
సెమీస్‌లో బ్రెజిల్
* కొలంబియాపై 2-1తో గెలుపు
ఫోర్టలెజా: ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఆతిథ్య బ్రెజిల్.. సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. కొలంబియాతో శనివారం తెల్లవారు జామున జరిగిన క్వార్టర్ ఫైనల్లో బ్రెజిల్ 2-1 తేడాతో అద్భుత విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభమైన కొద్ది సేపటికే టియాగో సిల్వ 7వ నిమిషంలో తొలిగోల్ సాధించగా, 69వ నిమిషంలో డేవిడ్ లూయిజ్.. బ్రెజిల్‌కు మరో గోల్ అందించాడు.
అయితే ఆ తరువాత కొలంబియా తీవ్రంగా పోరాడింది. ఈ క్రమంలో 78వ నిమిషంలో కొలంబియాకు లభించిన పెనాల్టీని జేమ్స్ రోడ్రిగ్వెజ్ గోల్‌గా మలిచి బ్రెజిల్ ఆధిక్యాన్ని తగ్గించాడు. కానీ, ఆ తరువాత మరో గోల్ సాధించలేకపోయిన కొలంబియా.. క్వార్టర్ ఫైనల్‌తోనే తమ పోరాటాన్ని ముగించింది.