మహిళా వాలంటీర్‌కు లైంగిక వేధింపులు!
సియోల్: ఆసియూ క్రీడల ఆరంభానికి ముందే ఇంచియూన్‌లో లైంగిక వేధింపుల ఉదంతం వెలుగుచూసింది. ఇరాన్‌కు చెందిన ఓ సాకర్ అధికారి, ఓ మహిళా వాలంటీర్‌ను ప్రక్కనే నిలబడి ఫోటో దిగే సమయంలో ఆమెను తాకాడన్న ఆరోపణలు అలజడి సృష్టించాయి. దీనిపై ఓ కాలేజి విద్యార్థిని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయుడంతో దక్షిణకొరియా పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. అయితే ఇప్పటిదాకా అతన్ని కస్టడీలోకి తీసుకోకపోయినా... దేశం విడిచి వెళ్లొద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసును ప్రాసిక్యూటర్స్‌కు పంపాలా వద్దా అనే దానిపై ఇంకా ఎటువంటి నిర్ణయుం తీసుకోలేదని పోలీస్ ఇన్‌స్పెక్టర్ పార్క్ మిన్ జు చెప్పారు.
ఇదిలా ఉండగా 38 ఏళ్ల ఇరాన్ సాకర్ అధికారి మాత్రం తనకే పాపం తెలియుదంటున్నారు. దక్షిణ కొరియూలో అది చట్టవిరుద్ధమన్న సంగతి తనకు తెలియదని ఆ అధికారి లబోదిబోమంటున్నాడు.