నాకు జ్వరమొచ్చింది...
ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఏ కార్యాలయంలో చూసినా ఇదే కారణంతో సెలవు పత్రాలు నిండిపోతున్నాయేమో! ఫుట్‌బాల్ మ్యాచ్‌లను చూసేందుకు అందరూ ఏదో ఒక రోగం పేరు చెప్పి పనులకు డుమ్మా కొడుతున్నారు.
ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఏ కార్యాలయంలో చూసినా ఇదే కారణంతో సెలవు పత్రాలు నిండిపోతున్నాయేమో! ఫుట్‌బాల్ మ్యాచ్‌లను చూసేందుకు అందరూ ఏదో ఒక రోగం పేరు చెప్పి పనులకు డుమ్మా కొడుతున్నారు.
అందు కోసం అందరూ దొంగ ‘డాక్టర్ సర్టిఫికెట్ల’ వెంట పడ్డారు. దీనిని అంది పుచ్చుకున్న కొందరు దొంగ సంతకాలు, స్టాంపులతో సిద్ధమైపోయారు. ఏకంగా తమ కేటలాగ్‌లో ఆయా ఆస్పత్రుల వివరాలు, సంతకాలతో కూడిన సర్టిఫికెట్లు ప్రదర్శిస్తూ కావాల్సినవారు సంప్రదించమని కోరుతున్నారు! పారిస్‌లో ఒక రెస్టారెంట్‌లో పని చేసే తొమ్మిది మందిలో స్విట్జర్లాండ్‌తో మ్యాచ్ రోజున ఒకే సారి ఐదుగురు డుమ్మా కొట్టారు. ఇక ఆస్ట్రేలియాలో అయితే అభిమానులందరి తరఫున ఒకే ఒక విజ్ఞప్తి ఆఫీసులకు చేరింది. ‘మీ ఉద్యోగుల పట్ల కాస్త ఓపిగ్గా వ్యవహరించండి. వారు రాత్రంతా ఫుట్‌బాల్ చూడటమనే గొప్ప కార్యక్రమంలో పాల్గొన్నారు’ అని.