సాక్షి, హైదరాబాద్: వలస కార్మికులను ఇంకా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఈ నెల 8వ తేదీతో లాక్‌డౌన్‌కు వివిధ రూపాల్లో సడలింపులు (కొన్ని మినహా) అమల్లోకి రాగా,. వారి స్థితిగతులు, ఇబ్బందులు మాత్రం ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. దాదాపు రెండున్నర నెలల క్రితం లాక్‌డౌన్‌ను విధించిన నాటి నుంచి ఉపాధి కరువై దేశవ్యాప్తంగా లక్షలాది మంది తమ సొంత ఊళ్లకు చేరుకునే ప్రయత్నంలో అనేక కష్టనష్టాలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో స్ట్రాండెడ్ వర్కర్స్ యాక్షన్ నెట్‌వర్క్ (స్వాన్) జోనల్ హెల్ప్‌లైన్‌ల ద్వారా వలస కార్మికులకు నిత్యావసర వస్తువులు, అత్యవసర ఖర్చులకు నగదు, రవాణాచార్జీల రూపంలో సాయం అందజేసింది. ఈ సందర్బంగా దేశవ్యాప్తంగా 34 వేల మందిని సంప్రదించడంతో పాటు వారి ఇబ్బందులను గుర్తించి వలసకార్మికుల ఖాతాల్లోకి నేరుగా దాతల ద్వారా రూ.50 లక్షల దాకా ¯నగదును బదిలీ చేయించింది. వీటిపై ఇప్పటివరకు రెండు నివేదికలను విడుదలచేసిన ఆ సంస్థ , తాజాగా ‘టు లీవ్ ఆర్ నాట్ టు లీవ్ (సొంతూళ్లకు తిరిగి వెళ్లాలా వద్దా)’శీర్షికతో మూడో నివేదికను వలస కార్మికుల రవాణా, సంబంధిత అంశాలపై వెల్లడించింది.
నివేదికలోని ముఖ్యాంశాలు
►మే15 నుంచి జూన్ 1 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా దాదాపు 6 వేల మంది వలసకార్మికుల నుంచి ఆపత్కాలంలో వచ్చిన ఫోన్లు, ఇతరత్రా రూపాల్లో సమాచారం ద్వారా ఇప్పటికీ 80% మందికి ప్రభుత్వ రేషన్ అందడం లేదు, 63 శాతం మంది వద్ద రూ.వంద కంటే తక్కువ నగదు మాత్రమే అందుబాటులో ఉంది.
►లాక్‌డౌన్ ప్రకటించిన నాటి నుంచి 67% మంది (2 వేల మందిలో) ఇంకా ఏ ప్రాంతంలో ఉన్నారో అక్కడే చిక్కుకుపడిపోయారు. 33% మంది సొంత ప్రాంతాలకు వెల్లగలిగారు.
►వలసకు వెళ్లిన ప్రాంతాల్లోనే 75% మంది (1200 మందిలో) ఇంకా చిక్కుకుపోయారు. ఇప్పటికీ ఇంకా వారికి ఎలాంటి ఉపాధి లభించలేదు.
►బస్సులపై 44% మంది, ప్రత్యేక శ్రామిక్ రైళ్లపై 39% మంది లారీల్లో, ఇతర సదుపాయాల ద్వారా 11 శాతం మంది, కాలినడకన 6 శాతం మంది సొంతూళ్లకు చేరుకున్నారు.
►వీరిలో 85% మంది రవాణా ఖర్చులను చెల్లించారు. మూడింట రెండు వంతులు రూ.వెయ్యికంటే ఎక్కువగా చార్జీల రూపంలో చెల్లించారు.
► లాక్‌డౌన్ కాలంలో 1600 మందిలో 80 % మంది అప్పులు చేశారు. వారిలో 15% మంది రూ. 8 వేల కంటే ఎక్కువ మొత్తంలో రుణంగా తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment