ఒక్క ఇన్ స్టాగ్రామ్ లోనే 31 లక్షల మంది ఫాలోవర్లు కలిగిన స్టార్ ప్లేయర్ సెరీనాను.. ఫేస్ బుక్, ట్విట్టర్ లను కలుపుకొంటే 87 లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు. గ్రాండ్ స్లామ్ లతోపాటు నెటిజన్ల అభిమానాన్ని కూడా చూరగొన్న ఈ నల్ల కలువకు 'సోషల్ మీడియా చాంపియన్'అని అవార్డులు కూడా వచ్చాయి. అలా సెరీనాను విపరీతంగా ఆరాధించే ఫ్యాన్స్ ఇటీవల ఆమె స్విమ్ సూట్ ధరించిన ఫొటో విషయంలో మాత్రం తీవ్రఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
'మోస్ట్ బ్యూటిఫుల్ ఉమన్ ఆఫ్ 2016' శీర్షికతో ప్రఖ్యాత పీపుల్స్ మాగజైన్ ఓ సంచికను రూపొందిస్తోంది. అందులో భాగంగా 34 ఏళ్ల సెరీనా విలియమ్స్ హాట్ హాట్ గా ఫొటోలకు ఫోజులిచ్చింది. ఫొటోషూట్ విశేషాలను అభిమానులకు తెలియజేస్తూ నల్లని స్విమ్ సూట్ ధరించిన ఫొటో ఒకదానిని సెరీనా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. క్షణాల్లోనే లక్షల మందికి చేరిపోయిందా ఫొటో. అంతే, సెరీనా చర్యకు అభిమానులు నొచ్చుకున్నారు. ఇంతకీ ఆమె చేసిన పొరపాటు ఏంటంటే..
సెరీనా పోస్ట్ చేసిన ఫొటోలో ఆమె నడుము భాగం ఉన్నది ఉన్నట్లుగా కాకుండా, సన్నగా(ఫొటోషాప్ తో మార్పులు చేసి) కనిపించింది. అభిమాన క్రీడాకారిణి ఎలా ఉంటుందో తెలుసుకాబట్టి ఆ ఫొటో చూసి విస్తుపోయారు ఫ్యాన్స్! ఎందుకిలా ఫొటోషాప్ చేసిన ఫొటోను పోస్ట్ చేశావ్? అంటూ నిమిషాల వ్యవధిలోనే వందలమంది అభిమానులు సెరీనాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేశారు. దీంతో కంగుతిన్న సెరీనా.. రెండు గంటల్లోపే మొదటి ఫొటోను డిలిట్ చేసి, ఒరిజినల్ ఫొటోను పోస్ట్ చేసింది. అయితే రెండో ఫొటోపైనా కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. పాపం సెరీనా!
సెరీనా స్విమ్సూట్ ఫొటోపై అభిమానుల ఆగ్రహం
Published Mon, May 2 2016 1:20 PM | Last Updated on Sun, Sep 3 2017 11:16 PM
Advertisement
Advertisement