
స్వారెజ్ ‘ఓపెనర్’
బీజింగ్: ప్రపంచకప్‌లో ఉరుగ్వే స్టార్ ఆటగాడు లూయిస్ స్వారెజ్ ‘కొరుకుడు’ వ్యవహారం ఇప్పుడు ప్రపంచమంతా హాట్ టాపిక్‌గా మారింది.
ఇప్పటికే స్వారెజ్ అరుస్తున్న ఫొటోల ముందు తమ చేతిని పెట్టి కొరికించుకుంటున్నట్టు ఫోజులు పెడుతూ అభిమానులు సరదా పడుతుంటే... తాజాగా చైనీస్ రిటైల్ వెబ్‌సైట్ టావో బావో ‘స్వారెజ్ బైట్’ అనే పేరుతో బాటిల్ ఓపెనర్‌ను అమ్మకానికి పెట్టింది. ఆగ్రహంతో పెద్దగా నోరు తెరిచి అరుస్తున్న స్వారెజ్ కార్టూన్‌ను దీనికోసం ఉపయోగించారు. ఈ ఓపెనర్ ఖరీదు 2.70 డాలర్లు (రూ.161). ఇప్పటికే దీనికి విపరీతమైన డిమాండ్ వచ్చిందని ఆ షాప్ యజమాని వాంగ్ లిన్ సంబరపడుతున్నాడు.