గోల్కీపర్తో మూత్రం తాగించిన అభిమానులు | opposite fans make goal keeper drink urine | Sakshi
Sakshi News home page

గోల్కీపర్తో మూత్రం తాగించిన అభిమానులు

Published Wed, Sep 17 2014 3:43 PM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM

గోల్కీపర్తో మూత్రం తాగించిన అభిమానులు - Sakshi

గోల్కీపర్తో మూత్రం తాగించిన అభిమానులు

సాకర్ అంటేనే అభిమానులు చెవి కోసుకుంటారు. ప్రత్యర్థి జట్టులో ఆటగాళ్లను నిజంగానే తమ ప్రత్యర్థులుగా భావిస్తుంటారు. వాళ్లను అవమానించడానికి రకరకాలుగా ప్రయత్నిస్తారు. స్విట్జర్లండ్కు చెందిన ఓ ఫుట్బాల్ జట్టు గోల్కీపర్తో అవతలి జట్టు అభిమానులు ఏకంగా మూత్రం తాగించి అతడిని తీవ్రంగా అవమానించి ఆనందించారు. ఎఫ్సీ మురీ జట్టు గోల్కీపర్ రెటో ఫెల్డర్ ఆట మధ్యలో తన బాటిల్ తీసుకుని అందులోని ద్రవం తాగాడు. అయితే.. అందులో వెచ్చగా ఉన్న పదార్థం తాగాక తాను చాలా ఇబ్బందిపడ్డానని అతడు తెలిపాడు.

ఇంతకీ విషయం ఏమిటంటే, అవతలి జట్టు అభిమానులు బాల్ బోయ్ని పిలిచి, గోల్ కీపర్ వద్ద ఉన్న బాటిల్ తీసుకురమ్మని చెప్పి, అందులో మూత్రం పోశారు. ఇలా తనతో మూత్రం తాగించాలన్న ఆలోచన ఏమాత్రం భరించదగ్గది కాదని ఫెల్డర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియో విశ్లేషణ చూసిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోడానికి అతడు సిద్ధపడుతున్నాడు. అతడు తాగగానే 'ఇప్పుడు నీకు ఎయిడ్స్ ఉంది' అంటూ అవతలి అభిమానులు గట్టిగా అరిచారు. దీనిపై బాడెన్ అధ్యక్షుడు థోమీ బ్రామ్ క్షమాపణలు చెప్పారు. దీనిపై విచారణ జరిపిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement