![AP is fourth in the country in terms of job creation - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/15/fake.jpg.webp?itok=JDmnFCx2)
ఉద్యోగాల కల్పనలో జగన్ సర్కారు మోసం చేసిందంటూ రామోజీ అక్కసు రాతలు
కోట దాటి గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్తే అక్కడ ఉద్యోగాల విప్లవం కనిపిస్తుంది
ప్రతీ గ్రామ, వార్డు సచివాలయాల్లో 10–11 మంది శాశ్వత ఉద్యోగులు
అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే కొత్తగా 1.25 లక్షల ఉద్యోగాల సృష్టి, భర్తీ
దేశంలో అత్యధిక ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న రాష్ట్రాల్లో ఏపీది నాలుగో స్థానం.. వైద్య ఆరోగ్య శాఖలో ఏకంగా 53,466 ఉద్యోగాల భర్తీ
కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసిన సీఎం జగన్
2022–23లో 1.2 లక్షల మందికి క్యాంపస్ ఉద్యోగాలు
యువత ఉపాధి కోసం 14.26 లక్షల మందికి నైపుణ్య శిక్షణ
బాబు హయాంలో నిరుద్యోగిత రేటు 5.3 శాతం
వైఎస్ జగన్ హయాంలో 4.1 శాతమే
కళ్లకు చంద్రబాబు పొరలు కమ్మేసిన గుడ్డి రామోజీ మరోసారి బట్టలిప్పేశారు. ఉద్యోగాలివ్వకుండా యువతను జగన్ సర్కారు మోసం చేసిందంటూ చేతికొచ్చింది రాసి చిందులు తొక్కారు. తాను కట్టుకున్న కోట దాటి గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి చూస్తే అక్కడ సీఎం జగన్ సృష్టించిన ఉద్యోగాల విప్లవం ఈ బధిరుడికి కనిపించేది. చంద్రబాబు స్కిల్ స్కామ్‌ను బయటకు తీశారన్న అక్కసుతో జగన్ ఏలుబడిలో ఉద్యోగాల కల్పన లేదంటూ పచ్చి అవాస్తవాలను అచ్చు వేశారు. పదే పదే అవాస్తవాలను ప్రచారం చేస్తున్న రామోజీ ఒకసారి గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి ఉద్యోగాలు కల్పించలేదంటూ రాగం తీస్తే అప్పుడు ఎవరు ఎవరి కాలర్ పట్టుకుని నిలదీస్తారో తెలుస్తుంది.
ఈ రాతలపై మండిపడుతున్న యువత ఎవరి కాలర్ పట్టుకోవాలో ఇప్పటికే నిర్ణయించేసుకుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాలుగు నెలల్లోనే 1.25 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించడమే కాకుండా పారదర్శకంగా భర్తీ చేసిన ఘనత జగన్ సర్కారుది. ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో 10–11 మంది వరకు ప్రభుత్వ ఉద్యోగులు కనిపిస్తారు. దేశ చరిత్రలో ఒకేసారి కొత్తగా 1.25 లక్షల ఉద్యోగాలను సృష్టించడం, వెంటనే భర్తీ చేయడం జరగనేలేదు. చంద్రబాబు హయాంలో నిరుద్యోగిత రేటు 5.3 శాతం ఉంటే ఇప్పుడు వైఎస్.జగన్ హయాంలో కేవలం 4.1 శాతమే.
ఈ గణాంకాలు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ వెలువరించినవి. 2014–19 మధ్య చంద్రబాబు భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్య కేవలం 34,108. చంద్రబాబు దిగిపోయే మే 2019 నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,97,123 మాత్రమే. ఇప్పుడు వైఎస్.జగన్ హయాంలో శాశ్వత ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్, ఇతర ఉద్యోగులు మొత్తం కలిపి 6,38,087 మంది ఉన్నారు. వైద్య ఆరోగ్య రంగాన్ని చంద్రబాబు గాలికి వదిలేస్తే, వైఎస్.జగన్ సర్కారు 53,466 ఉద్యోగాలను భర్తీ చేసింది.
నైపుణ్య శిక్షణ మీ బాబు భక్షణే
అసలు ఈనాడు రామోజీ ఏడుపు అంతా చంద్రబాబు స్కిల్ స్కామ్‌పై విచారణ చేపట్టడమేనని అక్కసుతో రాసిన ఈ కథనం చెప్పకనే చెబుతోంది. స్కిల్ పేరుతో చంద్రబాబు దోపిడీ అంతా ఇంతా కాదు. స్కిల్ పేరుతో కోట్లాది రూపాయల నిధులు తన ఇంటికి మళ్లించేశారు. కానీ వైఎస్.జగన్ ప్రభుత్వం 175 శాసనసభ నియోజకవర్గాల్లో కనీసం ఒకటి ఉండే విధంగా మొత్తం 192 స్కిల్ హబ్‌్సను ఏర్పాటు చేసింది. ఇక్కడ లెవెల్–4 లోపు కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. ప్రతీ పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి తక్కువ కాకుండా మొత్తం 26 స్కిల్ కాలేజీలను ఏర్పాటు చేసింది.
హై ఎండ్ టెక్నాలజీలో శిక్షణ ఇవ్వడానికి తిరుపతిలో 50 ఎకరాల విస్తీర్ణంలో స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తోంది. అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు రాష్ట్ర విద్యార్థులు అందుకునే విధంగా స్కిల్ ఇంటర్నేషనల్ పేరుతో ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. ఇందుకోసం పలు పరిశ్రమలు, విదేశీ సంస్థలతో ఒప్పందం చేసుకొంది. ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్యర్యంలో నైపుణ్య శిక్షణ కోర్సులను అందిస్తోంది. 2019–20 నుంచి 2023–24 వరకు 14,26,515 మంది యువతకు శిక్షణ ఇచ్చింది.
అత్యధిక ఉద్యోగాల కల్పనలో దేశంలోనే ఏపీ నాలుగో స్థానం
కేంద్రం విడుదల చేసిన ఇండియా 2023 స్కిల్ రిపోర్ట్ అత్యధిక ఉద్యోగావకాశాల కల్పనలో దేశంలోనే ఆంద్రప్రదేశ్ నాలుగో స్థానంలో ఉందని స్పష్టం చేసింది. సామాజిక, పారిశ్రామిక, సాంకేతిక మౌలిక సదుపాయాలు కల్పన భేష్ అని నివేదిక ప్రశంసించింది. ప్లేస్‌మెంట్లలో రూ.2.6 లక్షలు అంతకంటే ఎక్కువ వేతనాలు అందే రాష్ట్రాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందని స్కిల్ రిపోర్ట్ పేర్కొంది. యువతకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు నైపుణ్య శిక్షణ ఇప్పించి పెద్ద పెద్ద ఉద్యోగాలు పొందేలాగా ప్రోత్సహిస్తున్నది సీఎం వైఎస్.జగన్ మాత్రమే.
Comments
Please login to add a commentAdd a comment