతో రాసిన ఈ కథనం చెప్పకనే చెబుతోంది. స్కిల్ పేరుతో చంద్రబాబు దోపిడీ అంతా ఇంతా కాదు. స్కిల్ పేరుతో కోట్లాది రూపాయల నిధులు తన ఇంటికి మళ్లించేశారు. కానీ వైఎస్.జగన్ ప్రభుత్వం 175 శాసనసభ నియోజకవర్గాల్లో కనీసం ఒకటి ఉండే విధంగా మొత్తం 192 స్కిల్ హబ్్సను ఏర్పాటు చేసింది. ఇక్కడ లెవెల్–4 లోపు కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. ప్రతీ పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి తక్కువ కాకుండా మొత్తం 26 స్కిల్ కాలేజీలను ఏర్పాటు చేసింది. హై ఎండ్ టెక్నాలజీలో శిక్షణ ఇవ్వడానికి తిరుపతిలో 50 ఎకరాల విస్తీర్ణంలో స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తోంది. అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు రాష్ట్ర విద్యార్థులు అందుకునే విధంగా స్కిల్ ఇంటర్నేషనల్ పేరుతో ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. ఇందుకోసం పలు పరిశ్రమలు, విదేశీ సంస్థలతో ఒప్పందం చేసుకొంది. ఏపీఎస్ఎస్డీసీ ఆధ్యర్యంలో నైపుణ్య శిక్షణ కోర్సులను అందిస్తోంది. 2019–20 నుంచి 2023–24 వరకు 14,26,515 మంది యువతకు శిక్షణ ఇచ్చింది. అత్యధిక ఉద్యోగాల కల్పనలో దేశంలోనే ఏపీ నాలుగో స్థానం కేంద్రం విడుదల చేసిన ఇండియా 2023 స్కిల్ రిపోర్ట్ అత్యధిక ఉద్యోగావకాశాల కల్పనలో దేశంలోనే ఆంద్రప్రదేశ్ నాలుగో స్థానంలో ఉందని స్పష్టం చేసింది. సామాజిక, పారిశ్రామిక, సాంకేతిక మౌలిక సదుపాయాలు కల్పన భేష్ అని నివేదిక ప్రశంసించింది. ప్లేస్మెంట్లలో రూ.2.6 లక్షలు అంతకంటే ఎక్కువ వేతనాలు అందే రాష్ట్రాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందని స్కిల్ రిపోర్ట్ పేర్కొంది. యువతకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు నైపుణ్య శిక్షణ ఇప్పించి పెద్ద పెద్ద ఉద్యోగాలు పొందేలాగా ప్రోత్సహిస్తున్నది సీఎం వైఎస్.జగన్ మాత్రమే. -
పేద మహిళలకు ఏటా రూ. లక్ష
ధులే: ఐదురకాల హామీలతో యువతకు ‘యువ న్యాయ్’ పేరిట ఎన్నికల వరాలు ప్రకటించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం పేద మహిళల కోసం ప్రత్యేకంగా ‘మహిళా న్యాయ్’ పేరిట హామీలను ఇచ్చారు. తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే పేద మహిళలకు ఏటా రూ.1 లక్ష అందజేస్తామని, వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్ అమలుచేస్తామని ప్రకటించారు. 50 శాతం రిజర్వేషన్ పరిమితిని రాజ్యాంగ సవరణ ద్వారా తొలగిస్తామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ చెప్పారు. బుధవారం మహారాష్ట్రలో భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా ధులే జిల్లాలో జరిగిన మహిళా ర్యాలీలో ఐదు ‘మహిళా న్యాయ్’ గ్యారెంటీలను రాహుల్ ప్రకటించారు. ‘ ఏటా పేద మహిళలకు రూ.1 లక్ష వారి బ్యాంక్ ఖాతాలో జమచేస్తాం. మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తాం. ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, మధ్యాహ్న భోజన పథకం, చైల్డ్ కేర్ సెంటర్లలో పనిచేసే మహిళా సిబ్బందికి అందే వేతనంలో కేంద్రం తరఫు బడ్జెట్‌ను రెట్టింపు చేస్తాం. మహిళా సమస్యల పరిష్కారానికి, తమ హక్కుల పట్ల మహిళల్లో అవగాహన పెంపునకు నోడల్ అధికారిని నియమిస్తాం. దేశంలో ప్రతీ జిల్లాలో సావిత్రిబాయ్ ఫూలే హాస్టళ్లను నెలకొల్పుతాం’’ అని హామీలు ఇచ్చారు. ‘‘ మోదీ సర్కార్ మహిళలను మహిళా రిజర్వేషన్ చట్టం పేరిట ఎగతాళి చేసింది. ఆర్భాటంగా చట్టం చేసింది. కానీ పదేళ్ల తర్వాతే దానిని అమలుచేస్తారట. మేం అధికారంలోకి వస్తే తక్షణం చట్టాన్ని అమలుచేస్తాం’ అని రాహుల్ అన్నారు. -
ఈఎఫ్‌టీఏతో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
న్యూఢిల్లీ: యూరప్‌లోని నాలుగు దేశాల కూటమి యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (ఈఎఫ్టీఏ)తో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదుర్చుకుంది. దీని ప్రకారం వచ్చే 15 ఏళ్లలో 100 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు దేశంలోకి రానున్నాయి. తద్వారా పది లక్షల పైచిలుకు ఉద్యోగాల కల్పన జరగనుంది. అలాగే, దశల వారీగా పలు ఉత్పత్తులపై సుంకాల తొలగింపు, కొన్నింటిపై మినహాయింపు నిబంధనల కారణంగా స్విస్ వాచీలు, చాక్లెట్లు మొదలైనవి భారత్ కొంత చౌకగా లభించగలవు. లక్ష్యాల ఆధారిత పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనకు కట్టుబడి ఉండేలా ఒక ఎఫ్‌టీఏకి చట్టబద్ధత కల్పించడం చరిత్రలో ఇదే తొలిసారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇది అమల్లోకి రావడానికి దాదాపు ఏడాది సమయం పడుతుంది. ఈఎఫ్టీఏ కూటమిలో స్విట్జర్లాండ్, నార్వే, ఐస్‌ల్యాండ్, లీచ్టెన్స్టెయిన్ దేశాలు ఉన్నాయి. ఒప్పందం ప్రకారం చాలా మటుకు భారతీయ పారిశ్రామిక ఉత్పత్తులకు ఈఎఫ్టీఏ దేశాల్లో సుంకాలు ఉండవు. పలు ప్రాసెస్డ్ వ్యవసాయోత్పత్తుల మీద సుంకాలపై మినహాయింపులు లభిస్తాయి. ప్రతిగా దాదాపు 82.7 శాతం ఈఎఫ్టీఏ ఉత్పత్తుల కేటగిరీలపై భారత్ సుంకాలపరమైన ప్రయోజనాలు కలి్పంచనుంది. అలాగే, ఇరు పక్షాల సరీ్వసు రంగాల్లోనూ పరస్పర ప్రయోజనకర పరిణామాలు ఉండనున్నాయి. ఒక సంపన్న దేశాల కూటమితో ఎఫ్‌టీఏ కుదుర్చుకోవడం కీలక మైలురాయి కాగలదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ వ్యాఖ్యానించారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో భారత్–ఈఎఫ్టీఏ మధ్య 18.65 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం నమోదైంది. -
జనరేటివ్ ఏఐతో కొత్త ఉద్యోగాలు
న్యూఢిల్లీ: జనరేటివ్ ఏఐ (కృత్రిమ మేథ)పై ప్రభుత్వ పెట్టుబడులు, ప్రోత్సాహకాలు, ఓపెన్‌సోర్స్ కంటెంట్ అన్నవి దేశంలో ఉపాధి కల్పనను మరింత పెంచుతాయని, అసమానతలను తగ్గిస్తాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. ‘‘జనరేటివ్ ఏఐ కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుంది. పరిమిత నైపుణ్యాలున్న వారు సైతం ఉన్నత శ్రేణి ఉద్యోగాలను నిర్వహించేందుకు సాయపడుతుంది. ఇది ఆర్థిక అసమానతలను తగ్గిస్తుంది’’అని ఐఎంటీ ఘజియాబాద్ డైరెక్టర్ విశాల్ తల్వార్ అభిప్రాయపడ్డారు. ఇందుకు బలమైన మౌలిక వసతుల కల్పన అవసరమంటూ.. రానున్న బడ్జెట్లో ఇందుకు ప్రత్యే కేటాయింపులు చేయాలని జెనరేటివ్ ఏఐపై నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో తల్వార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన, వ్యాపార విద్య రూపాంతరంపై కీలకంగా చర్చించారు. భారత్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఏఐ కార్యక్రమాలు, ఏఐ మిషన్‌తో ఏఐ ఆధారిత నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన విషయంలో దేశం గణనీయమైన పురోగతికి సిద్ధంగా ఉందని తల్వార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. టెక్నాలజీ పరంగా మరింత ముందుకు వెళ్లడమే కాకుండా, వేగంగా మారిపోతున్న ఉద్యోగ ముఖ చిత్రంలో వ్యక్తుల నైపుణ్యాలకు సాధికారతను జనరేటివ్ ఏఐ తీసుకొస్తుందన్నారు. భారత కంపెనీలు ఇప్పటికే రూపొందించిన టూల్స్, ప్లాట్‌ఫామ్‌ల సాయంతో జనరేటివ్ ఏఐ విభాగంలో కీలక పాత్ర పోషించగలవని ఇదే చర్చా కార్యక్రమంలో పాల్గొన్న నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీకి చెందిన కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రొఫెషర్ మోహాంబిర్ సావ్నే పేర్కొన్నారు. -
19th EV EXPO 2023: 2030 నాటికి కోటి ఈవీలు...
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 2030 నాటికి వార్షిక ప్రాతిపదికన ఒక కోటి ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు నమోదయ్యే అవకాశం ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. అలాగే ఈవీ విభాగం సుమారు 5 కోట్ల ఉద్యోగాలను సృష్టిస్తుందని అంచనాగా చెప్పారు. 19వ ఈవీ ఎక్స్పో–2023 సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘వాహన్ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటికే 34.54 లక్షల ఎలక్ట్రిక్ వెహికిల్స్ నమోదయ్యాయి. ప్రపంచంలోనే నంబర్–1 ఈవీ తయారీదారుగా భారత్ అవతరించే అవకాశం ఉంది. స్వచ్ఛ ఇంధన ఉత్పత్తిలో భారత్‌ను స్వావలంబన కలిగిన దేశంగా మార్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇప్పటికే ఉన్న కాలుష్య వాహనాలను హైబ్రిడ్, పూర్తిగా ఈవీలుగా మార్చేందుకు కూడా ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇందుకు సంబంధించిన నిబంధనలు ఖరారవడంతోపాటు సాంకేతిక ప్రదర్శనలు విజయవంతం అయ్యాయి. ప్రజా, సరుకు రవాణా వాహనాలను ఈవీలకు మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది’ అని మంత్రి వివరించారు. -
Raghuram Rajan: భారత్ ప్రధాన సమస్య ఏమిటంటే..?
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా పేరొందిన భారత్ ఎకానమీ ప్రస్తుతం ఉద్యోగాల కల్పనలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కుటోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ జీ రాజన్ పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్ ముందున్న సమస్యల్లో ఉద్యోగాల కల్పన ప్రధానమైందని ఆయన అన్నారు. నైపుణ్యాల పెంపు ద్వారా మానవ వనరుల అభివృద్ధి తక్షణ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. యూనివర్శిటీ ఆఫ్ చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఫైనాన్స్ ప్రొఫెసర్‌గా రాజన్ పనిచేస్తున్నారు. పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీలో ఎకనామిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రోహిత్ లాంబా, తాను (రాజన్) సంయుక్తంగా రాసిన ‘బ్రేకింగ్ ది మౌల్డ్: రీఇమేజినింగ్ ఇండియాస్ ఎకనామిక్ ఫ్యూచర్’ అనే పుస్తకం గురించి ఆయన మాట్లాడుతూ భారత్ ఎకానమీ గురించి కీలక విశ్లేషణ చేశారు. ‘‘భారత్ ప్రస్తుతం ఒక క్రాస్ రోడ్ వద్ద ఉంది‘ అన్న ముగింపు అభిప్రాయంతో ముగిసిన పుస్తకం గురించి వివరించిన సందర్భంగా రాజన్ ఏమన్నారంటే... ► భారతదేశం అతిగొప్ప బలం 140 కోట్ల జనాభా. అయితే ఈ జనాభాకు సంబంధించి ‘మూలధనం’ ఎలా బలోపేతం చేయాలన్నది ప్రశ్న. దేశం అభివృద్ధి పథంలో పయనించే ప్రతి స్థాయిలో ఉద్యోగాలను సృష్టించాల్సిన అవసరం ఉంది. ► ప్రైవేట్ రంగ ఉద్యోగాల విషయంలో ‘రిజర్వేషన్ల’ ఆందోళనలు ఉన్నాయి. ఇక కొన్ని రాష్ట్రాలు తమ నివాసితులకు మాత్రమే ఉద్యోగాలను రిజర్వ్ చేయడానికి ప్రయతి్నస్తున్నాయి. ఇది ఆందోళనకరమైన ధోరణి. ఇలాంటి ధోరణి పోవాలి. దీనివల్ల నైపుణ్యం కలిగిన మానవ వనరులు దేశం మొత్తం విస్తరించడానికి వీలవుతుంది. ► గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఒక వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ కలి్పస్తే రాబోయే ఆరు నెలల నుండి ఒక సంవత్సరంలో దేశంలో భారీ ఉపాధి కల్పన జరుగుతుంది. ఉపాధి కల్పించడానికి 10 సంవత్సరాలు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ► భారత్ మానవ ‘మూలధనాన్ని’ మెరుగుపరుచుకుంటే... అవసరమైన ఉద్యోగాలు వాటంతట అవే వస్తాయి. శ్రామిక శక్తి నాణ్యతను మెరుగుపరుస్తే, కంపెనీలు భారతదేశానికి వస్తాయి. నైపుణ్యం కలిగిన ఉద్యోగస్తులు లభించడం లేదని కంపెనీలు తరచూ చెబుతుండడాన్ని మనం గమనిస్తున్నాం. ► సామాన్యునికి సైతం సైవలు అందేలా పాలనా సంస్కరణలు జరగాలి. ప్రత్యేకించి పరిపాలనా వికేంద్రీకరణపై దృష్టి సారించాలి. ► స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణాంకాల మదింపు సరిగా జరగాలి. భారత్ తన బలహీనతలపై కాకుండా బలాలపై ఆధారపడిన మార్గాన్ని ఆవిష్కరించాలి. -
భారీగా పెట్టుబడులు.. 42,000 కొలువులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు యూకే, యూఎస్ పర్యటన గురువారంతో ముగిసింది. రెండు వారాలపాటు సాగిన పర్యటనలో 80కిపైగా వాణిజ్య సమావేశాలు, ఐదు రంగాలకు సంబంధించి రౌండ్ టేబుల్ సమావేశాలు, రెండు సదస్సుల్లో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను కేటీఆర్ ఆకర్షించగలిగారు. తద్వారా తెలంగాణలో సుమారు 42 వేల ఉద్యోగాల కల్పనకు మార్గం సుగమమైంది. వార్నర్ బ్రదర్స్ మొదలు జ్యాప్‌కామ్ వరకు.. లండన్, న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, హ్యూస్టన్, హెండర్సన్, బోస్టన్ నగరాల్లో జరిగిన కేటీఆర్ వివిధ సంస్థల ప్రతినిధులతో చేపట్టిన వాణిజ్య సమావేశాల్లో భారీ పెట్టుబడులకు సంబంధించిన ప్రకటనలు వెలువడ్డాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, బీమా, ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఐటీ, ఐటీ ఆధారిత సేవలు, ఏరోస్పేస్, రక్షణ, లైఫ్ సైన్సెస్, మెడికల్ డివైసెస్, డిజిటల్ సొల్యూషన్స్, డేటా సెంటర్స్ తదితర రంగాల్లో అంతర్జాతీయ సంస్థల నుంచి పెట్టుబడుల ప్రకటనలు వచ్చాయి. తద్వారా 42 వేల ప్రత్యక్ష ఉద్యోగాలతోపాటు పరోక్షంగా మరో 3–4 రెట్లు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో భారీ పెట్టుబడులు ప్రకటించిన సంస్థల జాబితాలో వార్నర్ బ్రదర్స్, డిస్నీ, మెడ్‌ట్రోనిక్, స్టేట్ స్ట్రీట్, లండన్ స్టాక్ ఎక్సే్ఛంజ్ గ్రూప్, టెక్ ఎఫ్ఎంసీ, ఆలియంజ్ గ్రూప్, స్టెమ్ క్యూర్స్, జ్యాప్‌కామ్ తదితర సంస్థలు ఉన్నాయి. వాణిజ్య సమావేశాలతోపాటు రెండు ప్రధాన సదస్సులోనూ మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. లండన్‌లో ఈ నెల 12న ‘ఐడియాస్ ఫర్ ఇండియా’సదస్సులో తెలంగాణ మోడల్‌ను కేటీఆర్ వివరించారు. ఆ తర్వాత ఈ నెల 15న కొంగరకలాన్‌లో జరిగిన ఫాక్స్‌కాన్ కంపెనీ శంకుస్థాపనకు వచ్చిన కేటీఆర్... ఆ వెంటనే అమెరికా టూర్‌కు వెళ్లారు. ఈ నెల 22న హెండర్సన్లో జరిగిన సదస్సులో అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ సదస్సులో కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ పథకం ద్వారా తెలంగాణ సాధించిన జలవిజయాన్ని ఆవిష్కరించారు. తెలంగాణలో 9 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని వివరించారు. అలాగే రాష్ట్రంలోని ద్వితీయశ్రేణి నగరాలకు ఐటీ రంగాన్ని విస్తరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఎన్నారై సీఈఓలతో జరిగిన సమావేశంలో కేటీఆర్ వివరించారు. కేటీఆర్ వెంట వెళ్లిన ప్రతినిధి బృందంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, పెట్టుబడుల ప్రోత్సాహక విభాగ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ డైరెక్టర్ దిలీప్ కొణతం తదితరులు ఉన్నారు. -
World Economic Forum: వచ్చే ఐదేళ్లలో నికరంగా... 1.4 కోట్ల కొలువులకు కోత
జెనీవా: వచ్చే ఐదేళ్లలో ఉద్యోగాల సృష్టిలో భారీ తగ్గుదల నమోదవుతుందని వరల్డ్ ఎకనామిక్ ఫో రం (డబ్ల్యూఈఎఫ్) అంచనా వేసింది. కొత్తగా 6.9 కోట్ల ఉద్యోగాల సృష్టి జరగనుండగా ఏకంగా 8.3 కోట్ల ఉద్యోగాలు కనుమరుగవుతాయని పేర్కొంది. నికరంగా 1.4 కోట్ల ఉద్యోగాలకు కోత పడుతుందని ‘ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్’ పేరిట ఆదివారం విడుదల చేసిన ద్వై వార్షిక నివేదికలో వివరించింది. ప్రస్తుతం మొత్తం ప్రపంచ ఉద్యోగితలో ఇది 2 శాతం. వచ్చే ఐదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా 23 శాతం ఉద్యోగుల వలస చోటుచేసుకోవచ్చని పేర్కొంది. భారత్‌లో ఇది 22 శాతం దాకా ఉండొచ్చని అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా 45 పెద్ద ఆర్థిక వ్యవస్థలు, 27 భారీ పారిశ్రామిక క్లస్టర్లు, 800 దిగ్గజ కంపెనీల్లోని దాదాపు 67.3 కోట్ల ఉద్యోగాలపై డబ్ల్యూఈఎఫ్ విస్తృతంగా సర్వే జరిపింది. విశేషాలు... ► వచ్చే ఐదేళ్లలో సప్లై చైన్స్, రవాణా, మీడియా, వినోద, క్రీడా రంగాలకు ఉద్యోగుల వలసలు ఎక్కువగా ఉంటాయి. ► ప్రపంచవ్యాప్తంగా నూతన ఉద్యోగాల సృష్టిలో చాట్‌జీపీటీ వంటి కృత్రిమ మేధ ఆధారిత టెక్నాలజీలదే కీలక పాత్ర. ► 75 శాతం కంపెనీలు, సంస్థలు, కృత్రిమ మేధ ఆధారిత టెక్నాలజీలను అందిపుచ్చుకుంటాయి. ► ఫలితంగా ఏకంగా 44 శాతం మంది ఉద్యోగుల నైపుణ్యాలకు పూర్తిగా కాలదోషం పట్టనుంది. ► సమర్థ పనితీరును కొనసాగించాలంటే ప్రతి 10 మంది ఉద్యోగుల్లో కనీసం ఆరుగురికి శిక్షణ అవసరమవుతుంది. ► దాంతో ఏకంగా 45 శాతం వ్యాపార సంస్థలు, పరిశ్రమలు, కంపెనీలు ఉద్యోగుల నైపుణ్యాభివృద్ధిపై హెచ్చు నిధులు వెచ్చిస్తాయి. ► ప్రపంచవ్యాప్తంగా ఆటోమేషన్ వేగం గత అంచనాల కంటే తగ్గింది. ప్రస్తుతం కేవలం 34 శాతం టాస్కులు ఆటోమేషన్తో నడుస్తున్నాయి. ఇది 2020తో పోలిస్తే కేవలం 1 శాతమే ఎక్కువ. కంపెనీలు కూడా ఆటోమేషన్ అంచనాలను కుదించుకున్నాయి. తొలుత 2025 నాటికి 47 శాతం టాస్కులను ఆటోమేట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా తాజాగా దాన్ని 2027 నాటికి కేవలం 42 శాతానికి పరిమితం చేసుకున్నాయి. ► కృత్రిమ మేధ రాకతో బ్యాంక్ క్యాషియర్లు, క్లర్కులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు వంటి 2.6 కోట్ల ఉద్యోగాలు కనుమరుగవుతాయి. ► ఏఐ, మెషీన్ లెర్నింగ్ స్పెషలిస్టులు, ఫిన్‌టెక్ ఇంజనీర్లు, డేటా అనలిస్టులు, సైంటిస్టులు, అగ్రికల్చరల్ ఎక్విప్మెంట్ ఆపరేటర్లు వంటి ఉద్యోగాలు బాగా పెరుగుతాయి. ► స్వచ్ఛ ఇంధనం, వ్యర్థాల నిర్వహణ, సహజ వనరుల సమర్థ వినియోగం వంటి రంగాల్లో మేనేజర్లు, విండ్ టర్బైన్ టెక్నీషియన్లు, సోలార్ కన్సల్టెంట్లు, ఎకాలజిస్టులు, పర్యావరణ స్పెషలిస్టుల వంటి ఉద్యోగాలు కూడా భారీగా పెరుగుతాయి. ఈ రంగంలో భారత్‌తో సహా టాప్ 10 దేశాలు పర్యావరణ లక్ష్యాలు చేరుకోవాలంటే కనీసం 1.2 కోట్ల ఉద్యోగాల సృష్టి జరగాలి. భారత్‌లో సామాజికేతర రంగాల్లోనే ఉద్యోగ సృష్టి ► కరోనా అనంతరం భారత్‌లో విద్య, ఆరోగ్యం వంటి సామాజిక రంగాలతో పోలిస్తే సామాజికేతర రంగాల్లోనే ఉద్యోగాల సృష్టి ఎక్కువగా ఉంటుందని నివేదిక అంచనా వేసింది. భారత్‌లో వచ్చే ఐదేళ్లలో కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్ వంటి టెక్నాలజీ ఆధారిత రంగాలకు ఉద్యోగుల వలస అత్యధికంగా ఉంటుందని నివేదిక పేర్కొంది. ► పర్యావరణ, సామాజిక, పాలన రంగాల్లో ఉపాధి వృద్ధి ఊపందుకుంటుందని భారత్‌లో సర్వేలో పాల్గొన్న వారిలో 61 శాతం మంది పేర్కొన్నారు. తర్వాత కొత్త టెక్నాలజీలకు 59 శాతం, డిజిటల్ యాక్సెస్‌కు 55 శాతం, వాతావరణ మార్పులు, పెట్టుబడుల రంగాలకు 53 శాతం ఓటేశారు. ► అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్యాలను పెంచుకునేందుకు తమ యాజమాన్యమే అవకాశం కల్పించడం మేలని సర్వేలో పాల్గొన్న భారతీయ ఉద్యోగుల్లో ఏకంగా 97 శాతం అభిప్రాయపడ్డారు. ఇది ప్రభుత్వపరంగా జరగాలన్నవారు 18 శాతమే. ► ఉపాధి సృష్టిపై డేటా అనలిటిక్స్ పెను ప్రభావం చూపుతుందని 62 శాతం కంపెనీలు నమ్ముతున్నాయి. తర్వాతి స్థానాన్ని ఎన్క్రిప్షన్–సైబర్ సెక్యూరిటీ (53 శాతం), డిజిటల్ ప్లాట్‌ఫాంలు, అప్లికేషన్లు (51), ఇ–కామర్స్ (46 శాతం)కు ఇచ్చాయి. భారత్‌లో వచ్చే ఐదేళ్లలో ఉద్యోగుల వలస ఏఐ, మెషీన్ లెర్నింగ్ 38% డేటా అనలిస్టులు, సైంటిస్టులు 33% డేటా ఎంట్రీ క్లర్కులు 32% ఫ్యాక్టరీ కార్మికులు 18% ఆపరేషన్స్ మేనేజర్స్ 14% అకౌంటెంట్లు, ఆడిటర్లు 5% -
Karnataka assembly election 2023: ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.కోటి
సాక్షి, బళ్లారి: కర్ణాటకలో అధికారంలోకి వస్తే ప్రతి గ్రామ పంచాయతీకి రూ.కోటి, కళ్యాణ కర్ణాటక ప్రాంతాభివృద్ధికి రూ.5,000 కోట్లు మంజూరు చేస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. శుక్రవారం కలబురిగి జిల్లాలోని జేవర్గీ సభలో హోరు వానలోనూ రాహుల్ ప్రసంగించారు. ‘బళ్లారిలో రూ.5,000 కోట్లతో వస్త్ర పరిశ్రమను తెస్తాం. జిల్లాను ప్రపంచ జీన్స్ హబ్‌గా, జీన్స్ రాజధానిగా మారుస్తాం. 50 వేల ఉద్యోగాల భర్తీని పూర్తిచేస్తాం’ అని అన్నారు. ‘ప్రతీ పనికి కాంట్రాక్టర్ల నుంచి మంత్రులు 40 శాతం కమిషన్ గుంజారు. ఈ ప్రభుత్వ దోపిడీతో బళ్లారి ప్రజలు ఆర్థికంగా ఎంతో నష్టపోయారు’’ అని ఆరోపించారు. తాము 150 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తంచేశారు. -
టెక్‌యేతర ఉద్యోగాలకు డిమాండ్
ముంబై: బహుళ జాతి ఐటీ దిగ్గజాలు ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్న తరుణంలో గతేడాది డిసెంబర్లో దేశీయంగా టెక్‌యేతర రంగాల్లో ఉద్యోగులకు డిమాండ్ పెరిగింది. ప్రధానంగా ఆరోగ్య సంరక్షణ, ఆహార సర్వీసులు, నిర్మాణం, విద్యా రంగాల్లో ఈ ధోరణి నెలకొంది. నెలవారీగా ఉద్యోగాల పోస్టింగ్‌లపై అంతర్జాతీయ జాబ్ సైట్ ఇన్‌డీడ్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం హెల్త్‌కేర్ అనుబంధ విభాగాలైన డెంటల్, నర్సింగ్ రంగాల్లో ఉద్యోగాల పోస్టింగ్స్ అత్యధికంగా 30.8 శాతంగా నమోదయ్యాయి. ఫుడ్ సర్వీసెస్ (8.8%), నిర్మాణం (8.3%), ఆర్కిటెక్చర్ (7.2%), విద్య (7.1%) థెరపీ (6.3%), మార్కెటింగ్ (6.1%) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. కరోనా మహమ్మారి అనంతరం వ్యాపార పరిస్థితులు సాధారణ స్థాయికి తిరిగొస్తున్న నేపథ్యంలో నిర్మాణం, సివిల్ ఇంజినీరింగ్ వంటి విభాగాల్లో కాస్త సందడి నెలకొందని నివేదిక పేర్కొంది. అలాగే మహమ్మారి సమయంలో భారీగా కోతలు పడిన మార్కెటింగ్ విభాగంలోనూ హైరింగ్ పుంజుకుందని వివరించింది. కస్టమర్లకు మెరుగైన అనుభూతిని కల్పించడంతో పాటు వ్యాపారం, అమ్మకాలను పెంచుకునేందుకు మార్కెటింగ్ అవసరాన్ని బ్రాండ్లు గుర్తించాయని పేర్కొంది. బెంగళూరు టాప్.. జాబ్ పోస్టింగ్స్ విషయంలో మొత్తం 16.5 శాతం వాటాతో బెంగళూరు అగ్రస్థానంలో నిల్చింది. ముంబై (8.23%), పుణె (6.33%), చెన్నై (6.1%) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. చిన్న నగరాల్లోను డిమాండ్ పెరుగుతోందనడానికి సూచనగా ఉద్యోగాల పోస్టింగ్స్‌లో అహ్మదాబాద్, కోయంబత్తూర్, కొచ్చి, జైపూర్, మొహాలీ వంటి ద్వితీయ శ్రేణి నగరాల వాటా 6.9 శాతంగా నమోదైంది. ప్రయాణాలపై కోవిడ్–19పరమైన ఆంక్షల ఎత్తివేతతో విదేశాల్లో వివిధ రంగాల్లో ఉద్యోగావకాశాలను భారతీయులు గణనీయంగానే అన్వేషిస్తున్నారు. ఈ విషయంలో దేశాలవారీగా చూస్తే మొత్తం సెర్చ్‌లలో అమెరికా వాటా 39.29 శాతంగా ఉండగా, కెనడా 17.23 శాతం, బ్రిటన్ 14.34 శాతం, యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ 13.79 శాతం వాటాతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్నప్పటికీ దేశీయంగా వివిధ ఉద్యోగాల కేటగిరీల్లో వృద్ధి కనబడుతోందని, భారత్‌లో హైరింగ్ ధోరణులు సానుకూలంగా ఉందనడానికి ఇది నిదర్శనమని ఇన్‌డీడ్ ఇండియా హెడ్ (సేల్స్) శశి కుమార్ తెలిపారు. కేంద్ర బడ్జెట్లో ఉపాధి కల్పనపై దృష్టి పెడితే కచ్చితంగా దేశీయంగా జాబ్ మార్కెట్‌కు మరింత ఊతం లభించగలదని ఆయన చెప్పారు. దేశీయంగా ఉద్యోగాల పరిస్థితి ఎలా ఉండబోతోందనేది ఈ ఏడాది తొలి రెండు త్రైమాసికాల్లో ధోరణులే నిర్దేశిస్తాయని పేర్కొన్నారు. -
ప్రథమార్ధంలో మెరుగ్గా ఉద్యోగావకాశాలు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో (ఏప్రిల్–సెప్టెంబర్) ఉద్యోగాల కల్పనకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కంపెనీల సీఈవోలు భావిస్తున్నారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన సర్వేలో మెజారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు ఈ విషయం వెల్లడించారు. ఇటీవల రెండో జాతీయ మండలి సమావేశం సందర్భంగా సీఐఐ నిర్వహించిన ఈ సర్వేలో 136 మంది సీఈవోలు పాల్గొన్నారు. ‘అధిక ద్రవ్యోల్బణం, కఠిన పరపతి విధానం, ముడి సరుకుల ధరల పెరుగుదల, అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి వంటి అనేక సవాళ్లను ఇటు దేశీయంగా అటు ఎగుమతులపరంగా భారతీయ పరిశ్రమ గట్టిగా ఎదుర్కొనడంతో పాటు వ్యాపారాల పనితీరుపై సానుకూల అంచనాలను సీఈవోల సర్వే ప్రతిఫలిస్తోంది‘ అని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. దీని ప్రకారం.. ► స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 7–8 శాతం స్థాయిలో ఉంటుందని 57 శాతం మంది సీఈవోలు తెలిపారు. 7 శాతం లోపే ఉంటుందని 34 శాతం మంది అంచనా వేశారు. ► దాదాపు సగం మంది చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు (49 శాతం) ప్రథమార్ధంలో (హెచ్1) గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ మెరుగ్గా ఉంటుందని పేర్కొన్నారు. ► ద్రవ్యోల్బణం ఎగుస్తుండటంతో ద్రవ్య పరపతి విధానాన్ని కఠినతరం చేస్తారనే అంచనాలు ఉన్నప్పటికీ ప్రథమార్ధంలో పరిస్థితులు మెరుగ్గానే ఉండగలవన్నది సీఈవోల అభిప్రాయం. ► ప్రథమార్ధంలో ఆదాయాల వృద్ధి 10–20 శాతం స్థాయిలో ఉండొచ్చని 44 శాతం మంది సీఈవోలు అంచనా వేశారు. 32 శాతం మంది 20 శాతం పైగా ఉండొచ్చని తెలిపారు. ► లాభాల వృద్ధి 10 శాతం పైగా ఉంటుందని 45 శాతం మంది, దాదాపు 10 శాతం వరకూ ఉంటుందని 40 శాతం మంది సీఈవోలు అంచనా వేశారు. ► ముడి వస్తువుల రేట్ల పెరుగుదలతో హెచ్1లో తమ లాభాలపై 5–10 శాతం మేర ప్రతికూల ప్రభావం పడుతుందని 46 శాతం మంది, 10–20 శాతం స్థాయిలో ఉండొచ్చని 28 శాతం మంది చెప్పారు. ► ముడి వస్తువుల ధరల పెరుగుదలతో ఇటీవలి కాలంలో తమ ఉత్పత్తుల రేట్లు పెంచినట్లు 43 శాతం మంది వెల్లడించారు. ఆ భారాన్ని తామే భరించడమో లేదా సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడం ద్వారా వ్యయాలను తగ్గించుకోవడమో చేసినట్లు మిగతా వారు పేర్కొన్నారు. ► హెచ్1లో ద్రవ్యోల్బణం 7–8 శాతం స్థాయిలో ఉంటుందని దాదాపు సగం మంది (48 శాతం) అంచనా వేస్తున్నారు. ► ముడి వస్తువుల రేట్ల పెరుగుదల, ద్రవ్యోల్బణంపరమైన ఒత్తిళ్లు నెలకొన్నందున రాష్ట్రాల ప్రభుత్వాలు .. ఇంధనాలపై వ్యాట్‌ను తగ్గించాలని మూడొంతుల మంది సీఈవోలు అభిప్రాయపడ్డారు. ► ఎగుమతులపరంగా చూస్తే రూపాయి మారకం విలువ మరింత పడిపోతుందని, డాలర్‌తో పోలిస్తే 80 స్థాయికి పైగా పతనం కావచ్చని మెజారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు అభిప్రాయపడ్డారు. ఫలితంగా ఎగుమతులపరంగా తమకు ప్రయోజనం చేకూరుతుందని 55 శాతం మంది తెలిపారు. ► దిగుమతులపరంగా చూస్తే మాత్రం హెచ్1లో ముడి వస్తువుల సరఫరాపై ఒక మోస్తరు ప్రభావం పడొచ్చని 50 శాతం మంది సీఈవోలు పేర్కొన్నారు. ► ఇటీవలి భౌగోళిక రాజకీయ పరిణామాలు, కోవిడ్ సంబంధ లాక్డౌన్ల ప్రభావాల కారణంగా సరఫరాలపరంగా స్వల్ప సవాళ్లు ఎదుర్కొన్నట్లు 30 శాతం మంది సీఈవోలు చెప్పారు. అయితే, తమ అవసరాల కోసం చైనాపై ఆధారపడటం కొంత తగ్గించుకున్నట్లు వివరించారు. -
టెక్నాలజీలో స్వయం సమృద్ధి కావాలి
న్యూఢిల్లీ: టెక్నాలజీ రంగాలలో దేశం స్వయంసమృద్ధిని సాధించాలని ప్రధాని నరేంద్ర మోదీ అభిలషించారు. చివరి అంచెవరకూ సర్వీసుల అందజేత, భారీ ఉపాధి కల్పనలో ఇవి కీలక పాత్ర పోషించనున్నట్లు తెలియజేశారు. సైన్స్ అండ్ టెక్నాలజీ విడివడి ఉండదని, డిజిటల్ ఆర్థిక వ్యవస్థతో దగ్గరగా కనెక్టయి ఉండే రంగమని ‘సాంకేతిక ఆధార అభివృద్ధి’పై నిర్వహించిన వెబినార్‌లో ప్రధాని పేర్కొన్నారు. ప్రస్తుతం వేగవంత డెలివరీ, పౌరులకు సాధికారత కల్పిస్తున్న డిజిటల్ ఎకానమీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆధారితమై ఉన్నట్లు వివరించారు. సాధారణంగా టెలికమ్యూనికేషన్, అందులోనూ 5జీ టెక్నాలజీ ప్రధానంగా వృద్ధికి ఊతమివ్వడమేకాకుండా ఉద్యోగ అవకాశాలను కల్పించగలదని మోదీ పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం(2022–23)లో 5జీ మొబైల్ సర్వీసులు ప్రారంభమయ్యేందుకు వీలుగా అవసరమైన స్పెక్ట్రమ్ వేలాన్ని 2022లో నిర్వహించనున్నట్లు తెలియజేశారు. వెబినార్‌లో ప్రభుత్వ, ప్రయివేట్ రంగంలోని వివిధ శాఖల ప్రతినిధులు పాలుపంచుకున్నారు. మెడికల్ పరికరాలపై టెక్నాలజీ కీలక పాత్ర పోషించే మెడికల్ పరికరాలను తయారు చేయడంపై దృష్టిపెట్టవలసి ఉన్నదని మోదీ వెబినార్‌లో గట్టిగా చెప్పారు. తద్వారా డిమాండుకు అనుగుణంగా పరికరాలను సరఫరా చేయగలమని తెలియజేశారు. దేశీ స్టార్టప్ పరిశ్రమకు ప్రభుత్వం వివిధ దశలలో సహకరిస్తుందని అభయమిచ్చారు. మేకిన్ ఇండియా ప్రాజెక్టుల ద్వారా నైపుణ్యాభివృద్ధి దగ్గర నుంచి తయారీ వరకూ అవాంతరాలు లేని పురోగతికి వీలు కల్పించనున్నట్లు తెలియజేశారు. యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ సైతం కాంగ్రెస్ నుద్దేశించి చేసిన తన ప్రసంగంలో స్వయం సమృద్ధి ప్రాధాన్యతను నొక్కి చెప్పినట్లు ప్రస్తావించారు. కొత్తగా ఆవిర్భవిస్తున్న ప్రపంచ వ్యవస్థలో ఆత్మనిర్భరతపై దృష్టి పెట్టడం ద్వారా ముందుకుసాగడం కీలకమని వ్యాఖ్యానించారు. దేశంలో తయారీ రంగానికి దన్నునిచ్చే బాటలో 14 కీలక రంగాలకు రూ. 2 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకాన్ని తీసుకువచ్చినట్లు ప్రస్తావించారు. పౌర సేవలలో ఆప్టికల్ ఫైబర్ వినియోగం, ఈవేస్ట్ మేనేజ్మెంట్, సర్క్యులర్ ఎకానమీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ అంశాలలో ఆచరణసాధ్యమైన సలహాలు ఇవ్వవలసిందిగా ఆహ్వానించారు. మౌలిక సదుపాయాల పురోగమనం టెక్నాలజీ ఆధారితమని, ప్రజా పంపిణీ వ్యవస్థ సైతం డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌తో కనెక్టయి ఉన్నదని వివరించారు. -
విప్రో.. ఓకే
న్యూఢిల్లీ: ఐటీ సర్వీసుల దిగ్గజం విప్రో లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం యథాతథంగా రూ. 2,969 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 2,968 కోట్లు ఆర్జించింది. అయితే క్యూ2తో పోలిస్తే 1.3 శాతం పుంజుకుంది. మొత్తం ఆదాయం దాదాపు 30 శాతం ఎగసి రూ. 20,314 కోట్లకు చేరింది. గతేడాది క్యూ3లో రూ. 15,670 కోట్ల టర్నోవర్ మాత్రమే సాధించింది. అయితే క్యూ2లో నమోదైన రూ. 19,667 కోట్లతో పోలిస్తే ఆదాయంలో 3.2 శాతం వృద్ధి సాధించింది. 2–4 శాతం మధ్య ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం(జనవరి–మార్చి)లో ఐటీ సర్వీసుల ఆదాయం 2–4 శాతం మధ్య పుంజుకోనున్నట్లు విప్రో తాజాగా అంచనా వేసింది. వెరసి 269.2–274.5 కోట్ల డాలర్ల మధ్య టర్నోవర్ నమోదయ్యే వీలున్నట్లు పేర్కొంది. త్రైమాసికవారీగా తాజా గైడెన్స్‌ను ప్రకటించింది. కాగా.. క్యూ3లో ఐటీ సర్వీసుల ఆదాయం త్రైమాసిక ప్రాతిపదికన 2.3 శాతం వృద్ధితో దాదాపు 264 కోట్ల డాలర్లకు చేరింది. జీతాల పెంపు నేపథ్యంలోనూ పటిష్ట నిర్వహణ మార్జిన్లను సాధించగలిగినట్లు కంపెనీ సీఎఫ్‌వో జతిన్ దలాల్ పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం(2022–23)లో కొత్తగా 30,000 మంది ఫ్రెషర్స్‌ను ఉద్యోగాలలోకి తీసుకునే వీలున్నట్లు కంపెనీ ప్రెసిడెంట్, సీహెచ్ఆర్వో సౌరభ్ గోవిల్ వెల్లడించారు. ఇతర హైలైట్స్ ► క్యూ3లో 10,306 మంది ఉద్యోగులను నియమించుకుంది. ► డిసెంబర్‌కల్లా ఐటీ సర్వీసుల మొత్తం సిబ్బంది సంఖ్య 2,31,671కు చేరింది. ► వార్షికంగా 41,363 మందికి ఉపాధి కల్పించింది. ► షేరుకి రూ. 1 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ► క్యూ3లో 80 శాతంమంది రెండోసారి ఉద్యోగులకు జీతాల పెంపు ► గత 12 నెలల్లో 80 శాతంమంది సిబ్బందికి మూడు విడతల్లో ప్రమోషన్లు ఫలితాల నేపథ్యంలో విప్రో షేరు బీఎస్ఈలో స్వల్ప నష్టంతో రూ. 691 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిశాక కంపెనీ ఫలితాలు విడుదల చేసింది. పటిష్ట పనితీరు ఆదాయం, మార్జిన్లలో వరుసగా ఐదో త్రైమాసికంలోనూ కంపెనీ పటిష్ట పనితీరును ప్రదర్శించింది. ఆర్డర్ బుకింగ్స్ సైతం ఊపందుకున్నాయి. గత 12 నెలల్లో 10 కోట్ల డాలర్ల ఆదాయ లీగ్‌లో 7 సంస్థలను(క్లయింట్లు) జత చేసుకున్నాం. క్యూ3లో ఎడ్జైల్, లీన్‌స్విఫ్ట్ సొల్యూషన్స్ కొనుగోళ్లను పూర్తిచేశాం. తద్వారా సామర్థ్యాలను మరింత మెరుగుపరుచుకోగలిగాం. – థియరీ డెలాపోర్ట్, సీఈవో, ఎండీ, విప్రో లిమిటెడ్ -
పీఎస్‌యూల ఆదాయాలు పెంచుతాం
ముంబై: ప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్‌యూ)ల ఆదాయాలు పెంచేందుకు ప్రణాళికలు వేసినట్లు ఆర్థిక శాఖ సహాయమంత్రి భగవత్ కె.కరాద్ తాజాగా స్పష్టం చేశారు. అంతేకాకుండా డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియ ద్వారా ఉద్యోగాల సృష్టి జరుగుతున్నట్లు పేర్కొన్నారు. దేశీయంగా పీఎస్‌యూలు 14 లక్షల మందికి ఉపాధి కలి్పంచినట్లు తెలియజేశారు. డిజిన్వెస్ట్‌మెంట్ అంటే కంపెనీలు నష్టాలు నమోదు చేస్తున్నట్లుకాదని వ్యాఖ్యానించారు. పీఎస్‌యూల ఆదాయం పెంపు, ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం విభిన్నతరహా ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ ఇండియా నిర్వహించిన వర్చువల్ సదస్సులో తెలియజేశారు. ఇటీవల మానిటైజేషన్ ప్రక్రియ ద్వారా ప్రభుత్వం రూ. 6 లక్షల కోట్ల పెట్టుబడులకు ప్రణాళికలు ప్రకటించినట్లు ప్రస్తావించారు. గత నెలలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రోడ్లు, విద్యుత్, రైల్వేలుసహా పలు రంగాలకు చెందిన మౌలిక ఆస్తులకు సంబంధించి జాతీయ మానిటైజేషన్ పైప్‌లైన్(ఎన్ఎంపీ)ను ప్రకటించిన విషయం విదితమే. సంపద సృష్టి పెట్రోలియం, సహజవాయు శాఖ సెక్రటరీ తరుణ్ కపూర్ సైతం పీఎస్‌యూలు ఉద్యోగ కల్పన చేస్తున్నట్లు సదస్సులో పేర్కొన్నారు. దేశానికి సంపదను సృష్టించడమే కాకుండా వాటాదారులకు డివిడెండ్లను పంచుతున్నట్లు ప్రస్తావించారు. దేశాభివృద్ధిలో ప్రభుత్వ రంగ కంపెనీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలియజేశారు. ఇది కొనసాగుతుందని చెప్పారు. మానవ వనరుల శిక్షణకు పీఎస్‌యూలు ఉపయోగపడుతున్నట్లు పేర్కొన్నారు. ఉదాహరణకు ఓఎన్జీసీలో పనిచేసిన నిపుణులు తదుపరి కంపెనీని వీడి ప్రైవేట్ రంగంలో ఉపాధి పొందుతున్నట్లు వెల్లడించారు. -
ఉద్యోగకల్పనకు రూ. 23,000 కోట్లు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కల్లోలం నేపథ్యంలో వ్యాపార సంస్థలను ఉద్యోగ కల్పనకు ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన (ఏబీఆర్‌వై) పథకం పట్టాలెక్కనుంది. ఈ స్కీమ్ కోసం మొత్తం రూ.22,810 కోట్ల నిధుల కేటాయింపునకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ‘ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ 3.0 కింద కోవిడ్ రికవరీ దశలో కొత్త ఉద్యోగాల కల్పనకు ప్రోత్సాహం అలాగే సంస్థాగత రంగంలో ఉపాధిని పెంపునకు తోడ్పాటు కోసం ఉద్దేశించిన ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన’కు ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది’ అని ప్రభుత్వ అధికారిక ప్రకటన పేర్కొంది. ఈ స్కీమ్‌లో భాగంగా ప్రస్తుత 2020–21 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1,584 కోట్ల వ్యయ కేటాయింపునకు, అదేవిధంగా మొత్తం స్కీమ్ కాల వ్యవధికి (2020–23) గాను రూ.22,810 కోట్ల వ్యయానికి కేబినెట్ ఓకే చెప్పినట్లు వెల్లడించింది. ఏబీఆర్‌వై స్కీమ్‌లో భాగంగా 2020 అక్టోబర్ 1 తర్వాత, 2021 జూన్ వరకు కొత్తగా ఉద్యోగాలను కల్పించిన సంస్థలకు రెండేళ్ల పాటు సబ్సిడీ ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తుందని కేబినెట్ సమావేశం అనంతరం కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ వివరించారు. పథకం సంగతిదీ... 1,000 మంది వరకూ ఉద్యోగులు ఉండే సంస్థలు కొత్తగా చేపట్టే నియామకాలకు సంబంధించి ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) చెల్లింపులను ప్రభుత్వమే భరిస్తుంది. అంటే ఆయా కొత్త ఉద్యోగుల మూల వేతనంపై 12% ఉద్యోగుల తరఫు చెల్లింపు, 12% వ్యాపార సంస్థ తరఫు చెల్లింపు, అంటే మొత్తం 24 శాతాన్ని ఈ స్కీమ్ కింద కేంద్రం సబ్సిడీ కింద అందజేస్తుంది. అయితే, 1,000 మంది కంటే అధికంగా ఉద్యోగులు కలిన సంస్థల విషయంలో మాత్రం రెండేళ్ల పాటు కేవలం ఉద్యోగుల తరఫున 12 శాతం ఈపీఎఫ్ చెల్లింపు మొత్తాన్ని మాత్రమే ప్రభుత్వం భరిస్తుంది. ఉదాహరణకు, 2020 అక్టోబర్ 1 తేదీకి ముందు ఈపీఎఫ్ఓలో నమోదైన ఏ సంస్థలో కూడా పనిచేయని, యూనివర్సల్ పర్మనెంట్ నంబర్ (యూఏఎన్) లేని ఒక ఉద్యోగి (నెల వేతనం రూ.15,000 లోపు ఉండాలి) ఈ స్కీమ్‌కు అర్హుడు. కోవిడ్ సమయంలో, 2020 మార్చి 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య ఉద్యోగాన్ని కోల్పోయిన ఉద్యోగి (నెల వేతనం రూ.15,000 లోపు ఉండాలి), సెప్టెంబర్ 30, 2020 వరకూ ఈపీఎఫ్ఓ కవరేజీ ఉన్న ఏ సంస్థలోనూ చేరకుండా ఉన్నా కూడా ఈ స్కీమ్ ప్రయోజనానికి అర్హత లభిస్తుంది. ఆధార్‌తో అనుసంధానమైన సభ్యుల ఖాతాలోకి ఎలక్ట్రానిక్ విధానంలో భవిష్య నిధి వాటా మొత్తాన్ని ఈపీఎఫ్ఓ జమ చేస్తుంది. కేబినెట్ ఇతర నిర్ణయాలు.. ► కోచి, లక్షద్వీప్ ద్వీపాల మధ్య సబ్‌మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్(ఓఎఫ్సీ) కనెక్టివిటీని కల్పించే ప్రాజెక్టుకు ఆమోదం. దీనికి రూ.1,072 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. ► భారత్, సురినామ్ మధ్య ఆరోగ్యం, వైద్య రంగాల్లో సహకారం కోసం ఉద్దేశించిన అవగాహన ఒప్పందానికి ఓకే. ► భారత మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ, లగ్జెంబర్గ్ క్యాపిటల్ మార్కెట్స్ నియంత్రణ సంస్థ సీఎస్‌ఎస్‌ఎఫ్ మధ్య ఒప్పందం. -
భారత్ ఎకానమీకి వెలుగు రేఖలు!
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక రంగానికి సంబంధించి కొంత ఆశావహమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. క్రితం క్షీణ రేటు అంచనాల తగ్గింపు వరుసలో తాజాగా మూడీస్ నిలిచింది. కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో 2020 ఏప్రిల్–2021 మార్చి మధ్య భారత్ ఆర్థిక వ్యవస్థ 11.5 శాతం క్షీణిస్తుందన్న తన తొలి అంచనాలను మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ గురువారం మైనస్ 10.6 శాతానికి తగ్గించింది. తయారీ రంగానికి, ఉపాధి కల్పనకు కేంద్ర ఉద్దీపన చర్యలు దోహదపడతాయని సూచించింది. అంతర్జాతీయ బ్రోకరేజ్ దిగ్గజం– గోల్డ్‌మన్ శాక్స్ తన క్రితం భారీ 14.8 శాతం క్షీణ అంచనాలను 10.3 శాతానికి సవరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా మూడీస్ క్షీణ రేటు కుదింపునకు తగిన విశ్లేషణలతో ముందుకు వచ్చింది. 2020లోసైతం క్షీణ రేటు అంచనాలను మూడీస్ ఇంతక్రితం మైనస్ 9.6 శాతం అంచనావేయగా, తాజాగా దీనిని మైనస్ 8.9 శాతానికి తగ్గించింది. కరోనా వైరస్ సంక్షోభంతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడం ధ్యేయంగా ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ (స్వావలంబన భారత్) 3.0 పేరుతో కేంద్రం నవంబర్ 12వ తేదీన 2.65 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ అమలు చేసినప్పట్నుంచీ ఇప్పటిదాకా ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీల మొత్తం పరిమాణం దాదాపు రూ. 30 లక్షల కోట్లుగా ఉంటుందని (స్థూల దేశీయోత్పత్తిలో 15 శాతం) ఈ ప్యాకేజ్ సందర్భంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. భారత తయారీ రంగంలో పోటీతత్వాన్ని పెంచడానికి, ఉపాధి కల్పనకు, మౌలిక రంగంలో పెట్టుబడులకు మద్దతునివ్వడానికి కేంద్రం తాజాగా ప్రకటించిన రూ.2.7 లక్షల కోట్ల ఉద్దీపన చర్యలు ‘‘క్రెడిట్ పాజిటివ్’’అని తెలిపింది. 2021–22లో భారత్ వృద్ధి సైతం 10.8 శాతంగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపింది. ఇంతక్రితం ఈ అంచనా 10.6 శాతం. ఏడాదిలోనే ఆర్థిక రికవరీ: ఇండియాలెండ్స్ సర్వే భరోసా వచ్చే 12 నెలల్లో ఆర్థిక రికవరీ నెలకొంటుందన్న విశ్వాసం ఒక జాతీయ సర్వేలో వ్యక్తం అయ్యింది. సర్వేలో 77 శాతం మంది ఏడాదిలోపే రికవరీ ఉంటుందన్న భరోసాతో ఉంటే, వీరిలో 27 శాతం మంది మూడు నెలల్లోపే రికవరీ ఉంటుందన్న నమ్మకంతో ఉన్నారు. డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫాం ఇండియాలెండ్స్ ఈ సర్వే నిర్వహించింది. నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడం లేదా సొంత వ్యాపారం ప్రారంభించే పనిలో చాలా మంది నిమగ్నమయ్యారని సర్వేలో తేలింది. ఈ సర్వేలో 18–55 ఏళ్ల వయసున్న వేతన జీవులు, స్వయం ఉపాధి పొందుతున్న 1,700 మంది పాల్గొన్నారు. వీరిలో 41 శాతం మంది 25–35 ఏళ్ల వయసున్న యువత ఉన్నారు. సెప్టెంబర్ త్రైమాసికంలో క్షీణత 9.5 శాతం: ఇక్రా జీడీపీ సెప్టెంబర్ త్రైమాసికంలో 9.5 శాతం క్షీణిస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనావేసింది. నవంబర్ 27న తాజా గణాంకాలు విడుదల కానున్న నేపథ్యంలో ఇక్రా ఈ అంచనాలను ఆవిష్కరించింది. ఉత్పత్తి వరకూ పరిగణనలోకి తీసుకునే జీవీఏ (గ్రాస్ వ్యాల్యూ యాడెడ్) విషయంలో పరిశ్రమల క్షీణ రేటు అంచనాలను 38.1% నుంచి 9.3 శాతానికి తగ్గించింది. తయారీ, నిర్మాణ, సేవల రంగాలు తొలి అంచనాలకన్నా మెరుగుపడే అవకాశం ఉందని ఇక్రా ఈ సందర్భంగా పేర్కొంది. 2020–25 మధ్య వృద్ధి 4.5 శాతమే: ఆక్స్ఫర్డ్ ఎకానమీస్ భారత్ ఆర్థిక వ్యవస్థ 2020–25 మధ్య 4.5 శాతం వృద్ధి రేటునే సాధిస్తుందని ప్రపంచ గణాంకాల దిగ్గజ సంస్థ– ఆక్స్ఫర్డ్ ఎకానమీస్ గురువారం అంచనావేసింది. ఇంతక్రితం ఈ అంచనా 6.5 శాతం. కరోనా ప్రేరిత అంశాలే తమ అంచనాల సవరణకు కారణమని పేర్కొంది. ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు 2020–21 స్థూల దేశీయోత్పత్తిలో 7 శాతం ఉంటుందని సంస్థ విశ్లేషించింది. పలు సంస్థల అంచనాలు ఇలా... కరోనా కల్లోల పరిస్థితులతో మొదటి త్రైమాసికం భారత్ ఆర్థిక వ్యవస్థ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 23.9 శాతం క్షీణ రేటును నమోదుచేసుకున్న నేపథ్యంలో... ఇప్పటికే పలు ఆర్థిక, రేటింగ్ సంస్థలు 2020–21లో భారత్ ఆర్థిక వ్యవస్థ క్షీణ రేటు 8 శాతం నుంచి 11% వరకూ ఉంటుందని అంచనావేశాయి. ఆయా అంచనాలను పరిశీలిస్తే (శాతాల్లో) సంస్థ క్షీణత అంచనా కేర్ 8.2 యూబీఎస్ 8.6 ఎస్అండ్పీ 9 ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 9 ఆర్బీఐ 9.5 ప్రపంచబ్యాంక్ 9.6 ఫిచ్ 10.5 ఎస్బీఐ ఎకోర్యాప్ 10.9 ఇక్రా 11 ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ 11.8 ఐఎంఎఫ్ 10.3 -
మత్స్య సంపద వృద్ధికి పీఎంఎంఎస్వై
న్యూఢిల్లీ: దేశ మత్స్య ఎగుమతులు రెట్టింపు చేయడం, రైతు ఆదాయం, మరిన్ని ఉద్యోగావకాశాల కల్పనే లక్ష్యంగా ప్రధాని మోదీ గురువారం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన(పీఎంఎంఎస్వై)ను ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఈ–గోపాల యాప్, బిహార్‌లో మరికొన్ని పథకాలను ప్రారంభించారు. ఈ పథకం కింద వచ్చే ఐదేళ్లలో రూ.20 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. దీని ద్వారా గ్రామాల అభివృద్ధి, దేశ స్వావలంబనకు వీలవుతుందని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో మత్స్య ఉత్పత్తులను రెట్టింపు చేస్తూ..అదనంగా 70 లక్షల టన్నుల మేర ఉత్పత్తిని పెంచి 2024–25 కల్లా ఎగుమతుల ద్వారా లక్ష కోట్ల ఆదాయం సాధించమే లక్ష్యం. 2020–21 నుంచి 2024–25 వరకు అమలయ్యే ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా పీఎంఎంఎస్‌వైను రూ.20,050 కోట్లతో అమలు చేస్తారు. ఈ రంగంలో ఉన్న అవకాశాలను వినియోగించుకునేందుకు వీలుగా మత్స్య శాఖను ఏర్పాటు చేయనున్నామన్నారు. ఫిషరీస్‌తోపాటు పాడి పరిశ్రమను అభివృద్ధి చేయడం ద్వారా రైతులు, ఉత్పత్తి దారుల ఆదాయం పెంచుతామన్నారు. ఈ–గోపాలæ యాప్‌లో పశుపోషణ, ఆరోగ్యం, దాణా, ఉత్పాదకత వంటి అంశాలపై సమస్త సమాచారం ఉంటుందన్నారు. ఈ–గోపాల్‌ను యానిమల్ ఆధార్‌కు అనుసంధానం చేస్తామన్నారు. 50 కోట్లకు పైగా పశువులకు ఫుడ్ అండ్ మౌత్, బ్రుసెల్లోసిస్ వంటి వ్యాధులు సోకకుండా ఉచితంగా టీకా వేసే కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించారు. -
ఉద్యోగ సృష్టికర్తలొస్తారు..
న్యూఢిల్లీ: ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్లు కాదు.. ఉద్యోగాలు ఇచ్చేవాళ్లను తయారు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం నూతన విద్యా విధానం–2020ని ప్రకటించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. దేశంలో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. శనివారం స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు. విద్యార్థి ఏం నేర్చుకోవాలని కోరుకుంటున్నాడో అదే అందించడం కొత్త విద్యా విధానంలో భాగంగా ఉంటుందని వెల్లడించారు. ఇది కేవలం ఒక విధాన పత్రం కాదని, 130 కోట్ల మందికిపైగా ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపం అని పేర్కొన్నారు. ‘ఇష్టం లేని సబ్జెక్టులను తమపై బలవంతంగా రుద్దుతున్నారని చాలామంది విద్యార్థులు భావిస్తున్నారు. ఆసక్తి లేని చదువులు చదవాలని వారిపై మిత్రులు, కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. దీనివల్ల విద్యార్థులు అక్షరాస్యులు అవుతారేమో గానీ వారికి ఉపయోగం మాత్రం ఉండదు. డిగ్రీలు సంపాదించినప్పటికీ ఆత్మవిశ్వాసం కొరవడుతుంది. ఇది వారి జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈ పరిస్థితిని సమూలంగా మార్చేయడమే నూతన విద్యా విధానం ఉద్దేశం’ అని మోదీ ఉద్ఘాటించారు. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ నాలుగో ఎడిషన్‌ను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్వహించింది. ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలకు విద్యార్థులు పరిష్కార మార్గాలు చూపడమే దీని ఉద్దేశం. ఈ ఏడాది 243 సమస్యల పరిష్కారానికి 10 వేల మందికిపైగా పోటీపడ్డారు. విజేతలకు నగదు బహుమతి అందజేశారు.