దేశ యువతలో స్కిల్స్ పెంపు, ఉద్యోగ కల్పనపై కేంద్రం ఫోకస్
బడ్జెట్‌లో ఐదు పథకాలను ప్రకటించిన కేంద్రఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్
వచ్చే ఐదేళ్లలో 2 లక్షల కోట్లతో.. 4.1 కోట్లమంది యువతకు ప్రయోజనం కలిగేలా అమలు
కొత్తగా ఉద్యోగంలోచేరేవారికి, కొత్తఉద్యోగాలు ఇచ్చేసంస్థలకు ప్రోత్సాహకాలు
కోటి మందికి500 టాప్ కంపెనీల్లోఇంటర్న్‌షిప్ అవకాశాలు
న్యూఢిల్లీ: దేశంలో భారీగా కొత్త ఉద్యోగాల కల్పన, అందుకు వీలు కల్పించేలా యువతకు నైపుణ్య శిక్షణ లక్ష్యంతో మోదీ 3.0 సర్కారు అడుగులు వేసింది. తమ ప్రభుత్వం నిర్దేశించుకున్న తొమ్మిది అత్యంత ప్రాధాన్య అంశాల్లో ‘ఉద్యోగ కల్పన, నైపుణ్య శిక్షణ’ఒకటని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.
వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 4.1 కోట్ల మంది యువతకు ప్రయోజనం కలిగేలా, రూ.2 లక్షల కోట్లను ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. ఉద్యోగాల కల్పన కోసం మూడు, నైపుణ్యాల అభివృద్ధి కోసం రెండు ప్రోత్సాహక పథకాలను చేపడతామని ప్రకటించారు. కొత్తగా ఉద్యోగాలు ఇచ్చే సంస్థలకు, కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి ప్రయోజనాలను కల్పిస్తామని ప్రకటించారు.
ఈపీఎఫ్‌ఓ డేటా ఆధారంగా..
కొత్త ఉద్యోగాల కల్పన పథకాలను..ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ)లో నమోదయ్యే వివరాల ఆధారంగా అమలు చేస్తామని నిర్మల తెలిపారు. మొత్తంగా ప్రస్తుత 2024–25 కేంద్ర బడ్జెట్‌లో విద్య, ఉద్యోగ కల్పన, నైపుణ్య శిక్షణ కోసం రూ.1.48 లక్షల కోట్లను కేటాయిస్తున్నట్టు వెల్లడించారు. ఇందులో ఎంప్లాయ్‌మెంట్ లింక్‌డ్ ఇన్సెంటివ్ స్కీమ్‌కు 23 వేల కోట్లు, జాబ్ క్రియేషన్ ఇన్ మాన్యుఫాక్చరింగ్ స్కీమ్‌కు రూ.52 వేల కోట్లు, సపోర్ట్ టుఎంప్లాయర్స్ స్కీమ్‌కు రూ.32 వేల కోట్లు కలిపి రూ.1.07 లక్షల కోట్లను ఖర్చు చేయనున్నట్టు వివరించారు.
నైపుణ్యాలకు తగిన ఉద్యోగాలు..
కార్కుల నైపుణ్యాలకు తగిన ఉద్యోగాలు లభించేలా చర్యలు చేపడతామని నిర్మలా సీతారామన్ చెప్పారు. అందుబాటులో ఉన్న ఉద్యోగాలు, వాటికి అవసరమైన నైపుణ్యాలు, తగిన నైపుణ్యమున్న కార్మకులతో కూడిన డేటాబేస్‌ను సిద్ధం చేస్తామని వెల్లడించారు. ఇందుకోసం ఈ–శ్రమ్, శ్రమ్ సువిధ, సమాధాన్ వంటి పోర్టల్స్‌ను అనుసంధానం చేస్తామని తెలిపారు. దీనితో స్కిల్ ప్రొవైడర్స్, ఎంప్లాయర్స్‌కు.. ఉద్యోగాలు కోరుకునే యువతకు మధ్య అనుసంధానంకుదురుతుందని వెల్లడించారు.
ఐదేళ్లలో కోటి మందికిఇంటర్న్‌షిప్
దేశంలో యువత సులభంగా ఉద్యోగాలు పొందేందుకు వీలు కల్పించేలా, ఉద్యోగంలో చేరే ముందే తగిన అనుభవం సాధించేలా.. విస్తృతస్థాయిలో ఇంటర్న్íÙప్ పథకాన్ని అమలు చేస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో 500 టాప్ కంపెనీల్లో మొత్తంగా కోటి మంది యువతకు ఇంటర్న్‌షిప్ అవకాశం కలి్పస్తామని తెలిపారు. ఇంటర్న్íÙప్‌లో చేరేప్పుడు ఒకసారి రూ.6 వేలు అందిస్తామని, తర్వాత ప్రతినెలా రూ.5 వేలు ఇంటర్న్‌సిప్ అలవెన్స్ అందుతుందని వెల్లడించారు.
ఏడాదిపాటు కొనసాగే ఈ ఇంటర్న్‌షిప్ సమయంలో సంబంధిత ఉద్యోగం, పని వాతావరణంపై యువతకు అవగాహన ఏర్పడుతుందని.. దీనితో మంచి ఉద్యోగం పొందేందుకు అవకాశం వస్తుందని వివరించారు. ఈ ఇంటర్న్‌షిప్ పథకానికి ఎంపికయ్యే యువతకు శిక్షణ ఇచ్చేందుకయ్యే వ్యయాన్ని, ఇంటర్న్íÙప్ అలవెన్స్‌లో పది శాతాన్ని కంపెనీలు తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) నిధుల నుంచి భరిస్తాయని తెలిపారు.
స్కిల్స్‌పెరిగితే.. ఉద్యోగాలూ పెరుగుతాయి!
బడ్జెట్‌లో దేశ యువతలో నైపుణ్యాల పెంపు, ఉద్యోగ కల్పనకు ప్రోత్సాహకాలు అందించే స్కీమ్‌లను ప్రకటించడంపై హ్యూమన్స్ రీసోర్స్, ఎడ్ టెక్ రంగాల నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘వికసిత్ భారత్’లక్ష్య సాధన దిశగా ప్రభుత్వం ముందుచూపుతో నిర్ణయం తీసుకుందని ప్రశంసిస్తున్నారు. యువతలో నైపుణ్యాలు పెరిగితే ఉద్యోగ అవకాశాలు విస్తృతం అవుతాయని అంటున్నారు.
‘‘మాన్యుఫాక్చరింగ్ రంగంలో ఉద్యోగాల సృష్టికి ప్రభుత్వ ప్రోత్సాహకాలు తోడ్పడతాయి. పరిశ్రమకు అవసరమైన మానవ వనరులు అందేందుకు నైపుణ్య శిక్షణ బాట వేస్తుంది. ఈ దిశగా ప్రభుత్వ నిర్ణయాలు బాగున్నాయి..’’అని టీమ్‌లీజ్ డిగ్రీ అప్రెంటిస్íÙప్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ సుమిత్‌కుమార్ పేర్కొన్నారు. ‘‘నైపుణ్య శిక్షణ మాత్రమేగాకుండా.. ఉద్యోగులు, ఉద్యోగాలను కలి్పంచే కంపెనీలకూ ప్రోత్సాహకాలు ఇవ్వడం స్వాగతించదగిన విషయమని క్వెస్ కార్ప్ సీఈవో గురుప్రసాద్ శ్రీనివాసన్ చెప్పారు.
‘‘20 లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ, కోటి మందికి ఇంటర్న్‌షిప్ అవకాశాలు వంటివి రాబోయే తరం సాధికారతకు తోడ్పడతాయి. దేశంలోని యువతలో నైపుణ్యాల లోటును పూడ్చవచ్చు..’’అని పియర్సన్ ఇండియా కంట్రీ హెడ్ వినయ్‌కుమార్ స్వామి పేర్కొన్నారు.
..: ఉద్యోగాల కల్పన కోసం :..
1 ఎంప్లాయ్‌మెంట్ లింక్‌డ్ ఇన్సెంటివ్ స్కీమ్ : వ్యవస్థీకృత రంగాల్లో కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి ప్రోత్సాహకంగా ఒక నెల వేతనం చెల్లింపు. మూడు వాయిదాల్లో.. గరిష్టంగా రూ.15 వేల వరకు అందిస్తారు. దీనితో వచ్చే ఐదేళ్లలో 2.1 కోట్ల మందికి లబ్ధి కలుగుతుందని అంచనా.
2 జాబ్ క్రియేషన్ ఇన్‌మాన్యుఫాక్చరింగ్ స్కీమ్: కొత్తగా ఉద్యోగంలో చేరేవారు,కొత్తగా ఉద్యోగాలిచ్చే సంస్థలు చెల్లించేఈపీఎఫ్‌ఓ చందాలపై తొలి నాలుగేళ్లపాటు ప్రోత్సాహకాలు. సుమారు 30 లక్షల మంది యువతకు ప్రయోజనం కలుగుతుందనిఅంచనా.
3 సపోర్ట్ టుఎంప్లాయర్స్ స్కీమ్:
కంపెనీలు కొత్తగా/అదనంగా ఇచ్చే ఉద్యోగాలకు సంబంధించి యాజమాన్య వాటాగా చెల్లించే ఈపీఎఫ్ చందాల రీయింబర్స్‌మెంట్. ఒక్కో ఉద్యోగికి నెలకు గరిష్టంగా రూ.3 వేల చొప్పున రెండేళ్లపాటు చెల్లిస్తారు. దీనితో కొత్తగా 50 లక్షల ఉద్యోగాల కల్పనజరుగుతుందని అంచనా. (ఈ మూడు స్కీమ్‌లనుగరిష్టంగా నెలకు రూ.లక్ష వేతనంఇచ్చే ఉద్యోగాలు/ఉద్యోగులకు మాత్రమే వర్తింపజేస్తారు.)
..: నైపుణ్యాల శిక్షణ కోసం :..
1 వచ్చే ఐదేళ్లలో 20 లక్షల మంది యువతలో నైపుణ్యాల అభివృద్ధి కోసం ప్రత్యేక పథకం. రాష్ట్రాలు, పరిశ్రమలు, కంపెనీలతో కలసి దీనిని అమలు చేస్తారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా కేంద్రీకృత విధానంలో 1,000 పారిశ్రామిక శిక్షణ ఇన్‌స్టిట్యూట్ల (ఐటీఐ) అప్‌గ్రెడేషన్.
2 వచ్చే ఐదేళ్లలో కోటి మందికి 500 టాప్ కంపెనీల్లో ఇంటర్న్íÙప్ అందించే మరో పథకం అమలు.
3 పరిశ్రమలు, కంపెనీల అవసరాలకుతగినట్టుగా ఉండేలా కోర్సులు,పాఠ్యాంశాల రూపకల్పన.
4 నైపుణ్య శిక్షణ కోసం ‘మోడల్ స్కిల్ లోన్ స్కీమ్’కింద ఏటా 25 వేల మంది యువతకు రూ.7.5 లక్షల వరకు రుణాలు.
5 మహిళలకే ప్రత్యేకించిన నైపుణ్యాల శిక్షణ కార్యక్రమాలు. ఉద్యోగాల్లో మహిళల భాగ స్వామ్యం పెరగడం కోసం.. పరిశ్రమలు, కంపెనీల సహకారంతో వర్కింగ్ విమెన్ హాస్టళ్లు, చిన్న పిల్లల సంరక్షణను చూసుకునే క్రెచ్‌ల ఏర్పాటుకు నిర్ణయం.
ప్రభుత్వ ఉద్యోగుల శిక్షణకు రూ.309.74 కోట్లు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు బడ్జెట్‌లో రూ.309.74 కోట్లను కేటాయించారు. ఇందులో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెక్రటేరియట్ ట్రైనింగ్ అండ్ మేనేజ్‌మెంట్,లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌కు రూ.103.05 కోట్లు. వివిధ శిక్షణ స్కీమ్‌లకు రూ.120.56 కోట్లు, మిషన్ కర్మయోగికి రూ.86.13 కోట్లు ఇచ్చారు. వీటితో ఉద్యోగులకు వివిధ నైపుణ్యాలపై రిఫ్రెషర్ కోర్సులు, మిడ్ కెరీర్ శిక్షణ ఇస్తారు.
Comments
Please login to add a commentAdd a comment