ప్రపంచకప్‌లో కోస్టారికా ఒకేసారి (1990లో) ప్రిక్వార్టర్స్‌కు చేరింది. తొలిసారి క్వార్టర్ ఫైనల్‌కు చేరే అవకాశం ఆ జట్టు ముందుంది.
నెదర్లాండ్స్ xమెక్సికో; రాత్రి గం. 9.30
కోస్టారికా xగ్రీస్; అర్ధరాత్రి గం. 1.30
నేడు గ్రీస్‌తో అమీతుమీ
ప్రపంచకప్‌లో కోస్టారికా ఒకేసారి (1990లో) ప్రిక్వార్టర్స్‌కు చేరింది. తొలిసారి క్వార్టర్ ఫైనల్‌కు చేరే అవకాశం ఆ జట్టు ముందుంది. ఈసారి లీగ్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించి ఓ మ్యాచ్‌ను డ్రా చేసుకుని ఏడు పాయింట్లతో గ్రూప్ టాపర్‌గా నిలిచింది. డౌర్టె, క్యాంప్‌బెల్, ఉరెనా రాణిస్తుండటం కలిసొచ్చే అంశం.
ప్రపంచకప్‌లో ఏనాడూ తొలి రౌండ్ దాటని గ్రీస్ ఈసారి ప్రిక్వార్టర్స్‌కు చేరుకుంది. సమారిస్, సమారస్‌లు ఫర్వాలేదనిపిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన డిఫెండర్‌గా పేరు తెచ్చుకుంటున్న మనోలాస్, మిడ్‌ఫీల్డర్ కోన్‌లు కీలకం కానున్నారు. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు ముఖాముఖిగా తలపడలేదు.