సాకర్ అంటే అర్జెంటీనా ఫ్యాన్స్‌కు చచ్చేంత అభిమానం. ఎక్కడ మ్యాచ్ జరిగినా అక్కడ వాలిపోతారు. ఈసారి ప్రపంచకప్ సందర్భంగా నలుగురు అర్జెంటీనా అభిమానులు కాస్త వెరైటీగా ఒక బస్సు అద్దెకు తీసుకుని జట్టు వెంట తిరిగారు.
సావోపాలో: సాకర్ అంటే అర్జెంటీనా ఫ్యాన్స్‌కు చచ్చేంత అభిమానం. ఎక్కడ మ్యాచ్ జరిగినా అక్కడ వాలిపోతారు. ఈసారి ప్రపంచకప్ సందర్భంగా నలుగురు అర్జెంటీనా అభిమానులు కాస్త వెరైటీగా ఒక బస్సు అద్దెకు తీసుకుని జట్టు వెంట తిరిగారు. గతనెల 9న బ్రెజిల్‌కు చేరుకున్న తర్వాత రూ. 9 లక్షలు చెల్లించి బస్సును అద్దెకు తీసుకున్నారు. ఇందులో నాలుగు బెడ్‌లు, తినడానికి డైనింగ్ టేబుల్.. ఇలా తమకు కావాల్సిన విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు.
అర్జెంటీనా ఆడిన మూడు మ్యాచ్‌లను స్టేడియాల్లో వీక్షించారు. మరో మూడు మ్యాచ్‌ల టికెట్లు దొరక్కపోయినా ఏ మాత్రం నిరాశ చెందకుండా స్టేడియాల దగ్గర బిగ్ స్క్రీన్‌లపై అందరితో కలిసి చూశారు. మొత్తానికి ఇప్పటిదాకా 10వేల కిలోమీటర్లకు పైగా బస్సులోనే ప్రయాణించారు.