సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో (బుధవారం ఉ.9 గంటల నుంచి గురువారం ఉ.9 వరకూ) 47,884 నమూనాలను పరీక్షించగా 4,348 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇలా రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో 40 శాతం కేసులు ఒక్క చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లోనే నమోదయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 932, విశాఖపట్నంలో 823 ఉన్నాయి.
అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 86 కేసులున్నాయి. ఈ ఒక్క రోజులో 261 మంది వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,204 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కేసులతో ఇప్పటివరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,92,227కు చేరింది. వీరిలో 20,63,516 మంది కోలుకున్నారు. ప్రభుత్వం ఇప్పటివరకూ 3,17,56,521 నమూనాలను పరీక్షించింది.
ఏపీలో 4,348 కేసులు
Published Fri, Jan 14 2022 4:57 AM | Last Updated on Fri, Jan 14 2022 4:57 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment