రియో డి జనీరో: సాకర్ ప్రపంచకప్‌ను అట్టహాసంగా ముగించేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. ఆదివారం రియోలోని మారకానా స్టేడియంలో జర్మనీ-అర్జెంటీనా మధ్య జరిగే ప్రపంచకప్ ఫైనల్‌కు ముందు భారత కాలమానం ప్రకారం రాత్రి గం. 10.50 ని.లకు ముగింపు కార్యక్రమం మొదలవుతుంది. కొలంబియా పాప్ స్టార్ షకీరా ఈ కార్యక్రమంలో బ్రెజిల్ ఆర్టిస్ట్ కార్లినో బ్రౌన్‌తో కలిసి సందడి చేయనుంది. ఫిఫా అధికారిక గీతమైన ‘లా లా లా’తో అభిమానులను అలరించనుంది.
ఫిఫా అధికారికంగా ప్రకటించిన ముగింపు కార్యక్రమంలో కార్లోస్ శాంటనా, వెసైల్ఫ్ జీన్ తమ ప్రదర్శనతో ఆకట్టుకోనున్నారు. బ్రెజిల్ సూపర్ స్టార్ సాంగాలో.. అలెగ్జాండర్ పెరైస్‌తో కలిసి హల్‌చల్ చేయనున్నారు. ఇక ఫైనల్ ఆరంభానికి కొద్ది నిమిషాల ముందు స్పెయిన్ ఫుట్‌బాలర్ కార్లెస్ పుయోల్, బ్రెజిల్ సూపర్ మోడల్ గిసెలీ బుండ్చెన్ ప్రపంచకప్ ట్రోఫీని ఆవిష్కరిస్తారు.
అర్జెంటీనాపై రూ. 2 కోట్ల జరిమానా
నిబంధనలు అతిక్రమించినందుకు అర్జెంటీనా జట్టుపై అంతర్జాతీయ ఫుట్‌బాల్ సంఘం (ఫిఫా) 3 లక్షల స్విస్ ఫ్రాంక్‌లను (దాదాపు రూ. 2 కోట్లు) జరిమానాగా విధించింది. ప్రస్తుత ప్రపంచకప్‌లో ‘ఫిఫా’ నిర్దేశించిన నిబంధనల ప్రకారం.... ప్రతి జట్టు నుంచి మ్యాచ్‌కు ముందు నిర్వహించే మీడియా సమావేశంలో కోచ్‌తోపాటు జట్టులోని ఒక సభ్యుడు తప్పనిసరిగా హాజరుకావాలి. అయితే అర్జెంటీనా ఈ నిబంధనను నాలుగుసార్లు ఉల్లంఘించింది.
ముగింపు ఘనంగా..!
Published Sat, Jul 12 2014 1:28 AM | Last Updated on Mon, Oct 22 2018 5:58 PM
Advertisement