
ముగిసిన ఆసియా పోరాటం
శుక్రవారం తెల్లవారుజామున గ్రూప్ ‘హెచ్’లోనే జరిగిన మరో మ్యాచ్‌లో బెల్జియం 1-0తో కొరియా రిపబ్లిక్‌ను ఓడించింది. ద్వితీయార్ధంలో పది మందితోనే ఆడిన బెల్జియంను కొరియా ప్రతిఘటించలేక పోయింది.
సావో పాలో: శుక్రవారం తెల్లవారుజామున గ్రూప్ ‘హెచ్’లోనే జరిగిన మరో మ్యాచ్‌లో బెల్జియం 1-0తో కొరియా రిపబ్లిక్‌ను ఓడించింది. ద్వితీయార్ధంలో పది మందితోనే ఆడిన బెల్జియంను కొరియా ప్రతిఘటించలేక పోయింది. వీరి ఓటమితో ఈ ప్రపంచకప్‌లో ఆసియా జట్లు ఒక్క విజయం కూడా లేకుండా వెనుదిరిగినట్టయ్యింది. బెల్జియం గ్రూప్ టాపర్‌గా నిలిచి ప్రిక్వార్టర్స్‌లో అమెరికాతో తలపడనుంది.
మ్యాచ్ 45వ నిమిషంలో కిమ్ షిన్‌విక్ కాలును ఉద్దేశపూర్వకంగా తొక్కినందుకు బెల్జియం మిడ్ ఫీల్డర్ స్టీవెన్ డెఫోర్ రెడ్‌కార్డుకు గురై మైదానం వీడాడు. ద్వితీయార్ధం 59వ నిమిషంలో మెర్టెన్ షాట్‌ను కొరియా గోల్ కీపర్ కిమ్ సూంగ్యు ఎడమ వైపు డైవ్ చేసి బంతిని పట్టుకున్నాడు. 78వ నిమిషంలో బెల్జియం దాడులు ఫలించాయి. మొదట డివోక్ ఒరిగి కొట్టిన షాట్‌ను కీపర్ కిమ్ పట్టుకున్నా అది మిస్ అయి ముందుకు వచ్చింది. దీంతో అక్కడే ఉన్న కెప్టెన్ వెర్టోన్‌గెన్ కీపర్‌ను ఏమార్చుతూ గోల్ సాధించాడు. దీంతో బెల్జియం విజయం ఖాయమైంది.