
అజేయంగా కొలంబియా
జపాన్‌తో మ్యాచ్‌కు ముందే నాకౌట్ బెర్తును ఖాయం చేసుకున్నా కొలంబియా అలసత్వం లేకుండా ఆడింది. జపాన్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో 4-1 తేడాతో గెలుపొందింది.
సియాబా: జపాన్‌తో మ్యాచ్‌కు ముందే నాకౌట్ బెర్తును ఖాయం చేసుకున్నా కొలంబియా అలసత్వం లేకుండా ఆడింది. జపాన్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో 4-1 తేడాతో గెలుపొందింది. 17వ నిమిషంలోనే లభించిన పెనాల్టీని క్వాడ్రడో గోల్‌గా మలిచి కొలంబియాకు ఆధిక్యాన్నందించాడు.
45వ నిమిషంలో ఒకాజకి డైవింగ్ హెడర్‌తో గోల్ సాధించి స్కోరును సమం చేశాడు. ద్వితీయార్ధంలో కొలంబియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. మార్టినెజ్ జాక్సన్ 55వ, 82వ నిమిషాల్లో వరుసగా రెండు గోల్స్ చేశాడు. 90వ నిమిషంలో లభించిన పెనాల్టీని రోడ్రిగెజ్ గోల్‌గా మలచి స్కోరును 4-1కి పెంచాడు.