
ఉరుగ్వే స్టార్ స్వారెజ్ పై 9 గేమ్ లు నిషేధం
ఉరుగ్వే స్టార్ స్వారెజ్ పై వేటు తప్పలేదు. మొన్న ఇటలీతో జరిగిన మ్యాచ్ లో జియార్జియో చిలి భుజాన్ని లూయిస్ స్వారెజ్ కొరికి గాయపరచడంతోఎ ఫిఫా విచారణకు ఆదేశించింది. దీంతో అతనిపై ఏకంగా తొమ్మిది మ్యాచ్ లో నిషేధం పడింది. దీంతో పాటు నాలుగు నెలల పాటు అంతర్జాతీయంగా ఏమ్యాచ్ లోనూ స్వారెజ్ పాల్గొనకుండా ఫిఫా నిషేధం విధించింది. అంటే ఈ స్టార్ ఆటగాడి మెరుపులకు అభిమానులు దూరం కావాల్సిందే. ప్రస్తుతం మంచి ఊపుమీద ఉన్న ఉరుగ్వే గెలిచిన మ్యాచ్ ల్లో స్వారెజ్ కీలకపాత్ర పోషించాడు.
అపార నైపుణ్యమున్న ఉరుగ్వే ఆటగాడు స్వారెజ్‌కు ఎప్పుడూ వివాదాలనే వెంటబెట్టుకుని తిరుగుతుంటాడు. ఏడుగురు మగపిల్లల సంతానంలో నాలుగోవాడిగా పుట్టిన స్వారెజ్ తన కుటుంబంతో ఏడేళ్ల వయసులో రాజధాని మాంటెవిడియోకు తరలివచ్చాడు. అతనికి తొమ్మిదేళ్లు వచ్చేసరికి తల్లిదండ్రులు విడిపోయారు. అప్పుడే ఫుట్‌బాల్‌లో ఓనమాలు నేర్చుకొని 14 ఏళ్ల ప్రాయంలో స్వదేశీ లీగ్ జట్టు నాసియోనల్‌లో చేరాడు. 16 ఏళ్ల వయసులో తనకు రెడ్‌కార్డు చూపెట్టిన రిఫరీని స్వారెజ్ తలతో ఢీకొట్టి వార్తల్లోకెక్కాడు.