బోస్నియా-హెర్జెగోవినాపై నైజీరియా విజయం!
బోస్నియా-హెర్జెగోవినాపై నైజీరియా విజయం!
Published Sun, Jun 22 2014 9:02 AM | Last Updated on Mon, Oct 22 2018 5:58 PM
మాటో గ్రోసో(బ్రెజిల్): ప్రపంచ పుట్ బాల్ కప్ పోటీల్లో బోస్నియా-హెర్జెగోవినా నైజిరియా 1-0 తేడాతో విజయం సాధించింది. తొలిసారి పుట్ బాల్ ప్రపంచకప్ పోటీల్లో ప్రవేశించిన బోస్నియా ఆశలపై క్వాలిఫైయింగ్ రౌండ్ లో ఆఫ్రికా ఛాంపియన్ గా నిలిచిన నీళ్లు చల్లింది.
నైజీరియా ఆటగాడు ఒడెర్న్ వింగీ 29 నిమిషంలో గోల్ సాధించాడు. ఆతర్వాత గోల్ సాధించడానికి బోస్నియా చేసిన ప్రయత్నాలను నైజీరియా ధీటుగా ఎదుర్కొంది. దాంతో విజయం నైజీరియా పక్షాన నిలిచింది.
గత రెండు మ్యాచ్ ల్లో నైజీరియా నాలుగు పాయింట్టు సాధించి పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో నిలిచింది. ఇరాన్ పై 1-0 గోల్స్ తేడాతో విజయం సాధించిన అర్జెంటీనా ప్రథమ స్థానంలో ఉంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచేందుకు అర్జెంటినాతో నైజీరియా గురువారం తలపడనుంది.
Advertisement
Advertisement