కరీంనగర్ రైల్వే స్టేషన్‌లో క్వారంటైన్ స్టాంప్ చూపుతున్న తండ్రీ కొడుకులు
నిజామాబాద్ అర్బన్: /జగిత్యాలక్రైం/కరీంనగర్ రూరల్: నిజామాబాద్ జిల్లా కేంద్రానికి శనివారం తొలి శ్రామిక్ రైలు వచ్చింది. ముంబై నుంచి మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో వచ్చిన ఈ ప్రత్యేక రైలులో 214 మంది ప్రయాణికులు దిగారు. ఇందులో నిజామాబాద్ జిల్లాకు చెందిన వారు 162 మంది, కామారెడ్డి జిల్లాకు చెందిన వారు 23 మంది ఉన్నారు. అలాగే.. జగిత్యాల రైల్వేస్టేషన్‌లో 842 మంది, కరీంనగర్ స్టేషన్‌లో 44 మంది దిగారు. వలస కార్మికులు ప్లాట్‌ఫాంపై చేరుకోగానే పోలీసు భద్రత మధ్య ఆయా మండలాల వారీగా వైద్య ఆరోగ్య శాఖ పేరు, అడ్రస్, సెల్‌నంబర్లు సేకరించి, జూన్ 15 వరకు హోం క్వారంటైన్‌లో ఉండేలా చేతులపై స్టాంపులు వేశారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సుల్లో వలస కూలీలను వారి స్వగ్రామాలకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment