సాకర్ ప్రపంచకప్‌లో టిక్కెట్ల కుంభకోణానికి పాల్పడిన సూత్రధారిని బ్రెజిల్ పోలీసులు అరెస్ట్ చేశారు.
రియో డి జనీరో: సాకర్ ప్రపంచకప్‌లో టిక్కెట్ల కుంభకోణానికి పాల్పడిన సూత్రధారిని బ్రెజిల్ పోలీసులు అరెస్ట్ చేశారు. బ్రిటన్‌కు చెందిన మ్యాచ్ హాస్పిటాలిటీ డెరైక్టర్ రే వెలన్‌ను రియో డి జనీరోలోని కోపాకబానా హోటల్‌లో సోమవారం అదుపులోకి తీసుకున్నారు.
ప్రపంచకప్ మ్యాచ్‌ల టిక్కెట్లను బ్లాక్‌లో విక్రయించి రూ. 650 కోట్ల్లు సంపాదించినట్లు రేపై ఆరోపణలున్నాయి. మరోవైపు రే వెలన్ వీఐపీ టిక్కెట్లను అక్రమంగా అట్లాంటా స్పోర్టిఫ్ అనే కంపెనీకి ఇవ్వగా వాటిని ట్రావెల్ ఏజెన్సీలకు అమ్మి బాగా డబ్బులు సంపాదించారు. దీంతో ఫిఫా.. ఆ కంపెనీ అమ్మిన మ్యాచ్‌ల టిక్కెట్లను రద్దు చేసింది. ఈ వ్యవహారంలో మరో మూడు కంపెనీలు రిలయన్స్ ఇండస్ట్రీస్, జెట్ సెట్ స్పోర్ట్స్, పమోద్జి స్పోర్ట్స్‌లను ఫిఫా హెచ్చరించింది. రిలయన్స్ రూ. 7.2 కోట్లతో 19 మ్యాచ్‌లకు 304 ప్యాకేజీలను దక్కించుకుంది. గతవారం బ్రెజిల్ పోలీసులు రిలయన్స్ పేరుతో ఉన్న 59 టిక్కెట్లను సీజ్ చేశారు. దీంతో రిలయన్స్ ఈ కుంభకోణంపై విచారణ చేపట్టింది.