కోస్టారికా చేతిలో ఇటలీ ఓటమితో గ్రూప్ ‘డి’లో సమీకరణాలు మారిపోయాయి. రెండు మ్యాచ్‌ల్లో ఓడిన మాజీ చాంపియన్ ఇంగ్లండ్ గ్రూప్ దశలోనే ఇంటిబాట పట్టాల్సివచ్చింది. తొలిమ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై గెలవడంతో ఈజీగా ప్రిక్వార్టర్స్‌కు చేరుతుందనుకున్న ఇటలీ కూడా పోరాడాల్సిన పరిస్థితి తలెత్తింది. గ్రూప్ నుంచి రెండో జట్టుగా నాకౌట్‌కు అర్హత పొందేందుకు ఇక ఉరుగ్వేతో 24న జరగనున్న చివరి మ్యాచ్ కీలకం. ఉరుగ్వే కన్నా మెరుగైన గోల్స్ సగటు ఉన్నందున ఆ మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా ఇటలీ నాకౌట్‌కు చేరుతుంది. ఉరుగ్వే మాత్రం గెలవాల్సిందే.
గ్రూప్ ‘డి’ పాయింట్ల పట్టిక
జ. ఆ.మ్యా. గె. ఓ. డ్రా. పా.
కోస్టారికా 2 2 0 0 6
ఇటలీ 2 1 1 0 3
ఉరుగ్వే 2 1 1 0 3
ఇంగ్లండ్ 2 0 2 0 0
నోట్: జ:జట్లు; ఆ.మ్యా: ఆడిన మ్యాచ్‌లు; గె: గెలుపు; ఓ: ఓటమి; పా: పాయింట్లు.
ఇంగ్లండ్ ఔట్
Published Sat, Jun 21 2014 1:07 AM | Last Updated on Mon, Oct 22 2018 5:58 PM
Advertisement