పార్క్‌కు వెళ్లిన యువతికి ఒక హంస మాస్క్‌ను ఎలా పెట్టుకోవాలో నేర్పించింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోవిడ్ పరిస్థితులలో బయటకు వెళ్లే ప్రతి ఒక్కరు మాస్క్ ధరించడం తప్పనిసరి. కరోనాను అరికట్టడానికి అదొక్కటే మార్గం అని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్ధ ప్రకటించింది. దీంతో అన్ని దేశాలలో ప్రజలందరూ మాస్క్‌లు ధరించే బయటకు వెళుతున్నారు.
పార్క్‌కు వచ్చిన ఒక యువతి మాస్క్‌ను ముక్కుకు సరిగా పెట్టుకోలేదు. అలాగే కింద కూర్చొని హంసతో ఫోటో దిగాలనుకుంది. అయితే సరిగ్గా పెట్టుకోవాలి అన్నట్లుగా ఆ హంస మాస్క్‌ను లాగి ముక్కుపై వేసింది. దీంతో అందరిని మాస్క్‌లతో చూసిన హంస మాస్క్‌లు సరిగా పెట్టుకోవాలని యువతికి నేర్పించింది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటి వరకు 25.6 మిలియన్ల మంది వీక్షించారు. మీరు మాస్క్ ధరిస్తే మంచిగా ధరించండి అని ఆ హంస నేర్పించిందంటూ ఆ యువతి ఆ వీడియోను పోస్ట్ చేసింది. మాస్క్‌ను నోరు, ముక్కు అన్ని కప్పుకునేలా ధరించాలని జూన్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment