Swan
-
వందేళ్ల నాటి కారు..హంసలా ఎంత వయ్యారంగా ఉందో తెలుసా!
అసలు పాటలో ‘హైలో హైలెస్సా! హంస కదా నా పడవ!’ అని ఉంది కదా, మరి శీర్షికలోనే ఈ ‘కారు’కూత ఏమిటను కుంటున్నారా? కాస్త ఈ ఫొటోలను చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ కారు అచ్చం హంసలా ఎంత వయ్యారంగా ఉందో చూస్తున్నారు కదా! ఇదేమీ సరికొత్త మోడల్ కాదు. వందేళ్ల కంటే మునుపటిది. బ్రిటిష్ హయాం రోజుల్లో 1900 ప్రాంతంలో కలకత్తాలో రాబర్ట్ నికోల్ స్కాటీ మాథ్యూసన్ అనే సంపన్న స్కాటిష్ దొరగారు ఉండేవారు. ఆయనగారి ఇల్లు కలకత్తా జూ పక్కనే ఉన్న స్వాన్ పార్కుకు చేరువలో ఉండేది. స్వాన్ పార్కులో తిరుగాడే హంసలను రోజూ గమనిస్తూ ఉండే మాథ్యూసన్ దొరగారికి తన కారును అచ్చం హంసలాగానే తయారు చేయించుకోవాలనే కోరిక పుట్టింది. మనసులో కోరిక పుట్టినదే తడవుగా ఇంగ్లండ్‌లోని కార్ల తయారీ సంస్థ జేడబ్ల్యూ బ్రూక్ అండ్ కంపెనీ వారికి 1909లో ఆర్డర్ చేసి, తన కోసం ఇలా ప్రత్యేకంగా హంసలాంటి కారును తయారు చేయించుకున్నాడు. ఈ కారు 1910లో కలకత్తా చేరుకుంది. అప్పట్లో ఈ కారులో మాథ్యూసన్ దొరగారు కలకత్తా వీథుల్లో విహరిస్తూ ఉంటే జనాలు కళ్లప్పగించి వింతగా చూస్తుండేవారు. ఈ కారుకు కొన్ని విచిత్రమైన ప్రత్యేకతలు కూడా ఉండేవి. ఇందులో హారన్‌కు బదులుగా ఎనిమిది పైపులతో కూడి పైప్ఆర్గాన్ కీబోర్డు ఉండేది. ఒక్కో కీ నొక్కితే ఒక్కో వింత ధ్వని వచ్చేది. కారు అడుగుభాగంలో ప్రత్యేకమైన డక్ట్ రోడ్డు మీద సున్నం వెదజల్లేది. ఇది అచ్చం హంస రెట్టలా కనిపించేది. ఇంజిన్ వేడెక్కినప్పుడు హంస మూతి నుంచి వేడినీళ్లు పిచికారీలా బయటకు వచ్చేవి. అప్పట్లో మాథ్యూసన్ ఈ కారు తయారీ కోసం దాదాపు 15 వేల పౌండ్లు ఖర్చు చేశాడు. మాథ్యూసన్ దీనిని ఎక్కువకాలం వాడకుండానే అమ్మేయాల్సి వచ్చింది. అతడి వద్ద నుంచి ఈ కారును పటియాలా పొరుగు సంస్థానమైన నభా సంస్థానం మహారాజు రిపుదమన్ సింగ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కారు నెదర్లండ్స్‌లోని లోమన్ మ్యూజియమ్‌లో ఉంది. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుటుంబం! ఏకంగా 700 కార్లు, నాలుగు వేల కోట్లు..) -
Viral Video: చేపల ఆకలి తీర్చిన హంస.. ఎలానో తెలుసా ..!
-
తీవ్ర ఆహార సంక్షోభం.. ‘నల్లహంస మాంసం ఎంతో రుచి’
సియోల్: నియంత కిమ్ జాంగ్ ఉన్ పాలనలో ఉన్న ఉత్తర కొరియా ప్రస్తతం తీవ్ర ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం కిమ్.. ఆహార సంక్షోభం కారణంగా కొన్నేళ్లపాటు తక్కువ తినాల్సిందిగా జనాలను కోరాడు. ఇక ఈ సమస్య నుంచి బయటపడటం కోసం కిమ్ ఓ అసాధారణ పరిష్కారాన్ని కనుగొన్నాడు. అదేంటంటే.. ఆకలితో అలమటిస్తున్న తన దేశ ప్రజలను నల్ల హంసలు తినాల్సిందిగా సూచిస్తున్నాడు. దీని గురించి విపరీతమైన ప్రచారం కూడా మొదలుపెట్టాడు. ఇవి ఎంతో రుచిగా ఉండటమే కాక.. ప్రొటీన్ రిచ్ ఆహారమని ప్రకటించాడు. నల్ల హంసల సంఖ్యను పెంచడం కోసం భారీ ఎత్తున ప్రయత్నాలు ప్రారంభించాడు. (చదవండి: నార్త్ కొరియా దీనస్థితి.. కిమ్ సంచలన వ్యాఖ్యలు) ఇప్పటికే దేశం తూర్పు తీరంలోని క్వాంగ్‌ఫో డక్ ఫామ్‌లో, ఉత్తర కొరియా ప్రావిన్స్‌లోని సౌత్ హమ్‌గ్‌యాంగ్‌లో పాలక పార్టీ వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా ఉన్నత కార్యదర్శి రి జోంగ్ నామ్ నల్ల హంసల పెంపకం కోసం ఒక కేంద్రాన్ని స్థాపించారు. ఈ కార్యక్రమం ఉత్తర కొరియా జాతీయ మీడియాలో ప్రసారం అయ్యింది. అంతేకాక జనాలను నల్ల హంసలు తినేలా ప్రోత్సాహించేందుకు అనేక కార్యక్రమాలు రూపొందించారు. నల్ల హంస మాంసం రుచిగా ఉండటమే కాక.. ఎన్నో ఔషధాలు కలిగి ఉంటుందని.. ప్రజల జీవితాలను మెరుగుపరుస్తుందని జాతీయా మీడియాలో ప్రకటనలు హోరెత్తిస్తున్నారు. (చదవండి: వామ్మో.. కిలో అరటిపండ్లు రూ.3400) కరోనా మొదలైనప్పుడు విధించిన ఆంక్షలను ఉత్తర కొరియా ఇంకా అమలు చేస్తోంది. సరిహద్దులను మూసి వేసింది. ప్యాంగ్యాంగ్ పట్టాణాన్ని 2025 వరకు తిరిగి తెరిచే ప్రసక్తి లేదని ప్రకటించింది. సరిహద్దుల మూసివేత, కఠిన నియమాల కారణంగా ఈ ఆహార సంక్షోభం తలెత్తింది. ఇప్పటికే 25 మిలయన్ల దేశవాసులు ఆకలితో అల్లాడుతున్నారని అంతర్జాతీయ మీడియా వెల్లడించిది. ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ నివేదిక ప్రకారం ఉత్తర కొరియా ఈ ఏడాది 8,60,000 టన్నుల ఆహార కొరతను ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. చదవండి: ప్లీజ్.. 2025 వరకు తక్కువ తినండి: కిమ్ జాంగ్ ఉన్ -
Spectacular Video: హంసనావ
నిశ్చలంగా ఉన్న కొలను, అందులో చంద్రుడి ప్రతిబింబం, చుట్టూ పొగమంచు.. తెరలు తెరలుగా కమ్ముకు వస్తున్న చీకటి. ఆ చీకటిని చీల్చుకుంటూ వస్తున్న తెల్లని హంస... వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ తీసిన ఈ వీడియోకి ఫిదా అవుతున్నారు నెటిజన్లు. 🦢 This is a spectacular shot. Wait for it. #wildlife #NaturePhotography #wildlifephotography via/follow @buitengebieden_ pic.twitter.com/1p04vTaWS4 — Alexander Verbeek 🌍 (@Alex_Verbeek) May 30, 2021 -
మాస్క్ ఎలా పెట్టుకోవాలో నేర్పించింది
-
మాస్క్ ఎలా పెట్టుకోవాలో నేర్పించింది
పార్క్‌కు వెళ్లిన యువతికి ఒక హంస మాస్క్‌ను ఎలా పెట్టుకోవాలో నేర్పించింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోవిడ్ పరిస్థితులలో బయటకు వెళ్లే ప్రతి ఒక్కరు మాస్క్ ధరించడం తప్పనిసరి. కరోనాను అరికట్టడానికి అదొక్కటే మార్గం అని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్ధ ప్రకటించింది. దీంతో అన్ని దేశాలలో ప్రజలందరూ మాస్క్‌లు ధరించే బయటకు వెళుతున్నారు. పార్క్‌కు వచ్చిన ఒక యువతి మాస్క్‌ను ముక్కుకు సరిగా పెట్టుకోలేదు. అలాగే కింద కూర్చొని హంసతో ఫోటో దిగాలనుకుంది. అయితే సరిగ్గా పెట్టుకోవాలి అన్నట్లుగా ఆ హంస మాస్క్‌ను లాగి ముక్కుపై వేసింది. దీంతో అందరిని మాస్క్‌లతో చూసిన హంస మాస్క్‌లు సరిగా పెట్టుకోవాలని యువతికి నేర్పించింది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటి వరకు 25.6 మిలియన్ల మంది వీక్షించారు. మీరు మాస్క్ ధరిస్తే మంచిగా ధరించండి అని ఆ హంస నేర్పించిందంటూ ఆ యువతి ఆ వీడియోను పోస్ట్ చేసింది. మాస్క్‌ను నోరు, ముక్కు అన్ని కప్పుకునేలా ధరించాలని జూన్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన సంగతి తెలిసిందే. చదవండి: కప్ప మిణుగురును మింగితే: వైరల్ వీడియో -
ఉపాధికి దూరం.. వలస భారం
సాక్షి, హైదరాబాద్: వలస కార్మికులను ఇంకా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఈ నెల 8వ తేదీతో లాక్‌డౌన్‌కు వివిధ రూపాల్లో సడలింపులు (కొన్ని మినహా) అమల్లోకి రాగా,. వారి స్థితిగతులు, ఇబ్బందులు మాత్రం ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. దాదాపు రెండున్నర నెలల క్రితం లాక్‌డౌన్‌ను విధించిన నాటి నుంచి ఉపాధి కరువై దేశవ్యాప్తంగా లక్షలాది మంది తమ సొంత ఊళ్లకు చేరుకునే ప్రయత్నంలో అనేక కష్టనష్టాలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో స్ట్రాండెడ్ వర్కర్స్ యాక్షన్ నెట్వర్క్ (స్వాన్) జోనల్ హెల్ప్లైన్ల ద్వారా వలస కార్మికులకు నిత్యావసర వస్తువులు, అత్యవసర ఖర్చులకు నగదు, రవాణాచార్జీల రూపంలో సాయం అందజేసింది. ఈ సందర్బంగా దేశవ్యాప్తంగా 34 వేల మందిని సంప్రదించడంతో పాటు వారి ఇబ్బందులను గుర్తించి వలసకార్మికుల ఖాతాల్లోకి నేరుగా దాతల ద్వారా రూ.50 లక్షల దాకా ¯నగదును బదిలీ చేయించింది. వీటిపై ఇప్పటివరకు రెండు నివేదికలను విడుదలచేసిన ఆ సంస్థ , తాజాగా ‘టు లీవ్ ఆర్ నాట్ టు లీవ్ (సొంతూళ్లకు తిరిగి వెళ్లాలా వద్దా)’శీర్షికతో మూడో నివేదికను వలస కార్మికుల రవాణా, సంబంధిత అంశాలపై వెల్లడించింది. నివేదికలోని ముఖ్యాంశాలు ►మే15 నుంచి జూన్ 1 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా దాదాపు 6 వేల మంది వలసకార్మికుల నుంచి ఆపత్కాలంలో వచ్చిన ఫోన్లు, ఇతరత్రా రూపాల్లో సమాచారం ద్వారా ఇప్పటికీ 80% మందికి ప్రభుత్వ రేషన్ అందడం లేదు, 63 శాతం మంది వద్ద రూ.వంద కంటే తక్కువ నగదు మాత్రమే అందుబాటులో ఉంది. ►లాక్డౌన్ ప్రకటించిన నాటి నుంచి 67% మంది (2 వేల మందిలో) ఇంకా ఏ ప్రాంతంలో ఉన్నారో అక్కడే చిక్కుకుపడిపోయారు. 33% మంది సొంత ప్రాంతాలకు వెల్లగలిగారు. ►వలసకు వెళ్లిన ప్రాంతాల్లోనే 75% మంది (1200 మందిలో) ఇంకా చిక్కుకుపోయారు. ఇప్పటికీ ఇంకా వారికి ఎలాంటి ఉపాధి లభించలేదు. ►బస్సులపై 44% మంది, ప్రత్యేక శ్రామిక్ రైళ్లపై 39% మంది లారీల్లో, ఇతర సదుపాయాల ద్వారా 11 శాతం మంది, కాలినడకన 6 శాతం మంది సొంతూళ్లకు చేరుకున్నారు. ►వీరిలో 85% మంది రవాణా ఖర్చులను చెల్లించారు. మూడింట రెండు వంతులు రూ.వెయ్యికంటే ఎక్కువగా చార్జీల రూపంలో చెల్లించారు. ► లాక్డౌన్ కాలంలో 1600 మందిలో 80 % మంది అప్పులు చేశారు. వారిలో 15% మంది రూ. 8 వేల కంటే ఎక్కువ మొత్తంలో రుణంగా తీసుకున్నారు. -
పక్షులను చూసి నేర్చుకోండి : యువీ
భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ సోషల్ మీడియాలో పలు అసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తు ఉంటారు. తాజాగా ఆయన పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పు ప్రాముఖ్యతను తెలియజేసే ఓ వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఒక హంస సముద్రపు ఒడ్డున ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను తన నోటితో తీస్తూ ఒక చోట వేస్తుంది. ‘పక్షలు కూడా ప్లాస్టిక్ వ్యర్థాలతో బాధపడటం చూడటం హృదయ విదారకం. సముద్రాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు కలిపి కలుషితం చేయడం ఆపేయాలి. ఇప్పుడు వాతావరణ మార్పుపై అవహన చాలా అవసరం. భూగ్రహన్ని ప్లాస్టిక్ కాలష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించాడినికి కొత్త మార్గాలు వెతకాల్సిన సమయం వచ్చింది. అమాయకమైన పక్షులను చూసి పర్యావరణాన్ని కాలుష్యం కోరల నుంచి కాపాడుకునే విషయాలు చాలా నేర్చుకోవచ్చు. మనం ప్లాస్టిక్ కాలుష్యానికి కారణం కాకుండా.. నిర్మూలనకు ముందుకు రావాలని’ యువీ పేర్కొన్నారు. తాజాగా యువీ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదే వీడియో పలుసార్లు సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టినా.. ప్రస్తుతం యువీ పోస్ట్ చేయడంతో దాని ప్రాముఖ్యత పెరిగింది. దీనిపై ‘ప్లాస్టిక్ కాలుష్యం బాధాకరం’అంటూ ఒకరు, ‘వాతావరణంలో జరిగే ప్లాస్టిక్ కాలుష్యాన్ని మానవులు పటించుకోరు. కానీ పక్షులు మాత్రం కాలుష్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటున్నాయని’ మరొకరు, ‘అందమైన భూమిని ప్లాస్టిక్ భూతం నుంచి కాపాడుకుందాం’ అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. Heartbreaking to see them suffer this way. Plastic is choking our planet, we need to find ways to eliminate it. Let’s learn from these innocent birds and be a part of the Solution not part of the pollution. #StopOceanPlasticPollution #ClimateChangeIsReal pic.twitter.com/RMDjqQPL6t — yuvraj singh (@YUVSTRONG12) October 12, 2019 -
అరటి పువ్వులా ఉండ కూడదు!
దేవదత్తుడు ఒక యువరాజు. చిన్ననాటినుంచి బుద్ధుని పట్ల దేవదత్తుడు శత్రుభావంతో ఉండేవాడు. చిన్నప్పుడు బాణాలతో దేవదత్తుడు హంసను కొడితే, దాన్ని బుద్ధుడు సంరక్షించి, ప్రాణం కాపాడాడు. ఆ హంస నాదంటే నాదని దేవదత్తుడు సిద్ధార్థునితో వాగ్వివాదానికి దిగాడు. ‘ప్రాణం తీసిన వానిది కాదు. ప్రాణం పోసిన వానిదే హంస’ అని, ఆ హంసను తీసుకుని, గాయాలు మానేలా చేసి, తిరిగి ఆకాశంలోనికి వదిలి పెట్టాడు సిద్ధార్థుడు. వారు పెరిగి పెద్దవారయ్యాక, బుద్ధుడు బౌద్ధసంఘాన్ని స్థాపించి విశేష గౌరవ సత్కారాలు పొందడం చూసి తానూ బౌద్ధసంఘంలో చేరాడు దేవదత్తుడు. కొన్నాళ్లకి బౌద్ధసంఘంలో తనకే అగ్రస్థానం లభించాలని, తానో నాయకుణ్ణి కావాలని పట్టుబట్టాడు దేవదత్తుడు. సంఘం అంగీకరించక పోవడంతో మగధ యువరాజు అజాత శతృపంచన చేరి ‘నీవు నీ తండ్రిని చంపి రాజువుకా. నేను బుద్ధుణ్ణి చంపి బౌద్ధసంఘం నాయకుణ్ణవుతాను’ అని నూరిపోస్తాడు. అజాతశతృ దేవదత్తుని మాటలు నమ్మి, అతణ్ణి ఆదరిస్తాడు. ఈ విషయం శిష్యులు బుద్ధునితో చెబుతారు. అప్పుడు బుద్ధుడు –‘భిక్షువులారా! దుష్టునికి దక్కే గౌరవ సత్కారాలు అరటిచెట్టు పువ్వు లాంటివి. వెదురుచెట్టు పుష్పం లాంటివి. ఎండ్రకాయ గర్భం లాంటివి. ఒక్కపువ్వుతోనే అరటిచెట్టు అంతరిస్తోంది. తన నాశనాన్ని తాను తెచ్చుకుంటుంది. పీతకి గర్భమే దాని చావుని ప్రసాదిస్తుంది’ అని చెప్పాడు. ‘‘నిజమే, మామిడిచెట్టు పుష్పించి, ఫలాలనిస్తుంది కానీ అంతరించదు. మరలా చిగురించి, మరలా ఫలాలను ఇస్తూనే ఉంటుంది. అది ఎప్పుడూ గౌరవ సత్కారాలు పొందుతూనే ఉంటుంది. కానీ అరటిచెట్టు పుష్పించి, గెలవేసి అంతరిస్తుంది. ఒక్కకాపుతోనే దాన్ని నరికేస్తారు. దుశ్శలుడు పొందే గౌరవ సత్కారాలు ఇలాటివే కదా!’’ అనుకున్నారు అతిథులు. బుద్ధుడు చెప్పినట్టే, ఆ తర్వాత అజాత శతృవుకి దూరమై, ఒంటరిగా మిగిలి దైన్యంగా ప్రాణాలు పోగొట్టుకున్నాడు దేవదత్తుడు. – డా. బొర్రా గోవర్ధన్ -
రిజిస్ట్రేషన్ల శాఖలో ‘కొత్త’ నెట్వర్క్
అంతర్జాతీయ సాంకేతిక పరిజ్ఞానం కోసం ఏటా కోటిన్నర ఖర్చు సాక్షి, హైదరాబాద్: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కొత్త హంగులను సమకూర్చుకుంటోంది. రిజిస్ట్రేషన్ లావాదేవీల్లో తరచూ ఏర్పడుతున్న సాంకేతిక సమస్యలను అధిగమించడం కోసం తన పోర్టల్‌ను స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్ (స్వాన్) నుంచి మల్టీప్రోటోకాల్ లేబుల్ స్విచ్చింగ్ (ఎంపీఎల్ఎస్)లోకి మార్చుకుం టోంది. రెయిల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఈ ఎంపీఎల్ఎస్ సేవలను వినియోగించుకునేందుకు అనుమతినిస్తూ ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.ఆర్.మీనా ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకోసం వన్‌టైమ్ చార్జీల కింద రూ.35.25 లక్షలు, ఏటా సర్వీసు చార్జీల కింద 1.58 కోట్లు ఖర్చు చేసుకునే వెసులుబాటు ఈ ఉత్తర్వుల్లో కల్పించారు. వాస్తవానికి, ప్రస్తుతమున్న నెట్వర్క్ ద్వారా రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాలయాల్లో ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, కర్ణాటకల్లో విజయవంతంగా అమలవుతున్న ఎంపీఎల్ఎస్ వీపీఎన్ నెట్వర్క్ వైపు మొగ్గుచూపామని ఆ శాఖ డీఐజీ ఎం. శ్రీనివాసులు వెల్లడించారు. -
హంసలు అద్భుతంగా పాడతాయా?
మగ హంసను కాబ్ అంటారు. ఆడ హంసను పెన్ అంటారు. హంస పిల్లను సిగ్నెట్ అంటారు! ఒక్కో హంస ఒంటి మీదా దాదాపు పాతికవేల ఈకల వరకూ ఉంటాయి! ఇవి నేల మీద, నీటిలోనూ కూడా జీవించగలవు. అయితే నేలమీద ఉండటానికే ఎక్కువ ఇష్టపడతాయి. ప్రధాన ఆహారం నీటి అడుగున ఉండే మొక్కలు, కాడలు, దుంపలు కాబట్టి... ఆహారం కోసం మాత్రం నీటిలోకి వెళతాయి. లేదంటే సరదాగా ఈత కొట్టడాని వెళతాయి! హంసలు ఒక్కసారి ఒకదానితో జతకడితే, ఇక దానితోనే ఉంటాయి. దురదృష్టవశాత్తూ తన జోడీ మరణిస్తే... జీవితాంతం అలానే ఉండిపోతాయి తప్ప మరోదానికి దగ్గర కావు. కొన్నయితే బెంగపెట్టుకుని చనిపోతాయి కూడా. అయితే ఏవైనా తేడాలొచ్చినప్పుడు మాత్రం శాశ్వతంగా తెగతెంపులు చేసుకుంటాయి. సాధారణంగా గూడు కట్టుకునేటప్పుడు పని విషయంలో వీటికి గొడవ వస్తుంది. కొట్టుకునే వరకూ వెళ్లిపోతాయి. అలాంటప్పుడు మాత్రం విడిపోతాయి. అయితే అప్పుడు కూడా ఒంటరిగానే ఉండిపోతాయి తప్ప మరోదాన్ని దగ్గరకు రానివ్వవు! ఇవి ఒక్కగూటిలో కుదురుగా ఉండవు. అస్తమానం పాత గూళ్లను వదిలి కొత్తవాటిని కడుతూనే ఉంటాయి. పోనీ అందులో ఉంటాయా అంటే అదీ ఉండదు. కేవలం పడుకోవడానికి మాత్రమే గూటిని ఉపయోగిస్తుంటాయి. మిగతా సమయాల్లో ఆ గూళ్లను మిగతా పక్షులు వాడేసుకుంటూ ఉంటాయి! తమ గుడ్లు, పిల్లలను కాపాడుకోవడం కోసం ఇవి ఎంతకైనా తెగిస్తాయి. కుక్కలు, పిల్లులు వంటి జంతువులు గుడ్లను కానీ, పిల్లలను గానీ ఎత్తుకుపోవడానికి వచ్చాయో... పొడిచి పొడిచి తరిమి కొడతాయి. ఎంత తీవ్రంగా గాయపరుస్తాయంటే, ఒక్కోసారి అవతలి జంతువు ప్రాణాలు కూడా కోల్పోతుంది! హంసలు అద్భుతంగా పాడతాయి. అయితే మామూలప్పుడు ఎలా ఉన్నా... చనిపోయే ముందు ఇవి తప్పకుండా పాడతాయని పరిశోధనల్లో తేలింది. ఈ చివరి పాటను ‘శ్వాన్ సాంగ్’ అని పిలుస్తుంటారు జీవ శాస్త్రజ్ఞులు!. వీటికి కోపం కాస్త ఎక్కువే. బాగా విసుగు వచ్చినా, కోపం వచ్చినా రెక్కల్ని టపటపా కొడతాయి. అర్థం చేసుకుని తప్పుకుంటే సరే, లేకపోతే వాటికి కోపం తెప్పించినవారి మీద దాడికి దిగుతాయి!