
ఏడాదికి ఒక్క బ్రాండ్‌కే రూ.143 కోట్లు
ప్రపంచకప్‌లో అతని అడుగులు తడబడవచ్చు గాక...అతని జట్టు కూడా అద్భుతాలు చేయలేకపోవచ్చు కానీ క్రిస్టియానో రొనాల్డో విలువ మాత్రం ఇప్పటికీ సూపర్‌గానే ఉంది.
ప్రపంచకప్‌లో అతని అడుగులు తడబడవచ్చు గాక...అతని జట్టు కూడా అద్భుతాలు చేయలేకపోవచ్చు కానీ క్రిస్టియానో రొనాల్డో విలువ మాత్రం ఇప్పటికీ సూపర్‌గానే ఉంది. ఈ ప్రపంచకప్‌లో పాల్గొంటున్న ఆటగాళ్లలో ఎండార్స్‌మెంట్‌పరంగా అతనే నంబర్‌వన్‌గా నిలిచాడు.
ఒక్క డీల్ కోసం రొనాల్డోకు ‘నైకీ’ సంస్థ ఏడాదికి చెల్లిస్తున్న మొత్తం ఎంతో తెలుసా...అక్షరాలా 14.1 మిలియన్ పౌండ్లు (దాదాపు రూ. 143 కోట్లు)! వరల్డ్ కప్‌లో చెలరేగిపోతున్న అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీకి ఈ జాబితాలో రెండో స్థానం దక్కింది. అతనికి అడిడాస్ సంస్థ 13.6 మిలియన్ పౌండ్లు (దాదాపు రూ. 137 కోట్లు) ఇస్తోంది. ఇక సొంతగడ్డపై జట్టును చాంపియన్‌గా నిలిపేందుకు శ్రమిస్తున్న బ్రెజిల్ ఆటగాడు నెయ్‌మార్‌కు కూడా నైకీ 9. 5 మిలియన్ పౌండ్లు (దాదాపు రూ. 97 కోట్లు) అందజేస్తోంది. ఈ శ్రీమంత ఫుట్‌బాలర్ల టాప్-10 జాబితాలో రూనీ, గెరార్డ్, లాంపా ర్డ్, స్వారెజ్ కూడా ఉన్నారు.