చిరంజీవి ఇంటి​కి భారీగా అభిమానులు | Chiranjeevi Fans Reached His House in Hyderabad | Sakshi
Sakshi News home page

చిరంజీవి ఇంటి​ వద్ద భారీగా పోలీసులు

Published Sat, Feb 29 2020 5:40 PM | Last Updated on Sat, Feb 29 2020 5:54 PM

Chiranjeevi Fans Reached His House in Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి ఇంటి వద్ద శనివారం భారీగా పోలీసులను మొహరించారు. చిరంజీవి ఇంటిని ముట్టడిస్తామని అమరావతి పరిరక్షణ జేఏసీ పిలుపుఇచ్చినట్టుగా వార్తలు రావడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలివచ్చారు. అఖిల భారత చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు రవణం స్వామినాయుడు నాయకత్వంలో మెగా అభిమానులు చిరు ఇంటి వద్దకు చేరుకున్నారు. తమ అభిమాన హీరోకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ఎటువంటి ఉ​ద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.

చిరంజీవి ఇంటిని ముట్టిడించేందుకు వస్తే సరైన రీతిలో బుద్ధి చెబుతామని స్వామినాయుడు అన్నారు. మెగాస్టార్‌ ఇంటిని ముట్టడించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. చిరంజీవి ఇప్పుడు రాజకీయాల్లో లేరని, సినిమాలు చేసుకుంటున్నారని తెలిపారు. ఆయనపై ఎటువంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేసినా ఊరుకోమని హెచ్చరించారు. చిరంజీవి గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే గట్టిగా బుద్ధిచెబుతామన్నారు. తమకు పార్టీలతో సంబంధం లేదని, చిరంజీవి వెంటే ఉంటామని స్పష్టం చేశారు. మూడు రాజధానులకు చిరంజీవి మద్దతు పలికితే తప్పేంటని ప్రశ్నించారు. రాజకీయ ప్రోద్బలంతోనే చిరు ఇంటి ముట్టిడికి సిద్ధమయ్యారా అని అమరావతి జేఏసీని ప్రశ్నించారు. కాగా, చిరంజీవి ఇంటి ముట్టడికి తాము పిలుపునివ్వలేదని అమరావతి పరిరక్షణ సమితి తెలిపింది. (చదవండి: క్లారిటీ ఇచ్చిన అమరావతి జేఏసీ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement