
మిస్ ‘గోల్’..!
మైదానంలో గోల్స్ వర్షంతో బ్రెజిల్‌లో ప్రపంచకప్ హాట్‌హాట్‌గా సాగుతోంది. నిర్వాహకులూ సంతోషంగా ఉన్నారు. కానీ ఈ ప్రపంచకప్‌తో తమ జీవితాలు మారిపోతాయని ఆశించిన అక్కడి సెక్స్ వర్కర్లకు మాత్రం నిరాశే మిగిలింది.
ఫోర్టలెజా: మైదానంలో గోల్స్ వర్షంతో బ్రెజిల్‌లో ప్రపంచకప్ హాట్‌హాట్‌గా సాగుతోంది. నిర్వాహకులూ సంతోషంగా ఉన్నారు. కానీ ఈ ప్రపంచకప్‌తో తమ జీవితాలు మారిపోతాయని ఆశించిన అక్కడి సెక్స్ వర్కర్లకు మాత్రం నిరాశే మిగిలింది. ఎక్కడ చూసినా విదేశీ పర్యాటకుల సందడి కనిపిస్తున్నా... వాళ్లు శృంగారం గురించి పెద్దగా ఆసక్తి చూపడం లేదట. విదేశీయుల కోసం ఇంగ్లిష్ కూడా నేర్చుకున్నా... తమ ‘గోల్’ నెరవేరలేదని వాపోతున్నారు.
అయితే సెక్స్ వర్కర్లు బాగా ఎక్కువగా డిమాండ్ చేయడం వల్లే ఇలా జరుగుతోందట. 100 నుంచి 500 డాలర్లు ఖర్చు పెట్టేకంటే... హాయిగా మందుకొట్టి పడుకుంటే మేలని ఫుట్‌బాల్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే కండోమ్స్ వ్యాపారం మాత్రం జోరుగానే సాగుతోంది. అదేంటి అంటే... విదేశాల నుంచి ఈసారి జంటలు ఎక్కువగా వచ్చాయట.