కరోనా మహమ్మారి దెబ్బకు వలస కార్మికులు జీవితాలు తలక్రిందులయ్యాయి. కరోనా కట్టిడికి విధించిన ఆంక్షలతో నగరాల్లో ఉపాధి కరువై తిరిగి సొంతూళ్లకు పయనమవుతున్నారు. కాగా, కరోనా కాలంలోనూ కూరగాయాల ధరలు ఆకాశాన్నంటడంతో సామాన్యులకు పట్టపగలే చుక్కలు కనబడుతున్నాయి. ఇదిలావుంచితే కరోనా విలయంతో పెళ్లిళ్లు నిరాడంబరంగా జరుగుతున్నాయి. వధూవరులు పీపీఈ కిట్లనే పెళ్లిబట్టలుగా ధరించాల్సిన ఆగత్యం ఏర్పడింది.
1/8
ముంబైలోని వెస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేపై సోమవారం ట్రాఫిక్ జాం చోటుచేసుకోవడంతో నిలిచిన వాహనాలు
2/8
కూటి కోసం.. కూలి కోసం వలస వచ్చిన కష్టజీవికి ఎంత కష్టం. కరోనా సృష్టించిన కష్టాలు ఎన్నెన్నో.. బతుకుదెరువుకు నగరమొచ్చిన వలస కార్మికులు బతుకులకు బరువై ఉపాధి కరువై పడరాని పాట్లు పడుతున్నారు. స్వగ్రామాలకు వెళ్లి పొట్ట పోసుకునేందుకు మూటా ముల్లెతో బయలుదేరుతూనే ఉన్నారు. సొంతూరు వెళ్లే క్రమంలో సోమవారం సికింద్రాబాద్ రైల్వేస్టే‘న్ సమీపంలోని ఓ చెట్టు కింద ఇలా సేద తీరుతూ కనిపించారు.
3/8
కరోనా, లాక్‌డౌన్ దెబ్బకు కుప్పకూలని రంగం, వృత్తులు లేవు. 20– 30 ఏళ్లుగా తాళాలు బాగుచేసే వృత్తిలో ఉన్న వారు లాక్‌డౌన్‌తో తమ బతుకులకు ‘తాళం’ పడిందని వాపోతున్నారు. నల్లగొండ పట్ణణంలో తాళాలు, గొడుగులు రిపేరు చేయడాన్నే వృత్తిగా మలుచుకుని పలువురు ఉపాధి పొందుతున్నారు. వారిలో నాగులు ఒకడు. ఇరవై ఏళ్లుగా ఈ వృత్తిలో ఉన్న తనకిప్పుడు వేరే పని చేతకాదని, బతుకు భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. లాక్‌డౌన్ సడలింపు సమయాన్ని పెంచినా.. దుకాణం నడవలేదని, సోమవారం వంద రూపాయలు కూడా కళ్లచూడలేదని గోడు వెళ్లబోసుకున్నాడు. – సాక్షి ఫొటో జర్నలిస్ట్, నల్లగొండ
4/8
ఒకవైపు కరోనా భయం.. మరోవైపు లాక్‌డౌన్ నిబంధనలు.. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుంటే కానీ పూట గడవని నిరుపేదల పరిస్థితి దయనీయంగా మారింది. సోమవారం వరంగల్ రూరల్ జిల్లా పరకాల మార్కెట్లో వ్యాపారులు పాడైపోయిన కూరగాయలను రోడ్డుపై పారబోస్తే.. వాటిలో పనికొచ్చే వాటి కోసం బడుగుజీవులు ఇలా దేవులాడుతూ కనిపించారు. – పరకాల
5/8
ట్రయల్ రన్‌లో భాగంగా సోమవారం ముంబైలోని ఆకుర్లీ మెట్రో స్టేషన్లో పరుగులు తీస్తున్న రైలు
6/8
ఉత్తరాఖండ్‌లో కరోనా తీవ్రత నేపథ్యంలో నైనిటాల్ జిల్లా మనార్సా గ్రామంలో సోమవారం పీపీఈ కిట్లు ధరించి పెళ్లి వేడుకకు సిద్ధమైన జంట
7/8
జర్మనీలోని బాన్ నగరం ఫ్రీహెర్ వోమ్ స్టెయిన్ సెకండరీ స్కూల్‌లో విద్యార్థులు తరగతి గదిలోనే సొంతంగా కోవిడ్ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ చేసుకుంటున్న దృశ్యం
8/8
శ్రీలంక రాజధాని కొలంబో తీరం కపుంగొడ వద్ద మే 20వ తేదీ నుంచి ఎంపీ ఎక్స్‌ప్రెస్ అనే నౌక అగ్నికి ఆహుతవుతోంది. ఈ నౌక నుంచి కొట్టుకువచ్చిన పాలిథీన్ రేణువుల మధ్య కదులుతున్న ఓ పీత. నౌక ప్రమాదంతో అక్కడి జలాలు తీవ్రంగా కలుషితమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment