
అన్న చనిపోయిన బాధను దిగమింగి...
సావోపాలో: మరికొద్ది గంటల్లో అర్జెంటీనాతో నాకౌట్ పోరు... స్విట్జర్లాండ్ కోచ్ హిడ్జ్‌ఫెల్డ్ ప్రత్యర్థిని ఎలా కట్టడి చేయాలా అని ఆలోచిస్తున్నారు. అంతలోనే పిడుగులాంటి వార్త... ఆయన అన్న చనిపోయారని సమాచారం. కానీ ఆయన బాధను దిగమింగారు.
జట్టును నడిపించారు. తన విషాదం ఎక్కడా కనిపించకుండా జాగ్రత్తపడి ఆటగాళ్లకు సూచనలు ఇచ్చారు. అర్జెంటీనాపై పోరాడినా స్విట్జర్లాండ్ ఓడిపోయింది. ఓ వైపు అన్న మరణం... మరోవైపు స్విస్ జట్టుతో అదే ఆయన ఆఖరి మ్యాచ్... మ్యాచ్ ముగిశాక జట్టు సభ్యులంతా కలిసి కోచ్‌ను ఓదార్చారు. రెండేళ్ల క్రితం జట్టు కోచ్‌గా హిడ్జ్‌ఫెల్డ్ బాధ్యతలు తీసుకున్నాకే... స్విస్ బలమైన జట్టుగా తయారయింది.