ఈ గ్రూపులో బెల్జియం ఇప్పటికే నాకౌట్‌కు చేరింది.
ఈ గ్రూపులో బెల్జియం ఇప్పటికే నాకౌట్‌కు చేరింది. అల్జీరియా మూడు పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా తమ చివరి మ్యాచ్‌లో రష్యాతో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు రౌండ్ ఆఫ్ 16కు వెళుతుంది. అటు కొరియాకు కూడా అవకాశాలు లేకపోలేదు. అయితే ఈ జట్టు 3-0తో బెల్జియంను ఓడించాల్సి ఉంటుంది. అదే సమయంలో అల్జీరియా, రష్యా మ్యాచ్ 0-0తో డ్రా కావాల్సి ఉంటుంది. అప్పు డే గోల్స్ తేడాతో కొరియాకు అవకాశం ఉంటుంది.