ముంబై: లాక్‌డౌన్ కారణంగా చిక్కుకుపోయిన వలస కార్మికులను ఆదుకుంటూ వారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నాడు నటుడు సోనూ సూద్. కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆదుకుంటానని, భవిష్యత్తులోనూ ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తాని ఆయన హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం రాత్రి.. ఉత్తర ప్రదేశ్‌కు శ్రామిక్ రైలులో వెళ్లనున్న వలస కార్మికులను కలిసేందుకు నటుడు ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. అయితే అతడి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అతడిని స్టేషన్‌లోనికి పంపించకుండా బయటే ఆపివేశారు. దీంతో ముంబై పోలీసుల తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. (బీజేపీ చేతిలో సోనూ ఓ కీలుబొమ్మ )
దీనిపై స్పందించిన ముంబై పోలీసులు నటుడిని అడ్డుకున్నది తాము కాదని, రైల్వే పోలీసులు (ఆర్‌పీఎఫ్ బలగాలు) అని స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. కాగా నటుడి సాయాన్ని ఉటంకిస్తూ అతను బీజేపీకి కొమ్ము కాస్తున్నాడని, కరోనా కాలంలో కొత్త మహాత్ముడు పుట్టుకొచ్చాడంటూ 'సామ్నా' ఎడిటోరియల్ వేదికగా శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆదివారం సోనూసూద్.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, మంత్రి ఆదిత్యా ఠాక్రేతో భేటీ అయి రాజకీయ విమర్శలకు చెక్ పెట్టాడు. (విమర్శలకు చెక్: సీఎంతో భేటీ)
Comments
Please login to add a commentAdd a comment