ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలకు సాయం చేస్తున్న బాలీవుడ్ నటుడు సోనూసూద్‌కు వేలల్లో విన్నపాలు పోటెతుతున్నాయి. అందులో కొన్ని స్వస్థలాలకు చేరవేయాలని వస్తుండగా మరి కొంతమంది విచిత్ర కోరికలు కోరుతున్నారు. అలా వింతైన ప్రశ్నలు, అభ్యర్థనలు వచ్చినప్పటికీ ఏమాత్రం విసుక్కోకుండా వారందరికీ ఓపిగ్గా సమాధానమిస్తున్నారు. ఈ క్రమంలో తన గర్ల్‌ఫ్రెండ్‌ను కలవాలని ఇటీవల ఓ వ్యక్తి సోనూసూద్‌ను కోరిన విషయం తెలిసిందే. తాజాగా అలాంటి ఘటనే మరొకటి ఎదురైంది. లాక్‌డౌన్ కాలంలో తన భర్తతో కలిసి ఉండలేకపోతున్నానని, తనను భర్తతో వేరు చేయాలని సుష్రిమా ఆచార్య అనే మహిళ సోనూసూద్‌కు ట్విటర్ ద్వారా అభ్యర్థించింది. (ప్రత్యేక విమానం.. సోనూసూద్‌పై సీఎం ప్రశంసలు)
‘సోనూసూద్.. జనతా కర్ఫ్యూ నుంచి లాక్‌డౌన్-4 వరకు నేను నా భర్తతోనే ఉంటున్నాను. ఇప్పుడు అతన్ని బయటకు పంపించండి. లేదా నన్ను మా అమ్మ వాళ్ల ఇంటికి పంపించగలరా.. ఎందుకంటే ఇకపై నేను అతనితో కలిసి ఉండలేను’ అంటూ ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన సోనూసూద్ మహిళకు అదిరిపోయే సమాధానం ఇచ్చారు. ‘నా దగ్గర ఓ ప్లాన్ ఉంది. మీ ఇద్దరిని గోవా పంపిద్దాం. ఏమంటారు’ అంటూ బదులిచ్చారు. (‘అలా జరిగితే నన్ను క్షమించండి’)
I have a better plan .. let me send both of you to Goa😂 What say? https://t.co/XbYNFWWflK
— sonu sood (@SonuSood) May 31, 2020
కాగా పొట్టకూటి కోసం పట్టణానికి వచ్చి కరోనా కోరల్లో చిక్కుకున్న వందలాది వలస కూలీలను వారి స్వస్థలాలకు చేరవేసేందుకు సోనూసూద్ సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల కేరళలోని ఏర్నాకులంలో చిక్కుకున్న దాదాపు 180 మంది అమ్మాయిల కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి వారిని స్వస్థలానికి చేర్చారు. ఇదిలావుండగా ఇటీవల సోనూసూద్ సాయం పొందిన ఓ వలస మహిళ కృతజ్ఞతా భావంతో తన పిల్లవాడికి సోనూసూద్ అని నామకరణం చేశారు. (ఆ నటుడు వాడిన పాస్‌కు నెటిజన్ల ఫిదా..)
Comments
Please login to add a commentAdd a comment