న్యూఢిల్లీ: జనరేటివ్ ఏఐ (కృత్రిమ మేథ)పై ప్రభుత్వ పెట్టుబడులు, ప్రోత్సాహకాలు, ఓపెన్‌సోర్స్ కంటెంట్ అన్నవి దేశంలో ఉపాధి కల్పనను మరింత పెంచుతాయని, అసమానతలను తగ్గిస్తాయని నిపుణులు అభిప్రాయపడ్డారు.
‘‘జనరేటివ్ ఏఐ కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుంది. పరిమిత నైపుణ్యాలున్న వారు సైతం ఉన్నత శ్రేణి ఉద్యోగాలను నిర్వహించేందుకు సాయపడుతుంది. ఇది ఆర్థిక అసమానతలను తగ్గిస్తుంది’’అని ఐఎంటీ ఘజియాబాద్ డైరెక్టర్ విశాల్ తల్వార్ అభిప్రాయపడ్డారు. ఇందుకు బలమైన మౌలిక వసతుల కల్పన అవసరమంటూ.. రానున్న బడ్జెట్‌లో ఇందుకు ప్రత్యే కేటాయింపులు చేయాలని జెనరేటివ్ ఏఐపై నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో తల్వార్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన, వ్యాపార విద్య రూపాంతరంపై కీలకంగా చర్చించారు. భారత్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఏఐ కార్యక్రమాలు, ఏఐ మిషన్‌తో ఏఐ ఆధారిత నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన విషయంలో దేశం గణనీయమైన పురోగతికి సిద్ధంగా ఉందని తల్వార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. టెక్నాలజీ పరంగా మరింత ముందుకు వెళ్లడమే కాకుండా, వేగంగా మారిపోతున్న ఉద్యోగ ముఖ చిత్రంలో వ్యక్తుల నైపుణ్యాలకు సాధికారతను జనరేటివ్ ఏఐ తీసుకొస్తుందన్నారు.
భారత కంపెనీలు ఇప్పటికే రూపొందించిన టూల్స్, ప్లాట్‌ఫామ్‌ల సాయంతో జనరేటివ్ ఏఐ విభాగంలో కీలక పాత్ర పోషించగలవని ఇదే చర్చా కార్యక్రమంలో పాల్గొన్న నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీకి చెందిన కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ప్రొఫెషర్ మోహాంబిర్ సావ్నే పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment