
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ నాలుగు లక్షల మార్కును అధిగమించింది. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు 8,066 మందికి పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 4,03,747కు చేరింది. ప్రతి పది లక్షల జనాభాలో 7,561 మందికి పరీక్షలు నిర్వహించడం ద్వారా అన్ని రాష్ట్రాల కంటే ఏపీ మొదటి స్థానంలో నిలిచింది.
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బుధవారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. కొత్తగా 180 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. మొత్తం కేసుల సంఖ్య 3,971కు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో 94 వలస కూలీలకు చెందినవి కాగా, మరో 7 కేసులు విదేశాల నుంచి వచ్చిన వారివి. మొత్తం కేసుల్లో 573 వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు, 119 విదేశాల నుంచి వచ్చినవారివి. 55 మంది డిశ్చార్జి కావడంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 2,456కు చేరింది. కరోనాతో మరో నలుగురు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 68కు చేరుకుంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,447గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment