![Can You Drink Coffee While You're Pregnant? - Sakshi](/styles/webp/s3/article_images/2023/02/11/coffee.jpg.webp?itok=Gd3iorOZ)
ఇటీవల కాలంలో తరచు వినవస్తున్న మాట ‘గర్భిణులు కాఫీ తాగకూడదు!’ అని. బహుశా అది వాట్సప్ లేదా సోషల్ మీడియాలో వ్యాపించిన సందేశాల వల్ల కావచ్చు. ఇంతకీ ఇది నిజమేనా? వైద్య నిపుణులు ఏమంటున్నారు? చూద్దాం..
కాఫీని కొకోవా, కాఫీ చెట్ల గింజల నుంచి తీసిన పొడితో తయారు చేస్తారనే విషయం తెలిసిందే. ఈ గింజల్లో కెఫీన్ అధికంగా ఉంటుంది. ఇది నాడీవ్యవస్థ చురుగ్గా వ్యవహరించడంలో తోడ్పడుతుంది. అందువల్లే కాఫీని తక్షణ శక్తిని అందించే ఉత్తేజపరిచేషధంగా భావిస్తారు. కాఫీలోని కెఫీన్ మన ఆహారనాళంలో త్వరగా జీర్ణమై కలసి΄ోవడం వల్లే ఇలా జరుగుతున్నట్లు వైద్య నిపుణులు కనుగొన్నారు. అయితే, గర్భిణులు కాఫీ తాగినప్పుడు వారిలో కెఫీన్ జీర్ణమవడానికి చాలా సమయం పడుతుంది. అంతకుమించి గర్భంపై కెఫీన్ వ్యతిరేక ఫలితాలు చూపడానికి ఇతమిత్ధంగా ఇప్పటికీ కారణాలు తెలియదు. అలాగే దీని ప్రభావం ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉండడమూ వైద్యనిపుణులు గమనించారు.
మోతాదు మించక΄ోతే ముప్పు లేదు
గర్భిణులు కాఫీ తాగొద్దా అంటే మాత్రం నిస్సందేహంగా తాగొచ్చంటున్నారు ది అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఆబ్‌స్ట్రెస్టీషియన్ ్స అండ్ గైనకాలజిస్ట్స్(ఏసీఓజీ) వైద్యులు. కానీ ఎట్టిపరిస్థితుల్లోనూ రోజువారీ కెఫెన్ పరిమాణం 200 మిల్లీగ్రాములకు మించకూడదని చెబుతున్నారు. ఆ స్థాయిని మించితే మాత్రం గర్భంలోని శిశువుపై దుష్పరిణామాలు చూపించే ప్రమాదముందంటున్నారు. సాధారణంగా కప్పు (240 ఎం.ఎల్) కాఫీలో 96 మిల్లీగ్రాముల కెఫీన్ ఉంటుంది. దీని ప్రకారం ఎక్కువ నివేదికలు చెప్పేదేంటంటే గర్భిణులు రోజుకు రెండు కప్పులకు మించి కాఫీ తాగకూడదు.
Comments
Please login to add a commentAdd a comment