సావో పాలోలో అల్లర్లు | Riots in Sao Paulo | Sakshi
Sakshi News home page

సావో పాలోలో అల్లర్లు

Published Sat, Jun 21 2014 1:11 AM | Last Updated on Mon, Oct 22 2018 5:58 PM

Riots in Sao Paulo

సావో పాలో: ప్రపంచకప్ మ్యాచ్‌లను తిలకించేందుకు తమకు ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించాలన్న డిమాండ్‌తో తీసిన ర్యాలీలో అల్లర్లు చోటు చేసుకున్నాయి. ‘ఫ్రీ ఫేర్’ అనే నినాదంతో 13 వందల మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అయితే కొంత మంది ముసుగులు ధరించిన వ్యక్తులు బ్యాంక్‌లు, జర్నలిస్ట్‌లపై దాడికి దిగారు. గురువారం ఇంగ్లండ్, ఉరుగ్వే మ్యాచ్ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రశాంతంగా సాగుతున్న ర్యాలీ...

ముసుగు వ్యక్తుల కారణంగా అకస్మాత్తుగా అల్లర్లకు దారి తీసిందని నిర్వాహకులు తెలిపారు. అయితే కొంత మంది నిరసనకారులు పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయిందన్నారు. ఓ బ్రాడ్‌కాస్టింగ్ యూనిట్‌కు సంబంధించిన కెమేరామెన్‌ని ముసుగు వ్యక్తులు పరుగెత్తించడం టీవీ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement