
A-లీగ్ మెన్ సాకర్ లీగ్‌లో అపశృతి చోటుచేసుకుంది. లీగ్‌లో భాగంగా శనివారం మెల్‌బోర్న్ సిటీ, మెల్‌బోర్న్ విక్టరీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ రసాబాసగా మారింది. మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్‌లోకి చొచ్చుకొచ్చిన అభిమానులు మెల్‌బోర్న్ సిటీ గోల్‌కీపర్ టామ్ గ్లోవర్‌పై బకెట్‌తో దాడికి పాల్పడ్డారు. దీంతో టామ్ గ్లోవర్ తల నుంచి రక్తం కారింది. దీంతో నిర్వాహకులు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
మ్యాచ్‌లో 1-0తో మెల్‌బోర్న్ సిటీ ఆధిక్యంలో ఉన్న దశలో ఈ ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ ప్రారంభమైన 20 నిమిషాల వ్యవధిలోనే మెల్‌బోర్న్ సిటీ గోల్ చేయడం ప్రత్యర్థి అభిమానులకు నచ్చలేదు. పైగా గోల్‌కీపర్ టామ్ గ్లోవర్ తొండిగా ఆడుతున్నాడంటూ మొదటి నుంచి అరుస్తూ వచ్చారు. అయితే ఇంతలో గోల్ నమోదు కావడంతో మెల్‌బోర్న్ విక్టర్స్ అభిమానులకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
అంతే ఒక్కసారిగా కొంతమంది అభిమానులు గోల్‌కీపర్ టామ్ గ్లోవర్ వైపు దూసుకొచ్చారు. రిఫరీ వచ్చి వద్దొని వారించినా వినకుండా మెటల్ బకెట్‌తో దాడి చేశారు. దీంతో భయాందోళనకు గురైన టామ్ గ్లోవర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కానీ తలకు గట్టిగా తగలడంతో రక్తం కారసాగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక గోల్‌కీపర్‌పై దాడి చేయడాన్ని ఫుట్‌బాల్ ఆస్ట్రేలియా ఖండించింది. ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరం. ఆట అన్నాకా భావోద్వేగాలు సహజం. అయితే అవి హెచ్చుమీరితే ప్రమాదం. టామ్ గ్లోవర్‌పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు అని పేర్కొంది.
Fair to say the Melbourne Derby has kicked-off.
— Tom Reed (@tomreedwriting) December 17, 2022
Match abandoned. pic.twitter.com/Y3SJ8X2cp4