ఫుట్ బాల్ కూ తప్పని బ్లాక్ టికెట్ల బెడద! | FIFA to cooperate with Brazilian authorities to stop black marketing | Sakshi
Sakshi News home page

ఫుట్ బాల్ కూ తప్పని బ్లాక్ టికెట్ల బెడద!

Published Sat, Jul 5 2014 8:18 PM | Last Updated on Mon, Oct 22 2018 5:58 PM

FIFA to cooperate with Brazilian authorities to stop black marketing

రియో డి జనీరో: ఫుట్ బాల్ ప్రపంచకప్ కు కూడా బ్లాక్ టికెట్ల బెడద తప్పడం లేదు. ప్రస్తుతం బ్రెజిల్ లో జరుగుతున్న వరల్డ్ కప్ ను పకడ్భందీగా నిర్వహించేందుకు ఫిఫా ఎన్ని చర్యలు చేపట్టినా బ్లాక్ టికెట్లును మాత్రం యధేచ్చగా ఆ టోర్నీలో విక్రయించడం ఆందోళనకు గురిచేస్తోంది. దీనిపై తగిన సహాయ సహకారాలు బ్రెజిల్ అధికారులకు అందించేందుకు ఫిఫా సిద్ధమైంది.  ఈ మేరకు ఫిఫా మార్కెటింగ్ డైరెక్టర్ థైర్రీ వియల్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఫుట్ బాల్ టికెట్లును అక్రమంగా అమ్ముకుంటూ భారీగా లాభపడుతున్న వారిపై చర్యలు తీసుకునేందుకు స్థానిక అధికారులకు సహకారం అందిస్తామన్నారు.

 

అసలు టికెట్లను బ్లాక్ లో విక్రయిస్తున్నారో అనే దానిపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు ఆయన తెలిపారు. ఈ బ్లాక్ మార్కెట్ వ్యవహారంలో ఆల్జీరియాకు చెందిన నిషేధిత రింగ్ లీడర్ మోహమదూ ఫోఫానాపై వ్యవహారశైలిపై కూడా దృష్టి సారించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement