
న్యూఢిల్లీ: దేశంలో ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం అమలుతో వచ్చే ఏడేళ్ల కాలంలో 11 లక్షల కొత్త ఉద్యోగాల కల్పన జరగనుందని ప్రధాని మోదీ తెలిపారు. రైల్వేల తర్వాత దేశంలో అత్యధికంగా ఉద్యోగాలు కలి్పంచిన రంగం ఇదేనన్నారు. ఆయుష్మాన్ భారత్– ప్రధాన్‌మంత్రి జన్ ఆరోగ్య యోజన(ఏబీ–పీఎంజేఏవై) అమలు మొదలై ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు. నవీన భారతం కోసం తీసుకున్న విప్లవాత్మక చర్యల్లో ఆయుష్మాన్ భారత్ ఒకటన్నారు.
ఇప్పటి వరకు దాదాపు 46 లక్షల మంది నిరుపేదలకు వ్యాధుల నుంచి విముక్తి కలి్పంచినట్లు ప్రధాని తెలిపారు. రానున్న రోజుల్లో మరికొన్ని ఆస్పత్రులకు ఈ కార్యక్రమాన్ని విస్తరించి, ఉద్యోగ అవకాశాలను విస్తృతం చేయనున్నామన్నారు. ‘డిమాండ్‌కు తగినట్లుగా ఈ పథకాన్ని విస్తరిస్తే రానున్న 5 నుంచి 7 ఏళ్లలో 11 లక్షల కొత్త ఉద్యోగాలు తయారవుతాయి’అని తెలిపారు. పేదలు తమ ఆరోగ్యం కోసం నగలు, భూమి, ఇళ్లు తాకట్టుపెట్టుకోవడం ఆపితే ఈ కార్యక్రమం విజయవంతం అయినట్లేనన్నారు.
Comments
Please login to add a commentAdd a comment