People magazine
-
‘మోస్ట్ సెక్సీయెస్ట్ మ్యాన్’ అతడే!
హాలీవుడ్ సింగర్ జాన్ లెజెండ్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే తన పాటలతో జనాలను ఉర్రూతలూగించిన ఈ పాప్ సింగర్ ఈ ఏడాదికి గాను ‘మోస్ట్ సెక్సీయెస్ట్ మ్యాన్’గా నిలిచాడు. ఈ విషయాన్ని ప్రముఖ పీపుల్ మ్యాగజైన్ ప్రకటించింది. ఈ సందర్భంగా జాన్ లెజెండ్ మాట్లాడుతూ.. ‘ప్రముఖ హాలీవుడ్ నటుడు ఇడ్రిస్ ఎల్బా(2018) తర్వాత నేను ఈ అవార్డును పొందడం చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఈ అవార్డుతో నాలో ఒత్తిడి పెరిగింది. ఈ అవార్డు అందుకోవడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాను. అదేవిధంగా కొంచెం భయంగా ఉంది. ఎందుకంటే అంత సెక్సీమెస్ట్ మ్యాన్‌గా ఉన్నానా లేదో అనుమానం కలుగుతోంది. అయితే ఈ విషయంలో గతేడాది విన్నర్‌గా నిలిచిన ఇడ్రిస్ ఎల్బాను అనుసరిస్తాను’అని జాన్ లెజెండ్ పేర్కొన్నారు. 1995 John would be very perplexed to be following 2018 @IdrisElba as #SexiestManAlive. Hell, 2019 John is about as equally perplexed but thank you @People for finding me sexy. I'll take it 🤓 pic.twitter.com/Gw1la5Ebv4 — John Legend (@johnlegend) November 13, 2019 జాన్ లెజెండ్ తన ట్విటర్ ఖాతాలో.. ఒక చిన్ననాటి ఫోటో, ఎల్బా ఫోటో జతచేసి షేర్ చేశారు. ఆ ఫోటోకి ‘1995 నాటి జాన్ లెజెండ్ చాలా కలవరపడుతున్నాడు. కానీ 2018కి ఎంపికైన ఎల్బాను అనుసరిస్తున్నాడు. 2019 నన్ను ‘మోస్ట్ సెక్సీయెస్ట్ మ్యాన్’ గా ఎంపిక చేసిన పీపుల్ మ్యాగజైన్‌కి ధన్యవాదాలు అంటూ కామెంట్ చేసి ఎల్బాకు ట్యాగ్ చేశారు. దీంతో స్పందించిన ఎల్బా ‘ఓ మై గాడ్, ధన్యవాదాలు సోదరా!!! నువ్వు ఈ టైటిల్ పొందడానికి అర్హుడివి.. ఈ విషయం రాక్‌కు చెప్పకు ఆ టైటిల్‌ను గెలిచింది అతనే అనుకుంటున్నాడని సరదాగా అన్నాడు. నేను ఆ టైటిల్ తీసుకున్నవాడిగా.. ఆతనికి చెప్పే హృదయం నాకు లేదు’ అంటూ ఎల్బా రిట్వీట్ చేశారు. My G 🙌🏾🙌🏾Congratulations brother !!! You deserve it. DO NOT TELL @TheRock He still thinks he’s got the title, I didn’t have the heart to tell him when I took it. 😬 https://t.co/3aQrpD1RIe — Idris Elba (@idriselba) November 13, 2019 అదేవిధంగా 2016లో పీపుల్ మ్యాగజైన్‌కి ‘మోస్ట్ సెక్సీయెస్ట్ మ్యాన్’గా ఎంపికైన జాన్సన్ కూడా స్పందిస్తూ.. ‘అభినందనలు సోదరా!.. ఈ క్లబ్‌లోకి నీకు స్వాగతం’ అని కామెంట్ చేశారు. కాగా జాన్ లెజెండ్ ఎమ్మీ, గ్రామీ, ఆస్కార్ వంటి అవార్డులను పొందారు. -
‘నాలాంటి పరిస్థితి ఏ తల్లికీ రాకూడదు’
వాషింగ్టన్ : గర్భవతిని అయ్యాననే సంతోషం క్రిస్టా డేవిస్‌కు ఎంతో కాలం నిలవలేదు. 18 వారాలు నిండిన తర్వాత చెకప్ కోసం వెళ్లిన ఆమె.. పుట్టిన కొన్ని నిమిషాల్లోనే బిడ్డ మరణిస్తుందనే చేదు వార్త వినాల్సి వచ్చింది. కుదిరితే వెంటనే అబార్షన్ చేయించుకోవాలి లేదా బిడ్డ పుట్టిన తర్వాత అవయవాలు దానం చేసి మరికొంత మందికి పునర్జన్మ ఇవ్వొచ్చని సలహా ఇచ్చారు డాక్టర్లు. క్రిస్టా, ఆమె సహచరుడు డేరెక్ లోవెట్‌కు డాక్టర్లు ఇచ్చిన రెండో ఆప్షన్ నచ్చింది. బిడ్డకు జన్మనిచ్చి ఆమెను చిరంజీవిని చేయాలని నిర్ణయించుకున్నారు. అలా క్రిస్మస్ ముందు రోజు తమ గారాల పట్టి ‘రైలీ ఆర్కాడియా లోవెట్’ను భూమ్మీదకు తీసుకువచ్చారు. వారం రోజుల పాటు బతికింది.. ఎనెన్సీఫలీ(మెదడు భాగం రూపుదిద్దుకోకపోవడం)అనే అరుదైన వ్యాధితో జన్మించిన రైలీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ వారం రోజుల పాటు బతికింది. రైలీని చూసిన వైద్యులు నిజంగా తనో అద్భుతం అని, ఆమెకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కాస్త సంతోషాన్నైనా పంచిందని పేర్కొన్నారు. అనంతరం క్రిస్టా, డెరిక్‌ల అనుమతితో రైలీ హార్ట్ వాల్వ్స్‌ను ఇద్దరు పిల్లలకు అమర్చారు. అంతేకాకుండా ఆమె ఊపిరితిత్తులను కూడా సేకరించి మరొకరికి అమర్చేందుకు సిద్ధంగా ఉన్నారు. కాగా ఈ విషయం గురించి రైలీ తల్లి క్రిస్టా పీపుల్ మ్యాగజీన్‌తో మాట్లాడుతూ.. ‘ రైలీ పరిస్థితి తెలియగానే షాక్‌కు గురయ్యాం. మా కూతురిని ఇంటికి తీసుకురాలేమని తెలిసినప్పటికీ తనకి జన్మనివ్వాలని నిర్ణయించుకున్నాం. 40 వారాల తర్వాత వైద్యుల పర్యవేక్షణలో తనకి జన్మనిచ్చా. రైలీ మరణించేంత వరకు నేను, డెరిక్ ఆస్పత్రిలోనే ఉన్నాం. ఆ వారం రోజులు తను అస్సలు ఏడవలేదు. కానీ చనిపోయే ముందు మాత్రం చిన్నగా మూలిగింది. బహుషా ఆ సమయంలో తనకి శ్వాస అందలేదేమో. ఏదేమైనా నాలాంటి పరిస్థితి ఏ తల్లికీ రాకూడదు. రైలీ అవయవాలు దానం చేయడం ద్వారా తాను పునర్జన్మ పొందినట్లుగా భావిస్తున్నా’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. గత నెల మొదటి వారంలో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం నెటిజన్ల మనస్సును ద్రవింపజేస్తోంది. -
ట్రంప్ కోసం ఆయన భార్య న్యాయపోరాటం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై వస్తున్న అసత్య ఆరోపణలపై న్యాయ పోరాటానికి సిద్ధమైంది ఆయన భార్య మెలానియా ట్రంప్. డొనాల్డ్ ట్రంప్‌పై పూర్తిగా కాల్పనికంగా, తప్పుడు వ్యాఖ్యలు రాసినందుకు పీపుల్ మ్యాగజేన్, మాజీ స్టాఫ్ రిపోర్టర్‌పై దావా వేసేందుకు సిద్ధమయ్యారు. పీపుల్ మ్యాగజైన్ రచయిత నటాషా స్టోయినాఫ్ 2005లో ఓ ఇంటర్యూ సమయంలో ట్రంప్ తనను బలవంతంగా ముద్దుపెట్టుకోవడానికి ప్రయత్నించాడంటూ ఆయన అసభ్యకర ప్రవర్తనను బయటపెట్టింది. అయితే ఈ ఆరోపణలు పూర్తిగా అసత్యమంటూ మెలానియం ట్రంప్ కొట్టిపారేశారు. పబ్లికేషన్ ఎడిటోరియల్ డైరెక్టర్ జెస్ క్యాగెల్, రచయిత నటాషా స్టోయినాఫ్లకు నోటీసులు జారీచేశారు. 24గంటల లోపు ఆ స్టోరీను తొలగించాలని లేదంటే మెలానియం నమోదుచేసే దావాపై న్యాయ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె లాయర్ చార్లెస్ హార్డర్ హెచ్చరించారు. ఈ అసత్యపూర్వక రాతలపై క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తూ నటాషాకు ఓ లేఖను పంపారు. అసలు నిజలేమిటంటే అని.. నటాషాకు, ట్రంప్‌కు మధ్య అసలు ఎలాంటి సంభాషణ జరుగలేదని, అసలు వీళ్లిద్దరూ ఫ్రెండ్స్ కారని చార్లెస్ హార్డర్ పేర్కొన్నారు. మొత్తం ఆరుగురు మహిళలు లైగికంగా తమను ట్రంప్ వేధించాడంటూ ఆరోపణలు చేస్తున్నట్టు న్యూయార్క్ టైమ్స్, ఎన్బీసీ, పీపుల్ మ్యాగజేన్ రిపోర్టు చేశాయి. ట్రంప్ ఎన్నడూ మహిళలను వేధించలేదంటూ మెలానియా లాయర్ పేర్కొన్నారు. న్యూయార్క్ టైమ్స్‌కు వ్యతిరేకంగా దావాను నమోదుచేేసే ప్రక్రియ కొనసాగుతుందని ఆయన తెలిపారు. -
సెరీనా స్విమ్‌సూట్ ఫొటోపై అభిమానుల ఆగ్రహం
ఒక్క ఇన్ స్టాగ్రామ్ లోనే 31 లక్షల మంది ఫాలోవర్లు కలిగిన స్టార్ ప్లేయర్ సెరీనాను.. ఫేస్ బుక్, ట్విట్టర్ లను కలుపుకొంటే 87 లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు. గ్రాండ్ స్లామ్ లతోపాటు నెటిజన్ల అభిమానాన్ని కూడా చూరగొన్న ఈ నల్ల కలువకు 'సోషల్ మీడియా చాంపియన్'అని అవార్డులు కూడా వచ్చాయి. అలా సెరీనాను విపరీతంగా ఆరాధించే ఫ్యాన్స్ ఇటీవల ఆమె స్విమ్ సూట్ ధరించిన ఫొటో విషయంలో మాత్రం తీవ్రఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'మోస్ట్ బ్యూటిఫుల్ ఉమన్ ఆఫ్ 2016' శీర్షికతో ప్రఖ్యాత పీపుల్స్ మాగజైన్ ఓ సంచికను రూపొందిస్తోంది. అందులో భాగంగా 34 ఏళ్ల సెరీనా విలియమ్స్ హాట్ హాట్ గా ఫొటోలకు ఫోజులిచ్చింది. ఫొటోషూట్ విశేషాలను అభిమానులకు తెలియజేస్తూ నల్లని స్విమ్ సూట్ ధరించిన ఫొటో ఒకదానిని సెరీనా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. క్షణాల్లోనే లక్షల మందికి చేరిపోయిందా ఫొటో. అంతే, సెరీనా చర్యకు అభిమానులు నొచ్చుకున్నారు. ఇంతకీ ఆమె చేసిన పొరపాటు ఏంటంటే.. సెరీనా పోస్ట్ చేసిన ఫొటోలో ఆమె నడుము భాగం ఉన్నది ఉన్నట్లుగా కాకుండా, సన్నగా(ఫొటోషాప్ తో మార్పులు చేసి) కనిపించింది. అభిమాన క్రీడాకారిణి ఎలా ఉంటుందో తెలుసుకాబట్టి ఆ ఫొటో చూసి విస్తుపోయారు ఫ్యాన్స్! ఎందుకిలా ఫొటోషాప్ చేసిన ఫొటోను పోస్ట్ చేశావ్? అంటూ నిమిషాల వ్యవధిలోనే వందలమంది అభిమానులు సెరీనాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేశారు. దీంతో కంగుతిన్న సెరీనా.. రెండు గంటల్లోపే మొదటి ఫొటోను డిలిట్ చేసి, ఒరిజినల్ ఫొటోను పోస్ట్ చేసింది. అయితే రెండో ఫొటోపైనా కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. పాపం సెరీనా! -
వరల్డ్ సెక్సీయెస్ట్ మ్యాన్‌గా సాకర్ వీరుడు!
లాస్ఏజింల్స్: బ్రిటిష్ సాకర్ లెజెండ్ డేవిడ్ బెక్‌హామ్ మరో ఘనత సొంతం చేసుకున్నారు. ఆన్ ఫీల్డ్‌లోనూ ఆఫ్ ఫీల్డ్‌లోనూ అంతర్జాతీయ సెలబ్రిటీగా పేరొందిన ఆయనను పీపుల్ మ్యాగజీన్ ప్రపంచంలోనే జీవించి ఉన్న వ్యక్తల్లో సుకుమారుడిగా (సెక్సీయెస్ట్ మ్యాన్ అలైవ్) ఎంపిక చేసింది. మ్యాగజీన్ 30వ వార్షికోత్సవ వేడుకల్లో ఈ టైటిల్‌ను అందుకున్న 40 ఏళ్ల బెక్‌హామ్ మాట్లాడుతూ ఈ పురస్కారం అందుకోవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు, ఎంతో సంతోషంగా స్వీకరిస్తున్నట్టు తెలిపాడు. రిటైర్డ్ ఫుట్‌బాల్ ఆటగాడైన డేవిడ్ బెక్‌హామ్ సతీమణి విక్టోరియా బెక్‌హామ్ ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్. దీంతో ఆయన అందంగా కనిపించేందుకు ఆమె ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. సహజంగా అందగాడు, ప్రముఖ ఆటగాడు అయిన బెక్‌హామ్ పెప్సీ, ఆడిదాస్ వంటి ప్రముఖ వాణిజ్య ప్రకటనల్లో నటించాడు. జార్జియో ఆర్మానీ అండర్వేర్లకు మోడల్‌గా వ్యవహరించాడు. నలుగురు పిల్లలకు తండ్రి అయిన బెక్‌హామ్ పీపుల్ మ్యాగజీన్‌తో మాట్లాడుతూ.. తను అందంగా, ఆకర్షణీయంగా, సెక్సీ పర్సన్‌గా ఉంటానని ఎప్పుడూ అనుకోలేదని తెలిపాడు. 41 ఏళ్ల తన భార్య విక్టోరియా మద్దతుతోనే ఈ టైటిల్ లభించిందని అభినందనగా చెప్పాడు.